మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను?
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను
అతడు ఆయన ఎదుట పెరిగెను
అతనికి సురూపమైనను సొగసైనను లేదు
మనమతని చూచి, అపెక్షించునట్లుగా
అతని యందు సురూపము లేదు .
అతడు త్రునీకరింప బడిన వాడును ఆయెను
మనుష్యుల వలన విసర్జింప బడినవాడును
వ్యసనాక్రాంతుడు గాను వ్యాది ననుభవించినవాడు గాను
మనుష్యులు చూడనోల్లని వాడు గాను ఉండెను.
అతడు త్రునీకరింప బడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
మన వ్యసనములను వహించెను
అయినను మొత్తబడినవానిగాను
దేవుని వలన భాదింపబడిన వాని గాను
శ్రమ నొందిన వానిగాను మన మతనిని ఎంచితిమి .
మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను
మన దోషములను బట్టి నలుగగోట్టబడెను
మన సమాధానార్థ మయిన శిక్ష అతని మీద పడెను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది
మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి
మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను.
యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను
బాధింప బడినను అతడు నోరు తెరవలేదు
వధకు తేబడు గొర్రె పిల్లయు
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు
మౌనంగా నుండునట్లు
అతడు నోరు తెరువలేదు .
అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను
అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొట్టబడెను గదా.
సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను
అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణ మైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింప బడెను.
No comments:
Post a Comment