Sunday, August 29, 2010

విపస్యన ధ్యాన కేంద్రము తో నా అనుభవము

విపశ్యన అనేది ఒక ధ్యాన పద్దతి, దీనిని గౌతమి బుద్ధుడు వెలికి తీశాడు, ఇది అతి పురాతనమయిన  విద్య.  విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది ఒక స్వయం పరిశీలన ప్రక్రియ, దీనిని ముందు ఆనా పాన ఉంటుంది.  అంటే ఏకాగ్రతకు సంబందించింది.  
     2500 సం.లకు పూర్వము గౌతమ బుద్ధుడు లోకములో ప్రజలు పడుతున్న కష్టాలను శ్రమలను, జీవ మరణ సమస్యలను చూసి చలించి జీవితం మీద విరక్తి చెందాడు.  ఈ ప్రజలను దుఖం నుండి విడిపించడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి అని అనుకుని, ఈ విపశ్యన అనే విద్యను వెలికి తీసినట్లుగా చెబుతుంటారు.  దుఖాలకు కారణమయిన రాగ, ద్వేష,మొహాలను ప్రక్షాళన చేసే జీవకళ ఇది అని చెబుతుంటారు.  నిత్య జీవితంలో అనుభవించే అశాంతిని దూరం చేస్తుంది.  ఇష్టమయిన, అఇష్టమయిన పరిస్తితుల పట్ల సంయమనం లేకుండా ప్రతిస్పందించే మన పాత అలవాటు ఫలితంగా ఏర్పడే బంధనాలను తొలగిస్తుంది.  వ్యక్తి, సమాజాల ప్రగతి కోసం, సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది. అని చెబుతుంటారు.  
      దీనిని ఇప్పుడు గోయంక గారు ఇండియా లో నేర్పిస్తున్నారు, దీని కొరకు పది రోజుల క్యాంపు ఒకటి ఏర్పాటు చేసి నేర్పిస్తున్నారు.  
వీరు పాటించే నియమాలు :
1.జీవహింస చేయకూడదు 
2.దొంగ తనము చేయదూడదు 
3.బ్రహ్మచర్యాన్ని పాటించాలి 
4.అబద్దం పలకకూడదు 
5.ఏ విధమయిన మత్తు పదార్థాలు సేవించరాదు
పాత  సాధకులు అదనంగా ఈ క్రింది వాటిని పాటించాలి
6.మధ్యాహ్నం తరువాత భోజనం చేయకూడదు 
7.శరీర, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి 
8.ఎత్తుగా, విలాసవంతంగా ఉన్న పడకలు వాడరాదు 
       ఇక్కడ ఎవరు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు, నేర్చుకున్న తరువాత ఇష్టమయిన వాళ్ళు ఎంత అయినా డొనేట్ చేయవచ్చు.  ఇక్కడ గోయంక గారు చేసిన ప్రసంగాలను ప్రతి రోజు రాత్రి ఏడు గంటల కు వినిపిస్తుంటారు.  అన్నీ దేవతలను గోయంకా గారు విమర్శిస్తారు, ఏడవ రోజున ప్రసంగంలో అంటారు.  "యేసు క్రీస్తు నిజంగానే దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు కాబట్టే అంతటి ప్రేమ చూయించగలిగాడు. ". అని యేసు క్రీస్తు ప్రభువుని గురించి సాక్షం చెబుతాడు.
     విపశ్యన చేయడం ద్వారా మోక్షానికి వెళ్ళవచ్చు అని అంటారు, దానిని నమ్మడం ఎలా?, విపశ్యన చేసిన వాళ్ళు మోక్షానికి వెళ్ళారు, అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా?  దుఖం నుండి విడుదల వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది  అంటే నేను నమ్ముతాను, ఎందుకంటె ఆ అనుభవం నాకు ఉంది. కాబట్టి. మోక్షానికి వెళ్ళే తిరిగి వచ్చి మన ముందు సాక్షం గా నిల్చున్న వారు ఎవరయినా ఉన్నారా?, మోక్షం అంటే విశ్రాంతి పరిది, ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలము, దాని తరువాత చాల స్టొరీ జరుగుతుంది, పాపం చేసిన వాళ్ళు నిత్య నరకానికి, పాపం లేని వాళ్ళు పరలోకానికి వెళతారు.   
  మరి ఈ విపశ్యన పాపాన్ని తీసివేయగలుగుతున్నదా, గౌతమి బుద్ధుడు అలా చెప్పాడా, నాకు తెలిసినంత వరకు బుద్దుడు అలా చెప్పలేదు,  .కాని నా తరువాత 500 సం.లకు బుద్దులలో కల్లా మహా బుద్దుడు పుట్టబోవుచున్నాడు, ఆయన ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది అని యేసు ప్రభువు గురించి ముందుగానే ప్రవచనం చెప్పాడు.  గౌతమి బుద్దుడు మహా జ్ఞాని , మహా తపస్వి,  కాబట్టే దేవుడు తన యొక్క మర్మాన్ని ఆయనకు బయలుపరచాడు. నేను  విపశ్యన అక్కడ పద్దతులు, అక్కడి వాతావరణం నాకు చాల బాగ నచ్చాయి, ఆహారపు నియమాలు కూడా బాగున్నాయి, ఆనాపాన మరియు విపశ్యన ద్వారా మానసిక ఉల్లాసం లబిస్తాయి, అని నేను నమ్ముతాను, (అది కూడ తాత్కాలికమే, ఎదుకంటే అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత బయట జీవనం లో కలిసిపోయ్యే అవకాశం ఉంది.)  యేసు ప్రభువు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడిపిస్తుంది, నన్ను పరిశుద్ద పరుస్తుంది, నన్ను మోక్షానికి తీసుకు వెళ్ళుతుంది అని ఘాడంగా నమ్ముతాను.

Friday, August 27, 2010

ఉధయమాయే హృదయమా

ఉధయమాయే హృదయమా - ప్రభు యేసుని ప్రార్తించవే
పదిలముగా నిను వదలకుండా పడకనుండి లేపెనే||౨||
రాత్రి గడచి పోయెనే - రవి తూర్పున ఉదయించేనే
రాజ రక్షకుడేసు దేవుని -  మహిమతో వివరింపవే  ||ఉదయమా|| 
తొలుత పక్షులు లేచేనే - తమ గూటి నుండి స్తుతించేనే
తండ్రి నీవే దిక్కు మాకని - ఆకశమునకు ఎగిరినే   ||ఉదయమా|
పావనుడా పరిశుద్దుడా - పరంధాముడ చిరంజీవుడా 
పగటి అంతయు గాచి మమ్ము - పాలించుము దైవమా  ||ఉదయమా ||
తండ్రి తాతయు నీవని - ధరయందు దిక్కు కలదనీ
రాక వరకు కాచి మమ్ము - కనికరించి బ్రోవవే  ||ఉదయమా||  

Thursday, August 26, 2010

అత్యున్నత సింహాసనము పై

అత్యున్నత సింహాసనము పై - ఆసినుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే 
ఆహాహా ... హేల్లెలుయా ||4||
ఆహాహా ... హేల్లెలుయా ||౩|| ఆమెన్ 
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం 
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించితివే - నా రక్షణ కర్తా స్తోత్రం
ఆమెన్ అనువాడ స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ - అత్యున్నతుడా స్తోత్రం
యుగయుగములు సజీవుడా స్తోత్రం - తరతరముల దేవుడవు స్తోత్రం
ఏడు దీప స్తంబముల మధ్య సంచరించే - జ్యోతిర్మయుడ స్తోత్రం
అతి కాంక్షనీయుడా స్తోత్రం - అతి సుందరుడా స్తోత్రం
అతి మనోహరుడా మహిమాన్వితుడా - ఆరాధ్యుడా నీకు స్తోత్రం
స్తుతులపై ఆసీనుడ స్తోత్రం - సంపూర్నుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం
మ్రుత్యున్జయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం 
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం





హల్లెలుయ - స్తుతి మహిమ

     హల్లెలుయ - స్తుతి మహిమ 
     ఎల్లప్పుడు - దేవునికిచ్చెదము
     ఆ హల్లెలుయ .. హల్లెలుయ ..హల్లెలుయ
1.  అల సైన్యములకు - అధిపతియైన 
     ఆ దేవుని స్తుతించేదము
    అల సంద్రములను - దాటించిన ప్రభువగు 
    యెహోవాను స్తుతించేదము                                               ||హల్లె||
2.  ఆకాశము నుండి - మన్నాను పంపిన దేవుని - స్తుతించేదము 
     బండ నుండి మధుర - జలమును పంపిన 
     ఆ యెహోవా ను - స్తుతించేదము                                       ||హల్లె||
3.  పరలోకము నుండి - ధరకేతెంచిన - దేవుని స్తుతించేదము 
     నశించిన దానిని - వెదకి రక్షించిన 
     యేసుని - స్తుతించేదము                                                    ||హల్లె||

దేవుని స్తుతియించుడి

     దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి  ఆ ..
1.  ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో 
     ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు                              
                                                                              || దేవుని ||
2.  ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు 
     ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు                             
                                                                               || దేవుని ||
3.  ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును 
      ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు                            
                                                                               || దేవుని ||
4.  బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో
     ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు                             
                                                                              || దేవుని ||
5.  సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో 
     ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు                               
                                                                              || దేవుని ||
6.  తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో                
     ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు                           
                                                                             || దేవుని ||
7.  పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి 
     ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు                                      
                                                                             || దేవుని ||
8.  మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో
      ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు                                  
                                                                             || దేవుని ||
9.   సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్ 
      ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు                               
                                                                             || దేవుని ||  

కృపామయుడా

          కృపామయుడా నీలోన నివసింపజేసినందున 
          ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో


1.       ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
          నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున           || కృపా ||
2.       చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
          రాజ వంశములో - యాజకత్వము చేసెదను                        || కృపా ||
3.       నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు
          నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు                     || కృపా ||
4.       ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
          నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను.                     || కృప ||

Wednesday, August 18, 2010

బ్రహ్మకుమారీస్ వారితో నా అనుభవం

     ప్రియులారా, నేను ఆంధ్ర ప్రదేశ్ ఉత్పాదక మండలి లో జాబు చేసే సమయంలో నేను మా సీనియర్ శ్రీను తో కలసి శ్రీకాకుళం జిల్లా సోంపేట కు క్యాంపు కు  వెళ్ళాము, మా సీనియర్ బ్రహ్మ కుమారి, అతను రమ్మంటే రోజు సాయంత్రం అక్కడికి అతనితో వెళ్ళేవాడిని. నేను యేసు గురించి చెబుతుంటే, వారు శివ బాబా గురించి చెబుతుండేవారు, నేను చెప్పేది వారు ఓపికతో వినేవారు, వారు చెప్పేది నేను వినేవాడిని. యేసు ని మేము నమ్ముతాము, ఆయన ఒక మార్గము అని చెప్పేవారు. నేను ఏసే మార్ఘం అని చెప్పేవాడిని.
     అక్కడ క్యాంపు అయిపోయిన తరువాత కాశిబుగ్గ లో క్యాంపు పడింది.
అక్కడ 10 రోజులు వారు మాకు షెల్టర్ ఇచ్చారు. నేను మా సీనియర్ ఇద్దరమూ బ్రహ్మ కుమారీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాము. మాకు ప్రత్యేకమయిన రూం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ మమ్మల్ని చాల ప్రేమగా చూసుకున్నారు, అంతటి ప్రేమ నాకు క్రిస్టియన్స్ లో కనిపించలేదు, వాళ్ళు చేసే భక్తి కూడ చాల సిన్సియర్ గా చేసేవాళ్ళు.  తెల్లవారుజామున 3 గం.లకు లేచి వారి పూజలు చేసుకునేవారు. నేను కావాలనే 8 గం.లకు వాళ్ళ పూజలు  అయిపోయిన తరువాత లేచేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు అనుకునే వాడిని క్రిస్టియన్స్ కూడ ఈ విధంగా ప్రేమతో, భక్తి చేస్తె, అద్బుతాలు జరిగి ఉండేవి కదా అని.  మీరు ఇంతగా భక్తి చేస్తున్నారు, మీరు చేస్తున్న భక్తి మిమ్మల్ని పరలోకానికి (స్వర్గానికి) తీసుకువెలుతుందా? ఎందుకంటే పరలోకపు సంఘతులు పరలోకానికి వెళ్లి వచ్చిన వారికే తెలుస్తాయి, యేసు పరలోకం నుండి వచ్చాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, కాబట్టి  పరలోకపు సంఘతులు, మరియు మరణం తరువాత జరిగే సంగతులు ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు వింటేనే శ్రేష్టం కదా అని అడిగాను, దానికి వారు యేసు మరనిచి తిరిగి లేచాడు అనే విషయాని మేమూ నమ్ముతాము, మేము వెళ్ళే మార్గము కూడ పరలోకానికి తీసుకువేల్లుతుంది అని మేము నమ్ముతాము అని సమాధానం చెప్పారు. అక్కడ క్యాంపు అయిపోయిన తరువాత వారికి థాంక్స్ చెప్పి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాము.  మీరు ఈ విధము గా పరిచయం అవ్వడం మాకు సంతోషకరంగా ఉంది అని చెప్పారు,  మేము అక్కడ నుండి శ్రీకాకుళం వచ్చేశాము. 

ఈ స్వాతంత్ర్యం క్రీస్తు వలన కలిగెను

 యేసు లో ఉన్న ఆనందం లోకంలో లేదు. లోకానికి యేసు లో ఎంత ఆనందం ఉన్నదో తెలియాల్సి ఉన్నది. యేసు లో ఉన్న ఆనందం ఏంటో లోకం గ్రహించడం లేదు. దానికి కారణం పాపం.  పాపం నుండి కలిగే విమోచన కంటే గొప్ప విమోచన లోకంలోనే లేదు.  ఈ పాపానికి విమోచన యేసు వద్దనే ఉన్నది.  పాప బంధకములో ఉన్నవారు పాప ఆశలతో నిండి అదే ఆనందమని అనుకోనుచున్నారు.  కాని పాపము వలన మనుష్యుడు దారుణమైన బానిసత్వం క్రిందకు చేరుతున్నాడు.  పరిశుద్ద లేఖనం చెప్పుచున్నట్లు పాపము వలన వచ్చు జీతము మరణము.  మనుష్యుడు చేసే పాపము చిన్నదైన, పెద్దదైన, తెలియకుండానే మనుష్యుడు పాపపు బానిసత్వానికి గురి అవుచున్నాడు.  అంటే పాపపు ప్రభుత్వము క్రింద బానిసత్వము గా బ్రతుకుతున్నాడు, విశ్వం లో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, అవి అన్ని మనుష్యునికి ఏదో మేలు చేయాలని తాపత్రయ పడతావి, కాని ఈ పాప ప్రభుత్వం మాత్రం మనుష్యుని మీద నేర స్తాపన చేసి నిత్య మరణానికి అప్పగించాలని చూస్తుంది. ఐతే మనుష్యుడు దీనిని ఏమి పట్టించుకోక మనుష్యుడు తనకు, తన శరీరానికి అనుకూలముగా ఉందిలే అని పాపంలో పడి పోతున్నాడు.  అదే ఆనందం నిత్యానందం అనుకుంటున్నాడు.  చివరకు దాని అంతము ఘోర మరణము అని తలంచడం లేదు. తాను నడుచుకుంటున్న విధానము తాను చేసుడున్తున్న భక్తీ అంతా బాగానే ఉన్నది అనుకున్తున్నాడే గాని, నిత్య సత్యం ఏంటి అని గ్రహించలేక పోతున్నాడు.  
     ఓ పర్యాయం యేసు క్రీస్తు ప్రభువు, తనను వేమ్బదిస్తున్నటువంటి యూదులతో మీరు నా వాక్యము నందు నిలచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండుడి.  సత్యమును గ్రహించెదరు.  అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.  (యోహాను 8:31,32) అనగానే వెంటనే యూదులు యేసుతో సత్యమేమిటి? మాకు స్వతంత్రమేమిటి? మేము ఎవరికైనా బానిసలమైతిమా ఏమిటి? మేము అబ్రహం సంతానము మేము ఎవరికిని, ఎన్నటికిని దాసులమైయుండలేదే! మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారనిరి.  యేసు ప్రభువు వారు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుదగునని నీతో చెప్పుచున్నాను.  యేసు ఇంకను మాటలాడుచు మీరు అబ్రహం సంతానమని పేరు పెట్టుకుని దురాశలను నేరవేర్చుచున్నారు.  అలాగున చేయువాడు ఆయన వాడు కాదు.  మీ పితరుడైన అబ్రహం నొద్దకు సత్యము వచ్చినప్పుడు త్రునీకరింపక దానిని అనుసరించి స్వతంత్రుడు కాబడ్డాడు.  మీరైతే దేవునిని, దేవుడు పంపిన నన్ను త్రునీకరించుచున్నారు.  అందుకే సత్యమును అనుసరించుట స్వాతంత్ర్యమును పొందుట అనే విషయాన్ని గురించి తనను నమ్మి అనుసరిస్తున్న చెప్పుచున్నాను.
     ఇక్కడ గమనించి నట్లయితే నిజ స్వాతంత్ర్యము పొందాలంటే ముందుగా మనకు తప్పకుండ ఏది సత్యం అనేది తెలియబడాలి.  అది తెలియబడక పోబట్టే అనేకులు ఇంకను పాపంలోనే ఉంటున్నారు,  లోకానికి సత్యం చాల దూరముననే ఉన్నది.  సత్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని మున్దేసుకున్తున్నారు.  లోకమున ఉన్నదంతయు శరీరాష, నేత్రాష, జీవపు డంబము.  ఇవి అన్నియు గతించి పోయేవే. కాని దేవుని చిత్తమును నెరవేర్చు వారు మాత్రము నిరంతరము నిలుస్తారు.  అయితే పాపము మనలను అంత త్వరగా వదలదు అనే విషయాన్ని గమనించాలి.  ఆ ప్రభుత్వము క్రింద నుండి బయట పడడము అంత తేలికయినది కాదు.  కాని అప్పటి క్షణ మాత్రపు ఆనందాన్ని దృష్టి లో పెట్టుకుని దానికి బానిసలము అగుట సరి కాదు.  కనుక సత్యమయి ఉన్న యేసుని ఎరిగి ఆయన ద్వారా కలుగుతున్న స్వాతంత్ర్యమును పొండుకోనవలసిన వారమాయి యున్నాము, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్యము ఉంటుందన్నట్లు, దేవుని వద్ద మనకు, మన పాపములకు నిజమైన స్వాతంత్ర్యము కలదు.  మనము పాపమునకు బానిసలమగుట, త ద్వారా కలుగు నష్టమును ఎరిగి ప్రభుని వైపునకు పరుగెత్తాలి.  పాపమునకు విమోచన, పాప క్షమాపణ క్రీస్తునందున్నవి.  పాపమునుండి కలుగు విమోచన కంటే గొప్ప అయినా విమోచన మరియొకటి లేదు.  ప్రవక్త యిర్మియా ప్రవచనాన్ని బట్టి చిరుత పులి తన మచ్చలను మార్చుకోన గలదా? కూషు దేశస్తుడు తన రంగును మార్చుకోనగాలాడ? అంటే ఇవన్ని అసాద్యమయినప్పటికి, వీటి కన్నా కష్టమయినది పాపి పరిశుద్దుడుగా మారుటయే.  ఇది జరిగే పనేనా అని ఆలోచిస్తున్న సమయాన పాప విమోచకుడుగా యేసు ప్రత్యక్ష మగుట  గొప్ప  ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఆయన బందిన్ప బడిన వారికి విడుదలను ఇవ్వడానికి, దేవునితో ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని మన పాపముల కొరకు తన దేహమును అడ్డుపెట్టాడు.  ఇప్పటి వరకు మనుష్య్డుడు అనుభవిస్తున్న పాప బందకాలన్నిటిని, తెంచి వేశాడు. ఇక మనుష్యుడు పాపమునకు కట్టబడిన వాడు కాదు.  ఇప్పుడు క్రీస్తు చేత విమోచింపబడినవాడు.  మనందరి కొరకు ఒక్కసారే బలిగా అర్పణ పొంది మనకు ఈ గొప్ప విమోచనను అనుగ్రహించాడు.  ఇక మనము ఎవనికిని బానిసలము కాము.  మరి విశేషముగా అపవాదికి అసలు కాదు.  వాని నుండే మనకున్న పాపపు ముల్లును విరచి, పాప బంధకాలను తెంచి, మనలను ప్రేమించి స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు.  దేవునికి స్తోత్రము. 
---- బ్రదర్ ఎస్.ఆర్. అబ్రహం(బెతెస్త క్రీస్తు ద్వారా స్వస్తత)      

Friday, August 13, 2010

నా సాక్ష్యం

అందరివాడు

     యేసు క్రీస్తు అందరికి ప్రభువు.  కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కావలసినవాడు.  ఆయన చూపిన మార్గం, త్యాగము, క్షమాగుణము, పునరుద్ధానము ప్రతి పాపికి అవసరమై ఉన్నవి.  పాపము చేసిన వారంతా పాపానికి దాసులు , పాపం వీరిని నరకంలో పడవేస్తుంది, అక్కడ అగ్ని ఆరడు, ఆత్మ చావదు.  పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.  ఆయన పరిశుద్ద రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది.  ఆయన మరణించి తిరిగి లేచిన మాదిరిగానే మరణించిన వారంతా ఒక రోజున తిరిగి లేస్తారు.  వీరందరు దేవుని న్యాయపీటం ముందు కుడి వైపున కొంతమంది , ఎడమ వైపున కొంతమంది రెండు గుంపులుగా నిల్చుంటారు.  అప్పుడు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు.  పాపము లేనివారు పరలోకానికి, పాపంతో ఉన్నవారు నిత్య నరకానికి వెళతారు.  
     యేసుక్రీస్తు ఎ ఒక్క మతానికి, కులానికి సొంతమైనవాడు కాదు, ఆయన అందరి కొరకు రక్తం చిందించాడు, అందరిని ప్రేమిస్తున్నాడు.  ఆయన అందరివాడు. దేవుడు యేసుక్రీస్తు నందు అన్ని కులాలవారినీ, మతాలవారిని దీవింది రక్షించును గాక ... ఆమెన్....
                                                  ---రాము