నిన్ను తలచి నిన్నే కోరి - నీకై వేచి యున్న
క్షణమైన నీవు లేక - బ్రతుకు లేనయ్యా //2//
ఏసయ్యా నీ ప్రేమే నన్ను ఆకర్షించెను
నా ఏసయ్యా నీ కృపే - నన్ను ఆదరించెను
కలువరిలో సిలువపై యాగమైతివి
నీ ప్రేమ నీ త్యాగం మరువలేనయ్యా
1 . పెండ్లి కుమారుని రాక కోసమై బుద్ది గల
కన్యలు ఎదురు చూచినట్లు
జారవిడిచిన నాణెం కొరకై ఒక స్త్రీ
ఓపికతో వెదకినట్లుగా
వెయ్యి కళ్ళతో నీదు రాకకై
వేచి వేచి చూస్తున్నానయ్యా
నే చూస్తున్నానయ్యా
//నిన్ను//
2 . ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న
నా ప్రియ ఏసుడు నాకై వచ్చును
నాదు రూపము మారిపోవును
నేను ఆయనతో యుగ యుగములు
జీవించెదను
ఆరాధింతును నే ఆరాధింతును
//నిన్ను//