Saturday, November 20, 2010

దేవుని వాక్యపు శక్తి ఏమిటి?

* వాక్యము శక్తి వంతమైనది.
* దేవుని వాక్యమునకు ఒక పాపిని తిరిగి జన్మింప  చేయుటకు శక్తి ఉంది.
* ఒక పాపిని పరిశుద్దునిగా చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి గలదు.
* దేవుని వాక్య మూలముగా తిరిగి జన్మించినవారై యదార్థముగా ఒకరినొకరు ప్రేమించుకోనగలరు.
* దేవుని వాక్యము సదాకాలము నిలిచి ఉండును.
* దేవుని వాక్యము విత్తనము వలె మండుచున్న హృదయములలో పడి ఫలించును.
(యాకోబు1:18, 1 పేతురు 1:23, 1 తెస్సా 2:13)
* పరిశుద్ద పరచుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉంది.
(యోహాను 15:3,  ఎఫేసి 5:26)
* సంతోషమును ఇచ్చుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉంది.
(కీర్తనలు 119:111, 19:8)
* మనము రక్షణలో ఎదుగునట్లు చేయుటకు దేవేని వాక్యమునకు శక్తి కలదు.
(1పేతురు 2:2)
* తెలివి లేని వారిని జ్ఞానవంతులుగా చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి కలదు.(కీర్తన 19:7)
* విధేయత, నిరీక్షణ, మరియు విశ్వాసము కలిగిమ్పచేయుతకు దేవుని వాక్యమునకు శక్తి ఉండెను.
(యోహాను 20:31, కీర్తన 119:49, రోమ 10:17, 15:4,  ద్వి.కా. 17:19,20)
* దేవుని వాక్యము వలననే యేసు ప్రభువు నందు విశ్వాసము వస్తుంది.
* విశ్వాసము నిత్య జీవమునకు నడిపిస్తుంది.
* సువార్త లో యేసు ప్రభువును గురించిన సమాచారమును మరియు ఆహ్వానమును కలిగి యుండవలెను.  
* అపవాది పైన విజయమును కలిగింప చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉన్నది.
(1 యోహాను  2:14)
* రహస్య పాపమును బయలుపరచుటకు దేవుని వాక్యమునకు శక్తి కలదు.
(హెబ్రీ 4:12, ఇర్మియ 23:29)

No comments:

Post a Comment