Saturday, September 18, 2010
దేవుని ప్రేమ
యోహాను 3:16 :
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రయించెను.
దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ప్రేమ ఇంతే అని చెప్పడానికి కొలతలు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, మనుష్యుల యొక్క ఆలోచనలకు, జ్ఞానానికి అందనటువంటిది దేవుని ప్రేమ. మనిష్యుల ప్రేమ కు పరిమితి ఉంటున్నది, వారు కొంత వరకు మాత్రమె ప్రేమించి, ఆపై బోరు కొట్టినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, కొత్తదనం కావాలనుకున్నప్పుడు, నమ్మకం పోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రేమించడం మానివేస్తారు . మనుష్యుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఎదుటి వ్యక్తీ నుండి ఏదో ఆశించి ప్రేమిస్తారు. ప్రేమించి నట్టు నటిస్తారు కూడా.
ఇద్దరు యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు మద్య ప్రేమ. ఒకరు అందాన్ని చూసి ప్రేమిస్తారు, ఒకరేమో డబ్బును చూసి ప్రేమిస్తారు, ఇంకొకరేమో ఆకర్షననే ప్రేమనుకుని జీవిస్తారు, కొంతమంది టైం పాస్ కోసం ప్రేమిస్తుంటారు. ఈ ప్రేమ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది, అందం ఉన్నంత వరకే ఉంటుంది, అవసరం తీరెంతవరకు లేదా కోరిక తీరెంత వరకే ఉంటున్నది. తరువార ప్రేమ కు గుడ్ బాయ్ చెప్పేస్తారు. ఇది ఈ కాలపు యువకుల మధ్య ఉండే ప్రేమ.
భార్యా భర్త ల మధ్య ప్రేమ. పెళ్లి అయిన కొన్ని రోజుల వరకే వీరి మధ్య ప్రేమ ఉంటుంది. ఆ తరువాత భర్త భార్య పై ఆదిపత్యం, భార్య భర్త పై తిరుగుబాటు, ఇద్దరి మద్య ప్రేమ సన్నగిల్లుతూ ఉంటున్నది. వారి జీవితం లో ఎన్నో సార్లు కలతలు, మనస్పర్థలు వస్తుంటాయి, ఒకరి పైన ఒకరు అసహనాన్ని వ్క్యక్త పరుస్తుంటారు. చూడటానికి బయటికి ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తారు కాని వారి హృదయం లో ప్రేమ ఉండదు. ప్రేమ సంగతి అటుంచితే భర్త పట్ల భార్యకు గౌరవము ఉండదు, భార్య అంటే భర్త కు గౌరవము ఉండదు. ఇది ఈ నాటి భార్య భర్తల మద్య ఉండే ప్రేమ.
తల్లిదండ్రులకు పిల్లలకు మద్య ఉండే ప్రేమ. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, తమ పిల్లలకు విద్య బుద్దులు నేర్పించి, పెంచి పెద్ద చేసి, ఒక మంచి జీవితంలో స్తిర పడేటట్లు చేస్తే, తల్లి దండ్రులు వారికి భారమై పోతూ ఉన్నారు. వారి ముసలి తనము లో వారికి అన్నం పెట్టె దిక్కు లేకుండా పోతుంది. తల్లి దండ్రుల నుండి పిల్లలు ఎంతో ప్రేమ ను అందుకున్నారు, కాని వారి ముసలి తనము లో వారి ప్రేమను వారికి తిరిగి ఇవ్వలేక పోతున్నారు ఈ కాలపు కొడుకులు, కూతుర్లు. కొంత మంది తల్లి దండ్రులు పిల్లలను కంటున్నారు కాని వారిని పెంచలేక గాలికి వదిలేస్తున్నారు, కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఆ చిన్నారు చేతులతో వెట్టి చాకిరి పనులకు చేయిస్తున్నారు. తల్లిదండ్రులకు గుక్కెడు అన్నం పెట్ట లేక అనాద శరనాలయములో వదిలే పిల్లలు ఉన్నారు, పిల్లలను సాదలేక అనాద శరనాలయములో వదిలే తల్లిదండ్రులు ఉన్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటున్నారని పిల్లలను హింసిస్తున్న తల్లులు ఉన్నారు. ఇది తల్లి దంరుల మధ్య ప్రేమ.
సహోదరుల మద్య ప్రేమ. ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు ఆస్తుల కోసము, పదవుల కోసము, పెత్తనము కోసము, కొట్టుకు చస్తున్నారు. ఇది ధనవంతులలో ఉన్నది, పేద వారి మధ్య కుడా ఉన్నది. పెళ్ళిళ్ళు అయి భార్యలు వచ్చిన తరువాత ఎవరి దారి వారిదే. ఎన్నో కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య ప్రేమలు లేవు, నలుగురిలో కి వచ్చినప్పుడు మాటా మంచి మాట్లాడుకుంటారు, కాని లోపల ఒకరంటే ఒకరికి పడదు. సొంత అన్నదమ్ముల మధ్యే ఇట్లుంటే బయట బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునే వారి మధ్య ప్రేమ ఉంటున్నదా?. ఇది పచ్చి అబద్దం.
ఈ లోకం ప్రేమ వివిధ రూపాలతో, వివిధ వేషాలతో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలను మోసం చేస్తూ, వింత పోకడలు పోతుంది. ఇద్దరి మగవారి మధ్య ప్రేమ. ఇద్దరి ఆడవాళ్ళ మధ్య ప్రేమ అంటూ కొత్త ప్రేమలను సృష్టిస్తూ ఉంది. ఇది సాతాను ప్రేమ. దీనితో చాల జాగ్రత్తగా ఉండాలి. ఇది అసాంతము నరకానికి తీసుకు పోతున్నది.
అయితే దేవుని ప్రేమ మనుష్యుల ప్రేమ వంటిది కాదు. అది పవిత్రమైనది, పరిశుద్దమైనది, విలువైనది, చివరి వరకు ఉండేది. దేవుని ప్రేమ లో స్వార్థం లేదు, దేనిని ఆశించడం లేదు. దేవుని ప్రేమలో త్యాగం ఉన్నది, జాలి, కరుణ, దయ, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఉన్నాయి. విడువని ప్రేమ.
రోమ 3:23:
"ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ ను పొందలేక పోవుచున్నారు".
ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యము చెబుతుంది, ఏ జాతి వారైన, ఏ కులం వారైన, ఏ మతం వారైన, తెల్లవారైనా, నల్ల వారైనా, ముసలివారైనా, పడచువారైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైన, పురుషులైన, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా సరే అందరూ కూడ పాపం చేసిన వారే, అందరూ పాపం చేశారు. అందరూ ఎలా పాపం చేశారు అంటే ఈ లోకం లోకి మొదటి మనుష్యుడు ఆదాము. ఆది 2:7 - 3:11
to be continued.......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment