Thursday, September 23, 2010

కీర్తనలు 6 వ అధ్యాయము:

యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము
నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము
యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము 
యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము 
నా ప్రాణము బహుగా అదరుచున్నది
యెహోవా, నీవు ఎంత వరకు కరునింపక  యుందువు ?
యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము 
నీ కృప ను బట్టి నన్ను రక్షింపుము 
మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు 
పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదురు?
నేను మూలుగుతూ అలసి యున్నాను
ప్రతి రాత్రి యు  కన్నీరు విడుచుచు నా పరుపు తేల జేయుచున్నాను.
నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి
నాకు బాధ కలిగించువారిచేత అవి చివికి యున్నవి.
యెహోవా నా రోదన ధ్వని విని యున్నాడు 
పాపము చేయువారలార, మీరందరు నా యెద్ద నుండి తొలగి పోవుడి.
యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు 
యెహోవా నా ప్రార్థన నంగీకరిచును .
నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు
వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

Tuesday, September 21, 2010

యెషయ 53 వ అధ్యాయము

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను?
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను 
అతడు ఆయన ఎదుట పెరిగెను 
అతనికి సురూపమైనను సొగసైనను లేదు 
మనమతని చూచి, అపెక్షించునట్లుగా
అతని యందు సురూపము లేదు .
అతడు త్రునీకరింప బడిన వాడును ఆయెను 
మనుష్యుల వలన విసర్జింప బడినవాడును 
వ్యసనాక్రాంతుడు గాను వ్యాది ననుభవించినవాడు గాను 
మనుష్యులు చూడనోల్లని వాడు గాను ఉండెను.
అతడు త్రునీకరింప బడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి 
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
మన వ్యసనములను వహించెను 
అయినను మొత్తబడినవానిగాను
దేవుని వలన భాదింపబడిన వాని గాను
శ్రమ నొందిన వానిగాను మన మతనిని ఎంచితిమి .
మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను
మన దోషములను బట్టి నలుగగోట్టబడెను
మన సమాధానార్థ మయిన శిక్ష అతని మీద పడెను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది
మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి 
మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను.
యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను 
బాధింప బడినను అతడు నోరు తెరవలేదు 
వధకు తేబడు గొర్రె పిల్లయు 
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు
మౌనంగా నుండునట్లు 
అతడు నోరు తెరువలేదు .
అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను 
అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొట్టబడెను గదా.
సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను 
అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణ మైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింప బడెను.  

Saturday, September 18, 2010

దేవుని ప్రేమ




 యోహాను 3:16 : 
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.  కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రయించెను.
     దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ప్రేమ ఇంతే అని చెప్పడానికి కొలతలు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు,  మనుష్యుల యొక్క ఆలోచనలకు, జ్ఞానానికి అందనటువంటిది దేవుని ప్రేమ.  మనిష్యుల ప్రేమ కు పరిమితి ఉంటున్నది, వారు  కొంత వరకు మాత్రమె ప్రేమించి, ఆపై బోరు కొట్టినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, కొత్తదనం కావాలనుకున్నప్పుడు, నమ్మకం పోయినప్పుడు, కష్టాలు  వచ్చినప్పుడు, ప్రేమించడం మానివేస్తారు .  మనుష్యుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఎదుటి వ్యక్తీ నుండి ఏదో ఆశించి ప్రేమిస్తారు.  ప్రేమించి నట్టు నటిస్తారు కూడా. 
     ఇద్దరు యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు మద్య ప్రేమ.  ఒకరు అందాన్ని చూసి ప్రేమిస్తారు, ఒకరేమో డబ్బును చూసి ప్రేమిస్తారు, ఇంకొకరేమో ఆకర్షననే ప్రేమనుకుని జీవిస్తారు, కొంతమంది టైం పాస్ కోసం ప్రేమిస్తుంటారు. ఈ ప్రేమ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది, అందం ఉన్నంత వరకే ఉంటుంది, అవసరం తీరెంతవరకు లేదా కోరిక తీరెంత వరకే ఉంటున్నది. తరువార ప్రేమ కు గుడ్ బాయ్ చెప్పేస్తారు. ఇది ఈ కాలపు యువకుల మధ్య ఉండే ప్రేమ.
     భార్యా భర్త ల మధ్య ప్రేమ. పెళ్లి అయిన కొన్ని రోజుల వరకే వీరి మధ్య ప్రేమ ఉంటుంది. ఆ తరువాత భర్త భార్య పై ఆదిపత్యం, భార్య భర్త పై తిరుగుబాటు, ఇద్దరి మద్య ప్రేమ సన్నగిల్లుతూ ఉంటున్నది. వారి  జీవితం లో ఎన్నో సార్లు కలతలు, మనస్పర్థలు వస్తుంటాయి, ఒకరి పైన ఒకరు అసహనాన్ని వ్క్యక్త పరుస్తుంటారు. చూడటానికి బయటికి ప్రేమగా  ఉన్నట్లు కనిపిస్తారు కాని వారి హృదయం లో ప్రేమ ఉండదు. ప్రేమ సంగతి అటుంచితే భర్త పట్ల భార్యకు గౌరవము ఉండదు, భార్య అంటే భర్త కు గౌరవము ఉండదు. ఇది ఈ నాటి భార్య భర్తల మద్య ఉండే ప్రేమ.
     తల్లిదండ్రులకు పిల్లలకు మద్య ఉండే ప్రేమ.  తల్లిదండ్రులు   ఎంతో  కష్టపడి, తమ పిల్లలకు  విద్య బుద్దులు నేర్పించి, పెంచి పెద్ద చేసి, ఒక మంచి జీవితంలో స్తిర పడేటట్లు చేస్తే, తల్లి దండ్రులు వారికి భారమై పోతూ ఉన్నారు. వారి ముసలి తనము లో వారికి  అన్నం పెట్టె దిక్కు లేకుండా పోతుంది. తల్లి దండ్రుల నుండి పిల్లలు ఎంతో ప్రేమ ను అందుకున్నారు, కాని వారి ముసలి తనము లో వారి ప్రేమను వారికి తిరిగి ఇవ్వలేక పోతున్నారు ఈ కాలపు కొడుకులు, కూతుర్లు.  కొంత మంది తల్లి దండ్రులు పిల్లలను కంటున్నారు కాని వారిని పెంచలేక గాలికి వదిలేస్తున్నారు, కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఆ చిన్నారు చేతులతో వెట్టి చాకిరి పనులకు చేయిస్తున్నారు. తల్లిదండ్రులకు గుక్కెడు అన్నం పెట్ట లేక  అనాద శరనాలయములో వదిలే పిల్లలు ఉన్నారు, పిల్లలను సాదలేక అనాద శరనాలయములో వదిలే తల్లిదండ్రులు ఉన్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటున్నారని పిల్లలను హింసిస్తున్న తల్లులు ఉన్నారు. ఇది తల్లి దంరుల మధ్య ప్రేమ.
సహోదరుల మద్య ప్రేమ.  ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు ఆస్తుల కోసము, పదవుల కోసము, పెత్తనము కోసము, కొట్టుకు చస్తున్నారు.  ఇది ధనవంతులలో ఉన్నది, పేద వారి మధ్య కుడా ఉన్నది. పెళ్ళిళ్ళు అయి భార్యలు  వచ్చిన తరువాత ఎవరి దారి వారిదే. ఎన్నో కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య ప్రేమలు లేవు, నలుగురిలో కి వచ్చినప్పుడు మాటా మంచి మాట్లాడుకుంటారు, కాని లోపల ఒకరంటే ఒకరికి పడదు. సొంత అన్నదమ్ముల మధ్యే ఇట్లుంటే బయట బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునే వారి మధ్య ప్రేమ ఉంటున్నదా?. ఇది పచ్చి అబద్దం.
      ఈ లోకం ప్రేమ వివిధ రూపాలతో, వివిధ వేషాలతో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలను మోసం చేస్తూ, వింత పోకడలు పోతుంది. ఇద్దరి మగవారి మధ్య ప్రేమ.  ఇద్దరి ఆడవాళ్ళ మధ్య ప్రేమ అంటూ కొత్త ప్రేమలను సృష్టిస్తూ ఉంది.  ఇది సాతాను ప్రేమ. దీనితో చాల జాగ్రత్తగా ఉండాలి.  ఇది అసాంతము నరకానికి తీసుకు పోతున్నది.
     అయితే దేవుని ప్రేమ మనుష్యుల ప్రేమ వంటిది కాదు.  అది పవిత్రమైనది, పరిశుద్దమైనది, విలువైనది, చివరి వరకు ఉండేది.  దేవుని ప్రేమ లో స్వార్థం లేదు, దేనిని ఆశించడం లేదు. దేవుని ప్రేమలో త్యాగం ఉన్నది, జాలి, కరుణ, దయ, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఉన్నాయి. విడువని ప్రేమ.
రోమ 3:23: 
"ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ ను పొందలేక పోవుచున్నారు".
     ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యము చెబుతుంది, ఏ జాతి వారైన, ఏ కులం వారైన, ఏ మతం వారైన, తెల్లవారైనా, నల్ల వారైనా, ముసలివారైనా, పడచువారైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైన, పురుషులైన, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా సరే అందరూ కూడ పాపం చేసిన వారే, అందరూ పాపం చేశారు.  అందరూ ఎలా పాపం చేశారు అంటే ఈ లోకం లోకి మొదటి మనుష్యుడు ఆదాము.   ఆది 2:7 - 3:11
 


                                            to be continued.......
 
    
    

Sunday, September 12, 2010

ఎస్. రత్న రాజు గారి క్లుప్త సాక్ష్యము

నేనెలా క్రీస్తుని తెలుసుకొంటిని?
     పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలో ఉన్న అట్లపాడు అను గ్రామములో పుట్టి పెరిగితిని, మన రక్షకుడైన యేసు క్రీస్తు ని గూర్చి ఎరుగక జీవిస్తుండగా 1956 వ సం.లో మా చెల్లుకు జబ్బు చేసింది.  ఇక బ్రతుకుట కష్టమని డాక్టర్ ఇంటికి పంపి వేశాడు.  మేమంతా నిరాశ పడ్డాము. చివరి చూపుగా మా గ్రామస్తులు చాల మంది వచ్చి చూచి పోతున్నారు, కొందరు క్రైస్తవులు వచ్చి చూచి, యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తె బాగావుతున్దన్నారు. ఆ మాట నిరాశ లో ఉన్న మాకు ఆశాజనక మయింది.  మాకు ప్రార్థించుట తెలియదు.  మీరు వచ్చి చేయగలిగితే మా కేమి అభ్యంతరము లేదన్నారు నా తల్లిదండ్రులు.  ఆ దైవ బిడ్డలు రాత్రులు వచ్చి ప్రార్థన చేస్తుండే వారు.  దేవుని మహా కృప వలన మా చెల్లెకు దిన దినము మార్పు వచ్చి పూర్తి స్వస్తత కలిగింది. మేమెంతో ఆనందిన్చితిమి.  జరిగిన స్వస్తత కార్యాన్ని బట్టి మన దేవుళ్ళ కంటె యేసు క్రీస్తు దేవుడు గొప్పవాడని గ్రహించాము.
     అప్పటి వరకు హైందవ సాంప్రదాయం ప్రకారంగా నా చేతులతో కొబ్బరి కాయలు కొట్టి, కోళ్ళను కోసితిని, అది విడచి నా అవసరములకై యేసు ప్రభువు నామములో ప్రార్థించుట ఆరంబించితిని.  వచ్చీ రాని ప్రార్థనల నాలకించిన ప్రభువు మేళ్ళు చేయుచూ నా విశ్వాసాన్ని బలపరిచారు.  దేవునికి స్తోత్రములు. 
యేసుక్రీస్తు నిజమైన దేవుడు 
     వరాలు పొందిన భక్తులు వస్తున్నారని విని వారిని చూడాలన్న ఆశతో 1959  పిబ్రవరి లో ఏలూరులో జరిగిన క్రైస్తవ సభలకు వెళ్ళితిని. అదే మొదటి సారి, అదంతా నాకు వింతగా ఉంది.  దైవ భక్తుడు రోగులందరి కొరకు ఒకేసారి ప్రార్థించగా అనేకులు బాగుపడి సాక్ష్యాలిస్తున్నారు.  కాని నేను నమ్మలేక పోయాను.  నిజంగా వీళ్ళందరూ ఒక్క ప్రార్థనకు బాగైతే ఇక డాక్టర్ ఎందుకు? అని అనుకున్నాను.  ఇదెంత వరకు నిజమో అని అన్వేషించడం మొదలు పెట్టాను.  ప్రత్యక్షంగా నేను చూడగలిగిన స్వస్తతలను బట్టి, అనేకులిచ్చే సాక్ష్యాలను బట్టి ఏసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన సర్వశక్తిమంతుడని నాలో పూర్తి నమ్మకమేర్పడింది.
యేసుక్రీస్తు నా రక్షకుడు 
     ఆ కూటాలలో భక్తులు బోధిస్తున్న బోధలు ఇక శ్రద్దగా వింటున్నాను.  ఆ బోధలు, అనేకులిచ్చే అనుభవ సాక్ష్యాలు నన్ను క్రీస్తులోకి కాస్త ముందుకు నడిపాయి.  పాపినన్న వివేచన లేకుండా కలిగించాయి.  నేను చేసిన పాపాలు నన్ను నిత్య నరకానికి ఈడ్చుకుపోతున్నాయని గ్రహించాను.  పాపాలు వలన రానైయున్న ఘోర శిక్ష నుండి విడుదల పొందుటకు ఏసుక్రీస్తు తప్ప మరొక మార్గము లేదని ఎరిగి పశ్చాత్తాపముతో నా పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాను.  దాంతో నా హృదయంలో ఏదో భారము తొలగి పోయినట్టయింది.  ఆత్మ శాంతి, ఆనందము, నాలో పెల్లుబికినట్టుంది.  ఆత్మ శాంతి యొక్క నిర్వచనము అప్పుడు గ్రహించాను.
     అప్పటి వరకు శిలువ విలువ నాకర్థము కాలేదు.  నాకు కలిగిన పాప క్షమాపణ ను బట్టి శిలువ విలువ అర్థమయింది.  ఏసుక్రీస్తు నా పాపపు శిక్ష ను శిలువలో భరించి ఆ రుణాన్ని తీర్చివేసి నాకీ గొప్ప రక్షణ భాగ్యాన్ని సిధపరిచాడని గ్రహించి ఆయనకు నా హృదయాన్ని ప్రతిస్టించాను.  పాపినైన నా కొరకు ఆయన శిలువలో ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ నా కండ్లకు కట్టినట్లయింది ఇక ఏసుక్రీస్తు దేవుడు మాత్రమే కాక నా స్వంత రక్షకుని గాను, నా ప్రభువుగాను అంగీకరించి నా జీవితాన్ని ఆయనకు ప్రతిస్తించితిని.  పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందితిని.  జీవితం మారుటతో పేరు కూడా మార్చారు  దైవ జనులు.  మంగ రాజు కు బదులు రత్న రాజు అని.
ప్రభువు దర్శనము - సేవకొరకై పిలుపు 
     నేను ఇంటికి వచ్చి నా గదిలో ఉన్న విగ్రహ సంబంధమైన వన్ని తీసివేసి ప్రార్థించుట ఆరంభించితిని.  దినాలు గడిచేకొలది నా భక్తి, ప్రార్థన, దేవునిపై ఆశక్తి పెరిగించి.  ఆయన సన్నిధిలో గంటలు గడచి పోతున్నాయి.  ప్రభువు దర్శనము చూడాలన్న ఆశ నాలో అధికమయింది.  35  రోజులు ఉపవాసముండి ప్రార్థించాను, పగలు 3  గం.ల సమయంలో నా గదిలో మోకరించి ప్రార్తిస్తుండగా ప్రభువు నాకు సాక్ష్యాత్తు దర్శనమిచ్చి నాతో కొన్ని వాగ్దానాలు చేశారు.  అప్పటి నుండి దేవుడు తన నామ మహిమార్థం అనేక రోగులకు స్వస్తత పరచుచున్నారు.  మరొక సారి దేవుడు దర్శించి ఆయన సేవ కొరకు నన్ను పిలిచారు.  అప్పటికి నాకు 18  సం.లు ప్రాయం. ఈ చిన్న వయస్సులో నేనెలా సేవ చేయాలి?  నాకేమి బోధ వచ్చు? అయినా నా బోధ ఎవరు వింటారు?  అని తలుస్తుండగా మరొక సారి ప్రభువు నన్ను దర్శించి బలపరచారు.  మా స్వ గ్రామములో ప్రభువు తన నామ మహిమార్థం జరిగిస్తున్న స్వస్తతలను బట్టి చాలా మంది ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు.  కొందరు రక్షణ పొందారు.
శ్రమలు 
     ప్రభువు జరిగిస్తున్న కార్యాలను బట్టి సంతోషించే భాగ్యం నాకు లేక పోయింది. దేవుడు  వాడుకొనే కొలది నాకు శ్రమలు విస్తరించాయి.  నేను చదువు సంస్కృతీ విడచి దేవుడు, దేవుడు, అంటూ చేదిపోయానని మా నాయన తలంపు.  అందుకనే మాటికి తిడుతూ ఉండేవాడు.  ఆ దూషణ మాటలు నన్ను ప్రభువు సన్నిదికి మరి ఎక్కువ సమీపస్తునిగా చేశాయి.  ఎప్పటి వరకు బ్రతుకుతానో తెలియదు. నా తండ్రి మాట వింటే చనిపోయిన తరువాత నరకానికి వెళ్ళ వలసిందే గనుక నన్ను పరలోకం చేర్చే యేసు ప్రభువు నా బ్రతుకులో ఎన్న టెన్నటికి , విడువ కూడదని నిచయిన్చుకుంటిని.
     ఒకరోజు సాయంకాలం మా నాయన నన్ను భయంకరంగా దూషించి నా ఇంటిలో నుండి వెళ్లి పో అని రౌద్రముగా మాట్లాడారు.  ఆ మాటలు నా గుండెల్లో బల్లెపు పోటుల్లా అయ్యాయి.  పూర్తి విరక్తి ఏర్పడింది.  అడవులకు వెళ్లి పోదామన్నట్లు ఉన్న పాటున బయలుదేరాను.  ఎన్నెన్నో తలంపులు నా మనస్సులో పరుగులెడుతున్నాయి.  తెలియని రీతిగా దుఃఖం పొర్లుతుంది.  కొంత దూరం వెళ్ళే సరికి మా తల్లి వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకురావడం జరిగింది. 
ఇల్లు విడుచుట 
     ఇల్లు విడచి ఎక్కడికైనా వెళ్లి పోవాలని నాలో తొందర అధికమైంది.  ఒక దినము రక్తసంబండులను, ఆత్మీయులను విడచి బయటకు వెళ్ళితిని.  దైవ జనుల సహాయముతో అప్పటిలో ఆర్థికంగా,ఆత్మీయంగా, వెనుకబడి ఉన్న జగ్గయ్యపేట వచ్చితిని.  అక్కడ నుండి బైబిలు కళాశాలకు వెళ్లి తర్పీదు పొంది నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన నా ప్రభువును వెనకబడిన ప్రాంతాలలో నే ప్రకటించాలన్న దీక్షతో జగ్గయ్య పేట ప్రాంతములోనే ప్రభువు నడిపింపు ను  బట్టి పని ప్రారంబించితిని.  ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు, శ్రమలు వాటిల్లినా నా ప్రభువు నన్ను విడువలేదు.  ఏ మిషను, గ్రూప్ భేదం లేకుండా శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలని నా ధ్యేయము.  ఎన్ని కస్టాలు, ఇబ్బందులు కలిగిన ప్రభువు మీదనే ఆధార పడాలి గాని, ఏ స్వదేశీ, విదేశీ మిషనరీల మీద గాని మరెవ్వరి మీద ఆధారపడకూడదని నా నిర్ణయము ఎందుకంటే మన ప్రభువు నమ్మ దగినవాడు, తన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చా గోరుతున్నాడని గ్రహించాను.  నా సేవలో ఎన్నో కస్టాలు వాటిల్లాయి.  వాటన్నిటికి ని ప్రతి ఫలంగా సేవలో ఎంతో అభివృద్దిని చూడగలిగాను.
1970  సం.లో సంఘములో కొందరి ద్వారా భయంకరమయిన శ్రమలు వాటిల్లాయి.  ఆ శ్రమలకు  ప్రతి ఫలం గా దేవుడు అనేక అద్బుతాలు చేయడం మొదలు పెట్టాడు.  అదే సమయములో ఆత్మపూర్నుడైన ఒక దైవ జనుడు నా వద్దకు వచ్చి దేవుడు మీకు ఇచ్చిన కృపా వరాన్ని ఆయన మహిమార్థం వినియోగించాలి.  అనేక స్థలాలలో స్వస్తత మీటింగు లు పెట్టాలని నన్ను ప్రోత్సహించారు.  ఆ దైవజనుడు ద్వారా దేవుడు తెలియజేసిన విధంగా స్వస్థత మీటింగులు పెట్టుట ఆరంబించితిని.  రోగులన్దరి కొరకు ఒకేసారి ప్రార్థించగా అనేకులు బాగుపడి సాక్ష్యములిచ్చి ప్రభువును మహిమ పరచుచున్నారు.అప్పటి నుండి ఆంధ్రాలో అనేక స్థలములలో స్వస్థత మీటింగులు పెట్టితిమి.  ఎవరు పిలిచినా ఏ భేదము లేకుండా స్వస్థత మీటింగులు పెట్టి ప్రభువు తన నామ మహిమార్థం జరిగించిన అద్బుత స్వస్తతలను కార్యాలను బట్టి,  ప్రభువు ప్రేరేపణ వల్ల, దైవ బిడ్డలనేకుల ప్రోత్సాహముతో 'క్రీస్తు ద్వారా స్వస్థత' మాస పత్రిక 1972  నుండి నడిపించబడుతుంది.  ఈ పత్రిక పొందుతున్న వారు మాకు చాల ఆశిర్వాదకరముగా ఉందని అనేకులు వ్రాయుచున్నారు.  ఆంధ్రాలో మాత్రమే కాక ఇతర రాష్ట్రాలలో, అందమాన్స్ లోను, గల్ఫ్ దేశాలలోను సువార్త నందిన్చుటకు ప్రభువు కృప చూపి ఉన్నారు.  దేవునికి స్తోత్రములు.  

Monday, September 6, 2010

ప్రార్థన లో ఉన్న శక్తి

 నాతోదూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. (అ.కా.27 :25 )

కొన్నేళ్ళ క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్లాను.  ఆ ఓడ కెప్టైన్ చాల నిష్ట గల క్రైస్తవుడు.  న్యూ ఫౌండ్ల్యాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు.  " కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాలలో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది.  బ్రిస్టల్ వాడైనా జార్జి ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను,  ఆ పొగమంచు వల్ల ఆ ఓడను ముందుకు తీసుకుని వెళ్ళడం కష్ట తరమాయెను. అంతలో జార్జి ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు.  'కెప్టైన్ ' శనివారం సాయంత్రంలోగా నేను క్యూబిక్ సిటి లో ఉండాలి' అన్నాడు.  అది అసాద్యం అన్నాను, అప్పుడాయన అన్నాడు.  " సరే, మీ ఓడను అక్కడికి చేర్చలేక పొతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు.  గత యాబై ఎనిమిది సం.లు గా నేనెప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు.  రండి, క్రిందికి వెళ్లి ప్రార్థన చేద్దాం. 
     ఆ దైవ జనుని వైపు చూస్తూ ఈయన ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకుని వచ్చాడో అనుకుంటూ " మిస్టర్ ముల్లర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా? అన్నాను.  నాకు తెలియదు అని అతను సమాధానమిచ్చాడు. " నేను దట్టం గా పట్టిన మంచును చూద్దాం లేదు.  సజీవుడైన నా దేవుని చూస్తున్నాను.  ఆయన నా జీవితంలో ఎదురైనా ప్రతి పరిస్తితిని చక్కబెడతాడు. 
     అతడు మోకరించి సాధారణమైన చిన్న ప్రార్థన చేసాడు. అతడు ప్రార్థించడం ముగించిన తరువాత నేను ప్రార్థన చెయ్యబోయాను.  కాని అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు.  "ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా? నాకయితే జవాబిచ్చేశాడు అని నమ్మకముంది. ఇక నువ్వు ప్రార్తిన్చాల్సిన అవసరం లేదు." అన్నాడు.
     ఆశ్చర్యం గా అతని వంక చూశాను. అతడాన్నాడు కెప్టెన్ , ఏబై ఏడు సం.ల నుంచి దేవుడు నాకు తెలుసు.  ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ 58 సం.లలో కనీసం ఒక్కటి కూడ లేదు.  లేచి తలుపు తెరిచి చూడు.  పొగమంచు తొలగిపోయి ఉంటుంది." లేచి చూశాను.  నిజమే! అంతా నిర్మలంగా ఉంది.  శనివారం నాడు జార్జి ముల్లర్ క్యూబిక్ సితిలో ఉన్నాడు.  వాక్య పరిచర్య చేశాడు.
     ప్రియ స్నేహితుడా, నీ చుట్టూ కారు చీకటి కమ్ముకున్నదా? ఒక్క అడుగు కూడ వేయలేని పరిస్తితులలో చిక్కుకున్నావా? ఎక్కడికైతే వేల్లాలనుకున్నావో ఏమైతే చేయ్యాలనుకోన్నావో దేనినయితే సాధించాలని తాపత్రయపడ్డావో దాని సాధించలేక అపజయముతో ఆటన్కాలతో బందిన్చాబడి నిరుత్సాహంలో కూరుకోనిపోయావా? దిగులు పడవద్దు.  జార్జి ముల్లర్ వలె దేవునిపై విశ్వాసం ఉంచు.  నీ దేవుడు ఇరుకులో విశాలత కలుగాజేస్తాడని నమ్ము.  ఈ రోజు ఏ స్తితిలో చతికిల పడి పోయావో ఆ స్థితిలో నువ్వు ఉండిపోయడానికి వీలు లేదు.  నువ్వు సాధించాల్సింది చేయాల్సింది చాల ఉంది.  లే! లెమ్ము! తెజరిల్లుము నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది.  (యెషయ 60 :1 ) లేచి ప్రభువు కొరకు చీకటి లోకంలో ప్రకాశించు.  ప్రభువు కొరకు జీవించు.
                       ---- కల్వరి కాంతి పత్రిక/ ఎడారిలో సెలయేర్లు / 

Wednesday, September 1, 2010

ఆచార్య ఆర్ ఆర్ కే మూర్తి గారి సాక్ష్యము

మా ఊరు గోవిందాపురం, గుంటూరు జిల్లా, నరసారావు పేట తాలుక, పుట్టి పెరిగింది సాంప్రదాయకమయిన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబము. మా  నాన్న గారి పేరు రంగనాయక శర్మ, మా తల్లి గారి పేరు కామేశ్వరమ్మ, మేము  ఆరుగురు అన్నతమ్ములం  , అందరిలో నేను  చిన్నవాడిని . పూర్తి పేరు రాయసం రాధాకృష్ణ మూర్తి, హరితస గోత్రం, పూర్వీకులు వైశ్య దేవం, అగ్నిహోత్ర పూజ చేసేవారు, ఇలావేల్పులు వీరభద్రుడు, భద్రకాళి.
     చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాము , మద్య తరగతి కుటుంబము, ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. మా  నాన్న గారికి కోటప్ప కొండ ధర్మ కర్తృత్వం ఉండేది.  కవుల కుటుంబము, మా  పూర్వికులు రాజుల ఆస్తానాలలో కవులు, లేఖికులు.  
     నా బాల్యం అంతా గోవింధాపురంలోనే గడిచిపోయింది.  పూజ పునస్కారాలు ఎక్కువగా చేస్తుండేవాడిని , ఆంజనేయుడు, శివుడు, వీరభద్రుడు, జనార్ధనుడు  గ్రామా దేవతలు. 
     మా  అమ్మ గారికి చదవను రాయను రాదు, నాన్న గారి ద్వారా ఆమెకు శ్రుత పాండిత్యము అబ్బింది.  ఆమె ఆచారము, మడి, దేవతార్చన, జపతాపాలు, ఏకాదశి ఉపవాసాలు, ప్రతి ఏట పెట్టె అబ్దికాలు, తద్దినాలు, వీటితో సతమత మైపోతూ ఉండేది. 
     మా  నాన్న గారు సంస్కృత పండితుడు, ధ్యాన శ్లోకాలు, భగవద్గీత, భాష్యాలు వల్లిస్తూ ఉండేవారు.
     అతి కష్టం మీద నరసారావు పేట లో హై స్కూల్ చదువు ముగించుకుని , గుంటూరు లో ఆంధ్ర కళాశాలకు పై చదువులకు వెళ్ళాను , ఆరోగ్యం బావుండక రెండు సం.లు చదువుకు అంతరాయం కలిగింది.  
     చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ , తెలుగు భాషలలో అభిరుచి ఎక్కువ.  తెలుగులో కవిత్వం రాసేవాడిని , ఏవేవో పద్యాలు పాటలు రాసి, తోటి విద్యార్థులకు వినిపించేవాడిని , తరగతిలో ఉత్తమ విద్యార్ధి అనే పేరుంది.  బాగా అల్లరి చేసేవాడిని . రాజకీయాలలో కూడ తలదూర్చి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్నేహితులతో కలసి వాల్ పోస్టర్లు అంటించాను . 
     చిన్నప్పటి నుండి బైబిలు అన్న, క్రైస్తవులు అన్నా చాల తేలిక అబిప్రాయం ఉండేది, ఇది విదేశీ మతం, మతం లేని వారికి ఇదొకటి దొరికింది, ఇదో క హాస్యస్పదమయిన మతమని హేలనచేసే వాడిని . గ్రామ బోధకులకు అడ్డ దిద్దమయిన ప్రశ్నలు వేసి సతాయిన్చేవాడిని .  చిన్నప్పటి నుండి వీరు వురి బయటే ఉండేవారు, వీరు తప్ప ఈ మతాన్ని ఇంకెవరు చేపట్టరని వ్యాకానించే వారు.మత గ్రంధాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో బైబిలు చౌకబారయినది, అది చదావాల్సిన అవసరమే లేదనుకున్నాను . ఇలాంటి మనో భావాలతో పెరిగాను .  చిన్నప్పటి నుండి అతి దేవతా భక్తిలో పెరిగాను , శంకరాచార్యుని స్తోత్ర శ్లోకాలు కంటత వచ్చు.
     గోవిన్ధపురంలో నంబి కుటుంబం ఉండేది.  ఎక్కువగా వారి ఇంట్లోనే ఉండేవాడిని , రెవెన్యు డిపార్ట్మెంట్ లో కొన్నాలు ఉద్యోగం చేశాను .అదీ వదిలేశాను , ఎక్కడ నిలకడ లేదు, మానసికంగా అసంతుప్తి, ఆత్మ శాంతి లేదు, శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంధాలు ఎన్నో చదివాను  
     నేను నరసారావు పేట హై స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు నతనయేలు  అనే క్రైస్తవుల అబ్బాయి తో స్నేహం అయింది.అతనికి కవిత్వం పిచ్చి ఎక్కువ, యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు, ప్రభోధాలను పద్యాల్లో రాసి తెచ్చేవాడు, నేను సరి చేసే వాడిని, నాకు నతన యేలు మంచి స్నేహితుడు కాని అతని మతం - నాకు అసహ్యం. అయినా అతని ఎదుట నేను విమర్శించేవాడిని కాదు.  
    నేను ఇంటర్ చదువుతూ మానేసి, ఆరోగ్య కారణాలను బట్టి కాకినాడలో మా అన్నయ్య దగ్గరకు వెళ్లాను, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవాడు.  మా పెద్దక్కయ్య బాల్య వితంతువు మా అన్నయ్య దగ్గరే ఉండేది.  నేనూ అక్కడే ఉంటుండగా నేను ఉహించని ఒక సంఘటన అక్కడ జరిగింది.  సూత్రాల శేషగిరి రావు గారని ఒకాయన మా ఇంటికి వచ్చాడు, ఆయన మధ్వ బ్రాహ్మణుడు.  విదేశీయులకు తెలుగు భాష నేర్పుతాడు.  పాశ్యాత మిషినరీ ల మధ్య ఆయనకు మంచి పేరుంది.  గొప్ప ఉపాద్యాయుడు.
     మాటల సందర్బములో శేషగిరి రావు నా విషయం ప్రస్తావించాడు, తనకు అసిస్టెంట్ గా మిశినరీలకు తెలుగు నేర్పేందుకు నన్ను పెట్టుకున్తానన్నాడు.  నేను సరే అన్నాను.  మా అన్నయ్య ఒప్పుకున్నాడు, తెల్ల దొరలకు తెలుగు నేర్పుతూ నేను కాకినాడ, రామచంద్ర పురం, ఊటి, కొడైకెనాల్, ప్రాంతాలన్నీ తిరిగాను, వారికి తెలుగు నేర్పడం నా పని.  వ్యాకరణం నేర్పాలి, తెలుగులో వారితో సంభాషణ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త నాకివ్వబడిన పుస్తకము. 
     ఆ పుస్తకము చదవడము అంతగా నాకు ఇష్టము లేకపోయినప్పటికీ ఉద్యోగమూ నిమిత్తము చదివాను, అందులోని భాష విలక్షణం గా ఉన్నట్లు మొదట తోచినది. ఇంగ్లిస్ లో యోహాను సువార్త చదివి దానిని తెలుగులో సరిపోల్చుకున్నాను, ప్రతి వచనము చదివి, భాషా పరంగా ప్రతి వచనము విడదీసి, వ్యాకరణము నేర్పుతూ ఉంటె, దొరలూ ఆశ్చర్య పోయేవారు.  ఒక దొర నాతో అన్నాడు, యువకుడివి మంచి అనుభవము ఉన్న ఉపాద్యాయుడిలాగ యోహాను సువార్త లోని పాటాలు మాకు నేర్పుతున్నావు. అబివృద్ది లోకి వస్తావు, అన్నాడు, మరో దొర, నేను ఏకాంతంగా ఉన్నప్పుడు, " నీవు చదివి చెబుతున్నావే, ఈ యోహాను సువర్తనే గనుక నీవు నమ్మితే, తెలుగు దేశంలో మీతో బోధకుడివి అవుతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు" అని అన్నాడు.
     కొందరు దొరలు నిన్ను సేమినారి కి పంపిస్తాము వెళ్ళతావ అని అడిగారు, నేను నవ్వి చివరికి నేను క్రైస్తవ బోధకుడినా అయ్యేది అని అన్నాను.  అయితే దేవుని సంకల్పంలో నేను బోధకుడినే.  మరో దొర ప్రవచనము చెప్పాడు కూడ.  ఒకానొక రోజు న సువార్తను చెప్పే గొప్ప ప్రసంగీకుడివి అవుతావు.  నిజం ఆ ప్రవచానమే నెరవేరింది. 
     యోహాను సువార్త ఎన్నో వందల సార్లు చదివాను, మిశేనరిలచేత చదివించాను, అందులో ఏ అద్యాయములో ఏముందో నాకు తెలుసు. కాని యేసు క్రీస్తు నా రక్షకుడు కాడు, ప్రభువు కాడు. క్రైస్తవ్యం నాకు అక్కర లేదు, క్రీస్తు నేను వ్యతిరేకి నేమి కాను, అనే వేదాంతం కల్పించుకున్నాను.  క్రీస్తును నా హృదయంలోకి రానివ్వకుండా నా ఊహలను సమర్తిన్చుకోవడానికి ఎన్నెన్నో తార్కిక వాదనలను తయారు చేసుకున్నాను, యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు కాడు, ఏ దేవుడిని నమ్మిన ఒక్కటే, దేవుళ్ళ మధ్య పోటి ఏమిటి?
e దేవుడు గొప్ప వాడు అని మనకెందు కీవాదం? అందరు ఒక్కటే అనుకుంటే సరిపోతుందిలే అనుకున్నాను, మతాల మార్పిడి తప్పు, అని మిశానరిలతో వాదించాను, దేవుని అవతారాలు ఎన్నెన్నో, యేసు క్రీస్తు ఒక అవతారం అనేంత వరకు వచ్చాను.మిషనరీలు నన్నెంతో ప్రేమించేవారు, నేను ఎంత విమర్శించిన ఏమి అనే వారు కారు. 
     వారి దగ్గర ఉన్న పుస్తకాలెన్నో చదివాను, త ద్వారా జ్ఞానం వృద్ది అవుతుంది అనుకున్నాను.  యేసు ని అంగికరించి క్రైస్తవుడనవుతానని నేను కలలో కూడ ఊహించలేదు.  కాని దేవుని సంకల్పము నా పట్లా వేరే విధముగా ఉన్నది.  మిశేనరీలు వేల కొలది మైళ్ళు వచ్చి భాష నేర్చుకుని ఇక్కడి ప్రజలకు ఏసుక్రీస్తు సువార్త బోదిస్తున్నారే,వీరి దీక్ష ప్రసంశనీయం అనుకున్నాను.  అప్పుడప్పుడు నాకనిపించేది , ఎందుకని వీరు ఊరి బయట నిమ్న జాతుల మధ్యే ఉండిపోతారు. అది నాకు అర్థం కాలేదు.  యేసు అందరికి ప్రభువంటూ నిమ్న కులస్తుల మధ్యే ఉంది, పని చేస్తారేమిటి? అని అడగాలనిపించేది కాని ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు.
     నాలో అనిర్వచనీయమైన సంగటన నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు మొదలయింది.  యచ్ జి క్రాన్ అనే మిషినరి తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది.  ఆయన నేను ప్రతి రోజు గంటల తరబడి ఆద్యాత్మిక విషయాలు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో నా సంభాషణ నాకు గొప్ప ఆశిర్వాదకరం గా పరిణమించింది. జటిలమైన తియాలజి సత్యాలు కరతలామలక మయ్యాయి. 
     ఈ సంధర్బములో నేనో మాట చెప్పాలి, బైబిలు లో తప్పులు పట్టుకుందామని చదివాను, బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకుంది. బైబిలు మామూలు పుస్తకమయితేగా అది దైవా వేషం వలన కలిగిన లేఖనము, దేవుని ముఖ నిర్ఘతమయిన మాట జీవప్రధం.ఆద్యాత్మిక శస్త్ర చికిత్స సాధనం.
     మిషనరీ ల కేందరికో తెలుగు నేర్పాను, వారిని తెలుగు పరీక్షలకు సిద్దపరచాను, వారికి సంభాషణ, వ్యాకరణం నేర్పాను, యోహాను సువార్త లోని సారాంశమంత వారికి నేర్పి, వారి చేత మాట్లాడించాను.  మిషను కాంపౌండ్ లోనే కాపురమున్నాము. 
    ఆ కాంపౌండ్ లో ఒక మిషనరీ అతని చుట్టూరా కొన్ని క్రైస్తవ కుటుంబాలు, ఒక బడి, ఒక గుడి, ఆసుపత్రి, మిషనరీ చుట్టూ ఉపగ్రహాలు కొన్ని తిరుగుతూ ఉంటాయి. మిషను కాంపౌండ్ రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టవు.మిషనరీ ఆసరా చూసుకుని కొందరు అధికారం చెలాయించడం,ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, ఇదంతా చూస్తుంటే నాకు అంత అయోమయం గా అనిపించింది. అయినా క్రైస్తవ సందేశం నా హృదయాన్ని ఆకట్టుకుంది.  క్రైస్తవులను సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
     పరాయి దేశం నుంచి వచ్చిన మిషనరీ ఊరికి దూరంగా ఒక బంగ్లా కట్టుకుంటాడు, అతడికి పనివారు కావాలి, వంట పని తోట పని చేయడానికి కొన్ని కుంటుంబాలు కాంపౌండ్ లో నివాసమేర్పరచుకుని ఉంటాయి. తరువాత మిషన్ సంస్తలో పని చేసే ఉపాద్యాయులు, నర్సులు, డాక్టర్లు, అదే కంపౌండ్లో కాపురముంటారు.  నేను వారి మద్య కాపురమున్నాను. 
వాక్య పటన:
     నారాయణపేటలో కొన్నాళ్ళు కుటుంబముతో ఉన్నాను, దేవుని వాక్యమనే బైబిలును సునిశితము గా పటించాను.  ఆలోచిస్తూ ఉన్నాను, ఎన్నో వ్యక్యానాలు చూశాను, బైబిలు సత్యం నన్ను ముద్దాయి గా నిలబెట్టింది.  బైబిలు మామూలు పుస్తకము కాదని, అందులో శక్తి భరితమయిన సత్యం ఉన్నదని గ్రహించడానికి కొన్ని సం.ల కాలం పట్టింది.  నారాయణ పేటలో క్రాన్ అనే మిషనరికి తెలుగు నేర్పుతున్నాను, ఆ వూరు ఆర్య సమాజ కేంద్రం. అక్కడ ఉంటూ ఉండగా నాలో అనిర్వచనీయమైన పరివర్తన అంచెల వారిగా వచ్చింది. 
    క్రైస్తవుల బలహీనతలను విమర్శించే నాలో వారి పట్ల ప్రేమ సానుభూతి కలగ సాగాయి.  గ్రామీణ బోధకులతో గంటల తరబడి గడిపేవాడిని. వారు చెప్పేదంతా ఓపికగా వినేవాడిని.  వారికి నాకు ఘాడ స్నేహం ఏర్పడింది.  వారి అమాయకతను క్రీస్తు నందలి ప్రేమను గుర్తించాను.నైతికంగా బలహీనులే అయినా క్రీస్తు నీతిని నమ్ముకున్న ఈ ప్రజలపై నాకు ఆదరాభిమానాలు కలగ జోచ్చాయి. 
సాతాను చర్యలు 
     రెండు మూడు సార్లు సాతాను క్రీస్తు పట్లా లేని పోనీ అపోహలు పుట్టించాడు, నేను వెళ్లి పోయేటట్లు చేశాడు, అయినా మళ్ళి వచ్చేశాను, నా అంతరాంతరాలలో తీవ్ర సంఘర్షణ మొదలయింది.  యేసు ప్రభువులోని అయస్కాంతపు ఆకర్షణ ఒక చెంప, నా బందుమిత్రాదులపై మమకారం ఒక చెంప.  ఈ విధం గా నాలో ద్వంద్వ యుద్ధం మొదలయింది.  యేసు క్రీస్తు నన్ను పూర్తిగా కోరుతున్నాడు.  నేనాయనకు సంపూర్ణముగా వశమయి పొతే నా బందువులకు దూరమయి పోతాను, ఆటా, ఇతా, ఎటూ తోచని పరిస్తితి ఏర్పడింది.  ఒక రోజు ఊరి బయటికి వ్యాహాల్లి గా ఓ గట్టు పైకి వెళ్లాను, ఎంతో సేపు అక్కడే కూర్చుడి పోయాను.  తీవ్రంగా తలపోశాను, క్రీస్తును అంగీకరిస్తే వచ్చే నష్టాలు, నిరాకరిస్తే వచ్చే కస్టాలు అంచనా వేసుకున్నాను.
బేరీజు 
బందువులు బలగము నన్ను హేళన చేస్తారు.  నిమ్న జాతులలో కలిసి పోయానని ఆడిపోసుకుంటారు.  వారితో కలిసి పొతే తప్పేమిటి?.  రాజకీయాలలో నయితే ఇలాంటి వాటికి మంచి పేరు వస్తుంది.  కాని క్రెస్టు విషయములో ఇది ఒక నిండగా పరిణమిస్తుంది. ఎందఱో రాజకీయ నాయకులు నిమ్న జాతులలో తిరిగి గొప్ప నాయకులయ్యారు, కాని క్రీస్తు కోసం ఇది నాకు మోయవలసిన శిలువ అయింది.  అయితే మటుకేం క్రీస్తు కోసం నిమ్న జాతి వాణ్ణే అవుతాను.  అందరు నన్ను అలాగే విమర్శించనియ్యి.  అదే నాకు ఆత్మా నందం , ఆత్మ శాంతి. 

                                                                    to be continued...