Monday, September 6, 2010

ప్రార్థన లో ఉన్న శక్తి

 నాతోదూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. (అ.కా.27 :25 )

కొన్నేళ్ళ క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్లాను.  ఆ ఓడ కెప్టైన్ చాల నిష్ట గల క్రైస్తవుడు.  న్యూ ఫౌండ్ల్యాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు.  " కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాలలో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది.  బ్రిస్టల్ వాడైనా జార్జి ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను,  ఆ పొగమంచు వల్ల ఆ ఓడను ముందుకు తీసుకుని వెళ్ళడం కష్ట తరమాయెను. అంతలో జార్జి ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు.  'కెప్టైన్ ' శనివారం సాయంత్రంలోగా నేను క్యూబిక్ సిటి లో ఉండాలి' అన్నాడు.  అది అసాద్యం అన్నాను, అప్పుడాయన అన్నాడు.  " సరే, మీ ఓడను అక్కడికి చేర్చలేక పొతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు.  గత యాబై ఎనిమిది సం.లు గా నేనెప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు.  రండి, క్రిందికి వెళ్లి ప్రార్థన చేద్దాం. 
     ఆ దైవ జనుని వైపు చూస్తూ ఈయన ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకుని వచ్చాడో అనుకుంటూ " మిస్టర్ ముల్లర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా? అన్నాను.  నాకు తెలియదు అని అతను సమాధానమిచ్చాడు. " నేను దట్టం గా పట్టిన మంచును చూద్దాం లేదు.  సజీవుడైన నా దేవుని చూస్తున్నాను.  ఆయన నా జీవితంలో ఎదురైనా ప్రతి పరిస్తితిని చక్కబెడతాడు. 
     అతడు మోకరించి సాధారణమైన చిన్న ప్రార్థన చేసాడు. అతడు ప్రార్థించడం ముగించిన తరువాత నేను ప్రార్థన చెయ్యబోయాను.  కాని అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు.  "ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా? నాకయితే జవాబిచ్చేశాడు అని నమ్మకముంది. ఇక నువ్వు ప్రార్తిన్చాల్సిన అవసరం లేదు." అన్నాడు.
     ఆశ్చర్యం గా అతని వంక చూశాను. అతడాన్నాడు కెప్టెన్ , ఏబై ఏడు సం.ల నుంచి దేవుడు నాకు తెలుసు.  ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ 58 సం.లలో కనీసం ఒక్కటి కూడ లేదు.  లేచి తలుపు తెరిచి చూడు.  పొగమంచు తొలగిపోయి ఉంటుంది." లేచి చూశాను.  నిజమే! అంతా నిర్మలంగా ఉంది.  శనివారం నాడు జార్జి ముల్లర్ క్యూబిక్ సితిలో ఉన్నాడు.  వాక్య పరిచర్య చేశాడు.
     ప్రియ స్నేహితుడా, నీ చుట్టూ కారు చీకటి కమ్ముకున్నదా? ఒక్క అడుగు కూడ వేయలేని పరిస్తితులలో చిక్కుకున్నావా? ఎక్కడికైతే వేల్లాలనుకున్నావో ఏమైతే చేయ్యాలనుకోన్నావో దేనినయితే సాధించాలని తాపత్రయపడ్డావో దాని సాధించలేక అపజయముతో ఆటన్కాలతో బందిన్చాబడి నిరుత్సాహంలో కూరుకోనిపోయావా? దిగులు పడవద్దు.  జార్జి ముల్లర్ వలె దేవునిపై విశ్వాసం ఉంచు.  నీ దేవుడు ఇరుకులో విశాలత కలుగాజేస్తాడని నమ్ము.  ఈ రోజు ఏ స్తితిలో చతికిల పడి పోయావో ఆ స్థితిలో నువ్వు ఉండిపోయడానికి వీలు లేదు.  నువ్వు సాధించాల్సింది చేయాల్సింది చాల ఉంది.  లే! లెమ్ము! తెజరిల్లుము నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది.  (యెషయ 60 :1 ) లేచి ప్రభువు కొరకు చీకటి లోకంలో ప్రకాశించు.  ప్రభువు కొరకు జీవించు.
                       ---- కల్వరి కాంతి పత్రిక/ ఎడారిలో సెలయేర్లు / 

No comments:

Post a Comment