Monday, April 16, 2012

శాశ్వతమైనది నీవు

పల్లవి :  శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప 
            అనుక్షణం నను కనుపాప వలె కాచిన కృప 
1.         నీకు బహు దూరమైనా నన్ను - చేరదీసిన నా తండ్రివి 
            నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో 
2.         తల్లి తన బిడ్డలను మరచినా - నిను మరువలేనంటివే
            నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే
3.         పర్వతములు తొలగినాను మెట్టలు తత్తరిల్లినను
            నీ కృప నిను వీడదని అభయమిచ్చితివి  

Saturday, April 14, 2012

స్తుతియించెద నీ..

పల్లవి: స్తుతియించెద నీ నామము దేవ అను దినము //2//
1.        దయతో కాపాడినావు - క్రుపనే చూపించినావు //2//  
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు  
2.        పాపిని యుండగా నేను - రక్షించి దరిచేర్చినావు //2//
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు 
3.        సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం     //2//
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు