పల్లవి : కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం "2"
ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువదు "2"
1. ఎదురౌ తారెందరో నీ పయనం లో
నిలిచేది ఎందరూ నీ అక్కరలో
వచ్చేదేవరూ నీతో మరణం వరకు "2"
ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు " ఏసే "
2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే "2"
సంపాదన ఎవరిదగును యోచించితివా " ఏసే "
3. నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి
విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా "2"
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా "ఏసే"
Tuesday, December 28, 2010
Sunday, December 26, 2010
కృప చేత
కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా (2)
నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే
నన్నెరిగి యున్నావయ్యా (2) "నేను "
2.తల్లి గర్బమున రూపింపక మునుపే -
పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) "నేను"
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు -
నీ రక్త దారాలతో నను కొన్నావు (2) "నేను"
నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే
నన్నెరిగి యున్నావయ్యా (2) "నేను "
2.తల్లి గర్బమున రూపింపక మునుపే -
పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) "నేను"
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు -
నీ రక్త దారాలతో నను కొన్నావు (2) "నేను"
ఓ తల్లి కన్నను
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
దేవుడు క్షమించు దేవుడు "2"
ఆప్తులకన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు " ఓ తల్లి "
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ "2"
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ "2"
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ " ఓ తల్లి "
2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను
త్రోయక దరిచేర్చు ప్రేమ "2"
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ "2"
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా..." ఓ తల్లి "
దేవుడు క్షమించు దేవుడు "2"
ఆప్తులకన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు " ఓ తల్లి "
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ "2"
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ "2"
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ " ఓ తల్లి "
2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను
త్రోయక దరిచేర్చు ప్రేమ "2"
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ "2"
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా..." ఓ తల్లి "
Tuesday, December 21, 2010
దేవుని వాక్యానికి ..
దేవుని వాక్యానికి ఉన్న వేరు వేరు రూపాలు :
దేవుని వాక్యం ఒక వ్యక్తి గా ఉన్నది - యోహా 1:1,14, Iయోహా 1:1, ప్రక 19:13
దేవుని వాక్యం దేవుని చేత పలుక బడింది - ఆది 1:3, కీర్త 33:6
- దేవుని ఆజ్ఞ - ( ఆది 1:3, కీర్త 33:6 , హెబ్రీ 1:3 )
- దేవుని వాక్యము వ్యక్తి గతము గా మాట్లాడుతుంది ( ఆది 2:16,17,
3:16-19, మత్తయి 3:17 )
- దేవుని వాక్యము మనుష్యుల పెదవుల ద్వారా పలుకబడుతుంది
( నిర్గ 4:12, సంఖ్యా 22:38, Iసమూ 15:3,18,23,
Iరాజులు 20:36, )
దేవుని వాక్యం ఒక వ్యక్తి గా ఉన్నది - యోహా 1:1,14, Iయోహా 1:1, ప్రక 19:13
దేవుని వాక్యం దేవుని చేత పలుక బడింది - ఆది 1:3, కీర్త 33:6
- దేవుని ఆజ్ఞ - ( ఆది 1:3, కీర్త 33:6 , హెబ్రీ 1:3 )
- దేవుని వాక్యము వ్యక్తి గతము గా మాట్లాడుతుంది ( ఆది 2:16,17,
3:16-19, మత్తయి 3:17 )
- దేవుని వాక్యము మనుష్యుల పెదవుల ద్వారా పలుకబడుతుంది
( నిర్గ 4:12, సంఖ్యా 22:38, Iసమూ 15:3,18,23,
Iరాజులు 20:36, )
కృప సత్య
పల్లవి : కృప సత్య సంపూర్ణుడా !
సర్వ లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య
నా సన్మానానికే మహానీయుడవు నీవేనయ్యా
1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే !
"కృప"
2. నూతన క్రియ ను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
నా ఎడారి జీవితమే - సుఖ సౌక్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే
"కృప"
3. నైవేద్యములు దహన బాలులు నీవు కోరవుగా
నా ప్రానాత్మ శరీరము బలియర్పణ కాగా
నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే !
"కృప"
సర్వ లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య
నా సన్మానానికే మహానీయుడవు నీవేనయ్యా
1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే !
"కృప"
2. నూతన క్రియ ను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
నా ఎడారి జీవితమే - సుఖ సౌక్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే
"కృప"
3. నైవేద్యములు దహన బాలులు నీవు కోరవుగా
నా ప్రానాత్మ శరీరము బలియర్పణ కాగా
నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే !
"కృప"
Sunday, December 19, 2010
ఓ క్రైస్తవుడా
పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము "క్రై"
2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము "క్రై"
3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము "క్రై"
4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో "క్రై"
5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని "క్రై"
6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా "క్రై"
7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు "క్రై"
8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు "క్రై"
ఓ ప్రభువా
పల్లవి : ఓ ప్రభువా - ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి
1. దారి తప్పిన నన్ను ను నీవు వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి " ఓ "
2. నీవు ప్రేమించిన గోర్రేలన్నిటిని ఎల్లప్పుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి " ఓ "
3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలో
నన్ను నీవు మరువని దేవా నీవే మా మంచి కాపరివి " ఓ "
ఎందుకయ్యా
పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -
నన్ను బ్రోచితివి " ఎందు "
1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను " 2 "
నేరములేంచని వాడా - నీతిమంతుడా " 2 "
న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా " ఎందు "
2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
మరపురాని దేవా మార్పు రాని ప్రభువా " 2 "
కృప చూపించు నను క్షమియించు -
నీ దాపున జేర్చుమయ్యా " ఎందు "
ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -
నన్ను బ్రోచితివి " ఎందు "
1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను " 2 "
నేరములేంచని వాడా - నీతిమంతుడా " 2 "
న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా " ఎందు "
2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
మరపురాని దేవా మార్పు రాని ప్రభువా " 2 "
కృప చూపించు నను క్షమియించు -
నీ దాపున జేర్చుమయ్యా " ఎందు "
యుద్ధము
పల్లవి : యుద్ధము యెహోవా దే " 4 "
రాజులు మనకేవ్వరు లేరు - శూరులు మనకేవ్వరు లేరు " 2 "
సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండ " 2 "
1. బాధలు మనలను క్రుంగ దీసిన
వ్యాదులు మనలను పడవేసిన " 2 "
విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ " 2 "
" యుద్ధము "
2. యెరికో గోడలు ముందున్న
ఎర్ర సముద్రము ఎదురైనా " 2 "
అద్బుత దేవుడు మనకుండ భయమేల మన కింక " 2 "
" యుద్ధము "
Saturday, December 18, 2010
ఆనందింతు
ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు
మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా
1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా
అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ
2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ
నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన
3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న
ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు
4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ
అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి
మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా
1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా
అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ
2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ
నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన
3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న
ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు
4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ
అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి
బైబిలు యొక్క అంశాలు
బైబిలు యొక్క అతి ప్రముకమైన అంశం ఏమనగా దేవుడు తన సంతోషం, ఆనందం మరియు మహిమ కొరకు సమస్తమును సృజించి తన రాజ్యమును కట్టుకోనుచున్నాడు.(యేష 43:7,ప్రక 4:11, ఎఫేసి 1:6,12-14, 3:22)
1. దేవుని గుణ గణాలు ( లక్షణాలు)
దేవుడు తనను తాను బయలు పరచుకుంటే తప్ప మనము ఆయనను తెలుసుకోలేము. (ఆది 1:1)
దేవుడు తన పరిశుద్ద మరియు నీతి గుణములను బయలుపరచుకున్నాడు (లేవి 11:44, 1 పేతురు 1:16)
దేవుడు తనను తాను వివిధ రకాలుగా బయలు పరచుకుంటాడు
సృష్టి (ఆది 1,2 అధ్యాయాలు )
మనుష్యులు (ఆది 1;26, ఈర్మియ 1:4,5 )
యేసు ప్రభువు (యోహాను 14:9,10)
దూతలు (అ.కా.8:26, 12:7-10)
అద్బుతాలు, ఆశ్చర్య కార్యాలు (హెబ్రీ 2:3,4, మార్క్ 2:1-13 )
దర్శనాలు (అ.కా. కోరి )
అపోస్తలులు, ప్రవక్తలు (II పేతురు 3:2, యూద 1:17 )
లేఖనాలు (II తిమో 3:16 )
2. పాపమునకు అవిదేయతకు తీర్పు :
లేఖనము పాపము గురించి మరియు పాపమునకు వచ్చే తీర్పు గురించి మాట్లాడుతుంది. (రోమ 6:23)
పాపానికి తాత్కాలిక శిక్ష మరియు నిత్యపు శిక్ష ఉంటుంది
బైబిలు అధ్యాయాలలో (1189) కేవలం నాలుగు అధ్యాయాలలో మాత్రమే పాపం లేదు. (ఆది 1,2, లూక 22,23)
3. విశ్వాసమునకు, విధేయతకు ఆశీర్వాదము :
మన పక్షముగా విశ్వాసమును మరియు విధేయతను కలిగి ఉన్నట్లయితే దేవుడు తన పక్షముగా మనలను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు.
(లూక 10:20, Iయోహాను 5:13, రోమ 4:3,ద్వి.కా. 28:1-14, యోహాను 3:16)
4. రాబోవు రాజ్యము మరియు మహిమ
పాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మొదటి, రెండవ రాకడ గురించి వ్రాయబడింది.
(యెషయ 9:6, అ.కా. 1:11, హెబ్రీ 9:28, ప్రక 20:6)
బైబిలు లో 66 పుస్తకాల కంటె ఎక్కువ పుస్తకాలు పెట్టక పోవడానికి గల కారణము :
1. ఆది కాండము నకు మరియు ప్రకటన గ్రంధమునకు ఉన్న పోలిక
ఆది కాండము సృష్టి ఆరంభము తో ప్రారంభ మయితే , ప్రకటన గ్రంధము సృష్టి అంతము తోను, నూతన సృష్టి ఆరంభము తోను ముగుస్తుంది. (ఆది 1:1, ప్రక 21:1-5)
2. బైబిలు విశ్వాసపు బోధ ఒక్కసారే సంఘమునకు అప్పగించబడి ఉన్నది. (యూద 3 వచనము)
3. బైబిలు హెచ్చరికలు :
బైబిలు లో 4 సార్లు దేవుని వాక్యమునకు ఏది కలుపరాదని మరియు ఏదియు తీసివేయ కూడదని హెచ్చరింప బడింది. (ద్వి.కా. 4:1,2, 12:32, సామే 30:5,6, ప్రక 22:18,19)
కేవలం ప్రకటన 22:18,19 లోనే భయంకరమైన తీర్పు ఉంటున్నదని చెప్పబడింది.
ప్రకటన గ్రంధం లో ఇచ్చిన హెచ్చరిక విశ్వవ్యాప్త మైనది, అది బైబిలు అంతటికి వర్తిస్తుంది.
4. ఆదిమ సంఘపు సాక్ష్యము : బైబిలు 66 పుస్తకాలు మాత్రమే ప్రేరేపించ బడ్డాయని ఆదిమ సంఘం బలంగా నమ్ముతుంది.
ఎగురుచున్నది
పల్లవి : ఎగురుచున్నది విజయపతాకం
ఏసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
1. యేసుని నామము నుచ్చ రింపగానే
సాతాను సైన్యము వనుకుచున్నది
వ్యాదుల బలము నిర్మూలమైనది
జయమొండేది నామము నమ్మినప్పుడే "రక్తమే"
2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగోట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం "రక్తమే"
3. మా ప్రేమ వైద్యుడ ప్రాణ నాధుడా
ప్రీతి తోడ నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్త పరచుము తండ్రి ఈ క్షణమందే "రక్తమే"
ఎన్ని తలచిన
పల్లవి : ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా "2"
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనా
ఆలకించుమా ప్రభువా "2"
2. నా ఇంటి దీపం నీవే యని తెలిసి నా హృదయము
నీ కొరకు పదిలపరచితి
ఆరి పోయిన నా ఆత్మ దీపము వెలిగించుము
నీ ప్రేమతో ప్రభువా "2"
3. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై
నన్నాడుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి
వేరు చేయవు ప్రభువా "2"
ఆరని
పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది " ఆరని "
1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది " ఆరని "
2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది " ఆరని "
3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది " ఆరని "
పేరుపెట్టి
పల్లవి : పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు
నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు
కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా !
1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము
దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
నీకు తోడు నీడగా - నీతో వచ్చారా ! " న "
2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా
నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు " న "
3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు -
నీ చింత బాపువాడు
చూడుమా - నీ కరుణామయుడు
దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా
స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు " న "
4. ముగిసి పోయే యుద్ధ కాలము
తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము
తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు
నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు " న "
నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు
కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా !
1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము
దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
నీకు తోడు నీడగా - నీతో వచ్చారా ! " న "
2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా
నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు " న "
3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు -
నీ చింత బాపువాడు
చూడుమా - నీ కరుణామయుడు
దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా
స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు " న "
4. ముగిసి పోయే యుద్ధ కాలము
తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము
తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు
నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు " న "
కాలమెల్ల
పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు
భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
పరలోక మహిమను - దివిదూత గణమును
విడనాడి నన్ను వేడుక వచ్చెను
ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
పాపి కొరకు ప్రాణమిచ్చెను " కా "
1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
కరుణ తోడను - నా కడకు చేరెను
నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు
నాదు బ్రతుకు మార్చి వేసెను " కా "
2. మంచి కాపరి - నా చెంత చేరెను
లేమిని లేకుండా చేసెను
దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను
పాతవి గతించెను - గీతమాలపింతును
యేసు తోడ నుందు నిరతము " కా "
3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను
కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
కొదువలేదు - దిగులు లేదుగా "కా"
భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
పరలోక మహిమను - దివిదూత గణమును
విడనాడి నన్ను వేడుక వచ్చెను
ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
పాపి కొరకు ప్రాణమిచ్చెను " కా "
1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
కరుణ తోడను - నా కడకు చేరెను
నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు
నాదు బ్రతుకు మార్చి వేసెను " కా "
2. మంచి కాపరి - నా చెంత చేరెను
లేమిని లేకుండా చేసెను
దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను
పాతవి గతించెను - గీతమాలపింతును
యేసు తోడ నుందు నిరతము " కా "
3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను
కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
కొదువలేదు - దిగులు లేదుగా "కా"
నీ నామమే
పల్లవి : నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము
నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము " నీ "
1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
పలుకరించింది ఇల నన్ను వెదకి
ధరణి తడిసింది - నీ రక్త బలికి
పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ
పరిపూరిత దుదిరంబు బహుమానమే " నీ "
2. నెమ్మి నా నెయ్యమును కోరి చేరి
నోవ్వులను సిల్వలో పొందగోరి
దేవ కొమరుండా దిగివచ్చి నావా
పరిచారకుని రూపు ధరియిన్చినావా
పరిశుద చరితుండ - పరిపోషకా " నీ "
3. థారునిని నీకు సమరూపుడేవాడు?
నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
పాలనుడ నన్ను ప్రేమించినావా
పాలకుడ నాదు, నజరేతువాడా
మాలిన్యా కూపాన నా మొర్రను
ఆలించి లాలించి - నను చేరినావా " నీ "
4. సిల్వలో నిన్ను మనసార చూచి
నియుడు కృప నేను మననంబు చేసి
పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి
చేరితిని నిన్ను స్తుతియింప దలచి
కారుణ్యమున నాదు కలుశాలను
పరిమార్జనము చేయు - పరిపోషకా " నీ "
నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము " నీ "
1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
పలుకరించింది ఇల నన్ను వెదకి
ధరణి తడిసింది - నీ రక్త బలికి
పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ
పరిపూరిత దుదిరంబు బహుమానమే " నీ "
2. నెమ్మి నా నెయ్యమును కోరి చేరి
నోవ్వులను సిల్వలో పొందగోరి
దేవ కొమరుండా దిగివచ్చి నావా
పరిచారకుని రూపు ధరియిన్చినావా
పరిశుద చరితుండ - పరిపోషకా " నీ "
3. థారునిని నీకు సమరూపుడేవాడు?
నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
పాలనుడ నన్ను ప్రేమించినావా
పాలకుడ నాదు, నజరేతువాడా
మాలిన్యా కూపాన నా మొర్రను
ఆలించి లాలించి - నను చేరినావా " నీ "
4. సిల్వలో నిన్ను మనసార చూచి
నియుడు కృప నేను మననంబు చేసి
పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి
చేరితిని నిన్ను స్తుతియింప దలచి
కారుణ్యమున నాదు కలుశాలను
పరిమార్జనము చేయు - పరిపోషకా " నీ "
Wednesday, December 8, 2010
ఎందుకో
ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు
ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు
ఆ ప్రేమకు ఫలితము సిలువ త్యాగమా
ఆ ప్రేమకు అర్థం బలి దానమా
1. నిన్నేరుగక ఆనాడు దూషించి తిరిగితిని
నీ మహిమను నే కానక అవమాన పరచితిని
నా కరములు నీవు వీడక కాపాడినది
ఈ దీనుని ధన్యునిగా చేయాలనా " ఎ "
2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళ్ళలో
దరిరాలేదేవ్వారు నన్నాదరింప గను
ఇలలో దొరకని ప్రేమను చూపించినది
నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా " ఎ "
3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని
కలువరిలో నా కొరకు కరిగిపోతిని
ఈ పాపిని పరిశుద్దులలో చేర్చాలనా
పరమపురికి నా నావ సాగాలనా "ఎ"
ఎంత కృపామయుడవు
ఎంత కృపామయుడవు యేసయ్య
ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య
నలిగిటివి - వేసారితివి - నాకై ప్రాణము నిచ్చితివి
1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం
మార్చినావు నన్ను నీ స్వాస్త్యముగా " నలిగితివి "
2. కన్నతల్లి దండ్రి నన్ను మరచినను
నాకున్న వారందరు విడచినను
మరువలేదు నన్ను విడువలేదు
ప్రేమతో పిలచిన నాధుడవు " నలిగితిని "
3. కరువులు కలతలు కలిగినను
లోకమంతా ఎదురై నిలచినాను
వీడను ఎన్నడూ నీ సన్నిధి
నీ త్యాగామునే ధ్యానిన్చేదన్ " నలిగితిని"
ఆనంద యాత్ర
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుశాలేము యాత్ర
1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
ఎయి నోళ్ళతో స్తుతియించినను
తీర్చలేము ఆ ఋణమును " ఆనంద "
2. రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవ దూతలు మనకుండగా " ఆనంద "
3. కృతజ్ఞతా లేనివారు వేల కొలదిగా కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృపను పొందెదము " ఆనంద "
4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం
ఆత్మానంద భారితులమై - ఆగమన కాంక్షతో సాగేదం " ఆనంద "
మహిమ మహిమ
మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ "2"
ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత "2"
హల్లె, హల్లె, హల్లె, హల్లులుయః "4"
1. భూమ్యాకాశాముల్ సృజించిన
మన యేసు రాజుకే మహిమ
సూర్యచంద్ర తారలను చేసిన - క్రీస్తు రాజుకే ఘనత
2. నేల మంటి నుండి నరుని చేసిన యేసు రాజు కే మహిమ
నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తు రాజుకే మహిమ
3. అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజు కే మహిమ
సమాదిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమ
4. పరమున స్థలమును సిద్ధపరచిన యేసురాజుకే మహిమ
తానుండు స్థాలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమ .
Sunday, December 5, 2010
బైబిలు మూల భాషలు
పాత నిబంధనను 98% హెబ్రీ భాషలో, కొంత భాగము అరామిక్ భాషలో వ్రాయబడింది. (ఎజ్రా 4:8-6:18,7:12-26, ఇర్మియ 10:11, దాని 2:4-7:28 అరామిక్ భాషలో వ్రాయబడినవి )
క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది.
పాత నిబంధన :
యోబు ---------- B.C. 2150
ధర్మ శాస్త్రము ---------- B.C. 1402
యెహోషువా ---------- B.C.1350
న్యాయాదిపతులు & రూతు ---------- B.C.1050
కీర్తనలు ---------- B.C.965
సామెతలు & ప్రసంగి ---------- 926
పరమగీతము, I & II సమూయేలు ---------- B.C. 926
I రాజులు & I దిన వృత్తాంతాలు ---------- B.C.840
ఓబద్య ---------- B.C 848
యోవేలు ---------- B.C. 835
యోనా ---------- B.C. 780
ఆమోసు ---------- B.C. 765
హోషేయ ---------- B.C. 755
యెషయ ---------- B.C. 750
మీకా ---------- B.C. 740
ఇర్మియ & విలాప వాక్యాలు ---------- B.C. 640
నహూము ---------- B.C. 630
హబక్కూకు & జఫన్య ---------- B.C. 625
యేహెజ్కేలు ---------- B.C. 595
దానియేలు ---------- B.C. 538
II రాజులు & II వృత్తాంతాలు ---------- B.C. 530
హగ్గయి, జకర్య ---------- B.C. 520
ఎస్తేరు ---------- B.C. 476
ఎజ్రా ---------- B.C. 458
నేహేమ్య ---------- B.C. 445
మలాకి ---------- B.C. 432
బైబిలు ను వ్రాయడానికి వాడిన పదార్థములు
బైబిలు ను దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యములను వివిధ రకాల పదార్థాలపై వ్రాశారు.
* బంక మన్ను (ఈర్మియ 15:13, యెహే 4:1
* రాయి (నిర్గమ 24:12,13:18,32:15, ద్వి.కా. 5:22,27:2,3 యోహ 8:31,32
* ఆవు చర్మము, గొర్రె చర్మము (2 తిమో 4:13)
* లోహము (నిర్గమ 28:36, యోబు 19:24, మత్తయి 22:19,20)
ఆశ్చర్యమైన ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటే - బలమైన ప్రేమది - నన్ను జయించే నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్య జీవమిచ్చే " 2 "" ఆశ్చర్య "
2. పావన యేసుని ప్రేమ సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చే " 2 "" ఆశ్చర్య "
3. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు " 2 " " ఆశ్చర్య "
4. నా స్థితి జూచిన ప్రేమ నాపై - జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే " 2 " " ఆశ్చర్య "
ఆయనే నా సంగీతము
ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాది పతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతిన్చేదను
1. స్తుతుల మధ్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల మొరలు వినే
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే " ఆయనే "
2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యాలోన
ఉండేధననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించేదము " ఆయనే "
3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును
జీవితకాలమేల్ల కీర్తించేదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రోక్కేదము స్తుతిన్తుము - పొగడెదము " ఆయనే "
Saturday, December 4, 2010
బైబిలు నిర్మాణము
--> బైబిలు 66 పుస్తకాల సముదాయము
--> ఈ పుస్తకాలన్నీ దేవుని చేత ప్రేరేపించ బడినవి
--> ఈ 66 పుస్తకాలు రెండు భాగాలుగా విభజింపబడినవి
--> పాత నిబంధన గ్రంధము, క్రొత్త నిబంధన గ్రంధము
--> పాత నిబంధన గ్రంధములో 39 పుస్తకాలు ఉన్నాయి
--> పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది
--> పాత నిబంధన ను 4 ముఖ్య భాగాలు గా పేర్కొనవచ్చును.
--> 1. ధర్మ శాస్త్రము : మొదటి 5 పుస్తకాలు ధర్మ శాస్త్రం గా పేర్కొనవచ్చు.
--> ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితియోపదేశ కాండము.
--> 2. చరిత్ర : 6 నుండి 17 వరకు గల పుస్తకాలు చరిత్రను తెలియజేస్తున్నవి.
--> యెహోషువా, న్యాయాది పతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంధము, సమూయేలు రెండవ గ్రంధము, రాజులు మొదటి గ్రంధము, రాజులు రెండవ గ్రంధము, దిన వృత్తాంతాలు మొదటి గ్రంధము, దిన వృత్తాంతాలు రెండవ గ్రంధము, ఎజ్రా, నేహేమ్య, ఎస్తేరు.
--> 3. కావ్య గ్రంధము: 18 నుండి 22 వరకు గల పుస్తకాలను కలిపి కావ్య గ్రంధము గా చెప్పవచ్చును.
--> యోబు గ్రంధము, కీర్తనల గ్రంధము, సామెతలు, ప్రసంగి, పరమ గీతము
--> 4. ప్రవక్తల గ్రంధము : దీనిలో 2 భాగాలుగా పేర్కొన వచ్చును.
--> పెద్ద ప్రవక్తలు : 23 నుండి 27 వరకు గల పుస్తకాలు పెద్ద ప్రవక్తలకు సంబందించినవి.
--> యెషయ గ్రంధము, ఈర్మియ, విలాప వాక్యములు, యేహెజ్కేలు, దానియేలు
--> చిన్న ప్రవక్తలు : 28 నుండి 39 వరకు ఉన్న పుస్తకాలు చిన్న ప్రవక్తలకు చెందినవి.
--> హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్య, హగ్గయి, జెకర్య, మలాకి.
--> ప్రవక్తలు, యాజకులు, రాజులు, మరియు నాయకులు పాత నిబంధనను వ్రాశారు.
--> పాత నిబంధన సృష్టి ఆరంభముతో ప్రారంభమై క్రీ.పూ. 400 సం.ల వరకు చరిత్ర కలిగి ఉంటున్నది.
--> పాత నిబంధన తరువాత 400 సం.లు దేవుని మౌనము ఉన్నది.
--> పాత నిబధన లో ప్రముఖముగా ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు మెస్సియా ను గురించిన వాగ్దానములు మరియు ప్రవచనాలు ఉంటాయి.
--> క్రొత్త నిబంధన లో 27 పుస్తకాలు ఉన్నాయి, దీనిని 4 భాగాలుగా చెప్పవచ్చును.
--> అవి సువార్తలు, చరిత్ర, పత్రికలు, ప్రవచన గ్రంధము
--> సువార్తలు : మొదటి 4 అధ్యాయాలను సువార్తలు గా చెప్పవచ్చును
--> అవి మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త
--> చరిత్ర : అపోస్తలుల గ్రంధమును(5) చరిత్ర గ్రంధముగా చెప్పవచ్చును.
--> పత్రికలు : 6 నుండి 26 వరకు గల పుస్తకాలలో పత్రికలు ఉన్నాయి.
--> అవి రోమీయులకు పత్రిక, కోరింతీయులకు మొదటి పత్రిక మరియు రెండవ పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫేసియులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కోలోస్సయులకు పత్రిక, తేస్సలోనికయులకు మొదటి పత్రిక, మరియు రెండవ పత్రిక, తిమోతి కి మొదటి మరియు రెండవ పత్రిక, తీతుకు పత్రిక, ఫిలేమోనుకు పత్రిక, హేబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక రెండవ పత్రిక, యోహాను మొదటి, రెండవ, మూడవ పత్రికలు, చివరిగా యూదా పత్రిక.
--> వీటిలో 14 పత్రికలను పౌలు గారు వ్రాశారు, 2 పత్రికలను పేతురు గారు వ్రాశారు, 3 పత్రికలను యోహాను గారు వ్రాశారు, 1 పత్రికను యూదా గారు వ్రాశారు, 1 పత్రిక ను యాకోబు గారు వ్రాశారు.
--> ప్రవచన గ్రంధము : చివరి పుస్తము అయినటువంటి ప్రకటన గ్రంధము ను ప్రవచన గ్రంధముగా పెర్కొనవచును.
--> క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయ బడింది
--> క్రొత్త నిబంధన యేసు ప్రభువు పుట్టుకతో ఆరంభమవుతుంది.
--> క్రొత్త నిబంధన యుగాంతమందు జరుగు సంగతులను తెలియజేస్తుంది.
అడవి వృక్షములలో
అడవి వృక్షములలో - జలదారు వ్రుక్షమేట్ట్లున్నదో
పరిశుద్దుల మధ్యలో - అతి శ్రేష్టుడైన ప్రభుని....
పాడెదన్ - నాదు ప్రియుని - జీవకాల మెల్ల అరణ్య యాత్రలో
కృతజ్ఞతతో పాడెదను
1. నింద దూషణ ఇరికులలో - నన్ను సుగంధముగా మార్చెను
నీ క్రుపలో నన్ను నడిపి - నూతన జీవమునిచ్చిరే "పా"
2. నా కష్ట తరంగములలో - దుఃఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి - భయపడకని పలికితిరే "పా"
3. ఆనంద భరితుడై నేను - నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకటి మధురం - నీ ముఖము మరోహారము "పా"
4. నీ చిత్తము చేయుటకు - నన్ను నీకు సమర్పించేదన్
నా పరుగును తుదముట్టించి - నీ సన్నిది లో నడ్చేదన్ "పా"
అనంత జ్ఞాని నీకు
అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా !
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా !
కృపా ఇది నీ కృపా కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప " అనంత "
1. కోట్లాది జనులలో గుర్తించావు - కూరుకుని నీ ప్రజాగా లేక్కిన్చావు " 2 "
క్షమించే మనసు కలిగి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు " కృప "
2. అప్పగించుకున్నాను నీ కృప కే నేను
గొప్ప దేవుడా నీ సన్నిది లో ఉన్నాను " 2 "
పిలిచిన వాడా నన్ను గెలిచినా వాడా " 2 "
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా " కృప " అనంత "
Wednesday, December 1, 2010
బైబిలు మన చేతుల్లోకి ఎలా వచ్చింది?
బైబిలు మన చేతుల్లోకి రావడానికి దేవుడు కొందరిని పని ముట్లను వాడుకున్నాడు.
ప్రత్యక్షత:
దేవుడు తన్ను తాను మానవునికి బయలుపరచుకోను టయే ప్రత్యక్షత.
బైబిలు లో దేవుడు అనేక విధానాల ద్వారా తన్ను తాను ప్రత్యక్ష పరచుకొన్నాడు. (హెబ్రీ 1:1)
దేవుడు అనేక పద్దతుల ద్వారా మాట్లాడుతాడు.
1. దూతలు:
దూత అబ్రహాము తో మాట్లాడుట (ఆది 18)
దూత లోతుతో మాట్లాడుట (ఆది 19)
దూత దానియేలు తో మాట్లాడుట (దాని 9:21-27)
దూత జేకర్య తో మాట్లాడుట (లూక 1:11-20)
దూత మరియ తో మాట్లాడుట (లూక 1:26-37)
దూత గొర్రెల కాపరుల తో మాట్లాడుట (లూక 2:8-14)
దూత స్రీ ల తో మాట్లాడుట (మత్తయి 28:5-7)
దూత ఫిలిప్పు తో మాట్లాడుట (అ.కా. 8:26)
దూత పేతురు తో మాట్లాడుట (అ.కా. 12:7-10)
2. స్వరము :
ఆదాము తో..........ఆది 3:9-19
నోవాహు తో .........ఆది 6:13-21
అబ్రహాము తో .......ఆది 12:1-3
మోషే తో ..............నిర్గ 20:1-17
యెహోషువా తో..యెహో 1:1-9
సమూయేలు తో....1సమూ 3:1-14
నాతాను తో ..........IIసమూ 7:4-6
ఇర్మియ తో ..........ఈర్మియ 1:4,5
3.దర్శనం :
యాకోబు దర్శనం ................ ఆది 46:2
దావీదు దర్శనం ...................1దిన 21:16
యెషయ కు దర్శనం ..............యష 6:1-8
దానియేలు కు దర్శనం ...........దాని 7,8
యేహెజ్కేలు కు దర్శనం ..........యెహే37
అననీయ కు దర్శనం ..............అ.కా. 9:10
కోర్నేలి కు దర్శనం .................అ.కా. 10:3-6
పేతురు కు దర్శనం .................అ.కా. 10:10-16
పౌలు కు దర్శనం ....................అ.కా. 16:9
ప్రేరేపణ :
పొందుకున్న దేవుని ప్రత్యక్షత ను దేవుని ఆత్మ సహాయముతో దేవుడు కోరుకున్న విధముగా సొంత మాటలలో కాగితం మీద రాయడమే . (1తిమో 3:16)
ప్రేరేపణ ను గూర్చి వేరు వేరు అభిప్రాయాలున్నాయి.
సహజ సిద్ధాంతము :
షేక్ స్పియర్ వ్రాసినట్లు గానే బైబిలు కూడ సహజం గా దైవావేషం లేకుండా వ్రాయబడింది అని వారు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
డిక్టేషన్ పద్దతి :
దేవుడు డిక్టేషన్ ద్వారా వ్రాయించాడని వాళ్ళు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
కాన్సెప్ట్ థియరీ :
దేవుడు కాన్సెప్ట్స్ మాత్రమే ప్రేరేపించాడు కాని పదం కాదు.
ఇది బైబిలుకు వ్యతిరేకమైనది.
పక్షపాత సిద్దాంతము :
దేవుడు బైబిలు లో కొన్ని బాగాలను మాత్రమే ప్రేరేపించాడు గాని మొత్తాని కాదు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
ఆత్మీయ నియమపు పద్దతి:
బైబిలు లో నైతిక విషయాలు మాత్రమే ప్రేరేపించ బడ్డాయి, కాని శాస్త సంబంధమైనవి కావు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
మొత్తం పదములు సిద్ధాంతము:
దేవుడు కాన్సెప్ట్స్ ను మాత్రమే కాక ప్రతి పదమును ప్రేరేపించాడు
ఇది గ్రంధ కర్తల స్వేచాలోనే జరిగింది
ఇది వాక్యాను సారమైనది. (IIతిమో 3:16)
ప్రేరేపణ :
పొందుకున్న దేవుని ప్రత్యక్షత ను దేవుని ఆత్మ సహాయముతో దేవుడు కోరుకున్న విధముగా సొంత మాటలలో కాగితం మీద రాయడమే . (1తిమో 3:16)
ప్రేరేపణ ను గూర్చి వేరు వేరు అభిప్రాయాలున్నాయి.
సహజ సిద్ధాంతము :
షేక్ స్పియర్ వ్రాసినట్లు గానే బైబిలు కూడ సహజం గా దైవావేషం లేకుండా వ్రాయబడింది అని వారు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
డిక్టేషన్ పద్దతి :
దేవుడు డిక్టేషన్ ద్వారా వ్రాయించాడని వాళ్ళు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
కాన్సెప్ట్ థియరీ :
దేవుడు కాన్సెప్ట్స్ మాత్రమే ప్రేరేపించాడు కాని పదం కాదు.
ఇది బైబిలుకు వ్యతిరేకమైనది.
పక్షపాత సిద్దాంతము :
దేవుడు బైబిలు లో కొన్ని బాగాలను మాత్రమే ప్రేరేపించాడు గాని మొత్తాని కాదు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
ఆత్మీయ నియమపు పద్దతి:
బైబిలు లో నైతిక విషయాలు మాత్రమే ప్రేరేపించ బడ్డాయి, కాని శాస్త సంబంధమైనవి కావు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
మొత్తం పదములు సిద్ధాంతము:
దేవుడు కాన్సెప్ట్స్ ను మాత్రమే కాక ప్రతి పదమును ప్రేరేపించాడు
ఇది గ్రంధ కర్తల స్వేచాలోనే జరిగింది
ఇది వాక్యాను సారమైనది. (IIతిమో 3:16)
Subscribe to:
Posts (Atom)

