పల్లవి : కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం "2"
ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువదు "2"
1. ఎదురౌ తారెందరో నీ పయనం లో
నిలిచేది ఎందరూ నీ అక్కరలో
వచ్చేదేవరూ నీతో మరణం వరకు "2"
ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు " ఏసే "
2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే "2"
సంపాదన ఎవరిదగును యోచించితివా " ఏసే "
3. నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి
విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా "2"
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా "ఏసే"
Showing posts with label క. Show all posts
Showing posts with label క. Show all posts
Tuesday, December 28, 2010
Sunday, December 26, 2010
కృప చేత
కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా (2)
నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే
నన్నెరిగి యున్నావయ్యా (2) "నేను "
2.తల్లి గర్బమున రూపింపక మునుపే -
పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) "నేను"
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు -
నీ రక్త దారాలతో నను కొన్నావు (2) "నేను"

Tuesday, December 21, 2010
కృప సత్య
పల్లవి : కృప సత్య సంపూర్ణుడా !
సర్వ లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య
నా సన్మానానికే మహానీయుడవు నీవేనయ్యా
1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే !
"కృప"
2. నూతన క్రియ ను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
నా ఎడారి జీవితమే - సుఖ సౌక్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే
"కృప"
3. నైవేద్యములు దహన బాలులు నీవు కోరవుగా
నా ప్రానాత్మ శరీరము బలియర్పణ కాగా
నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే !

Saturday, December 18, 2010
కాలమెల్ల
పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు
భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
పరలోక మహిమను - దివిదూత గణమును
విడనాడి నన్ను వేడుక వచ్చెను
ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
పాపి కొరకు ప్రాణమిచ్చెను " కా "
1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
కరుణ తోడను - నా కడకు చేరెను
నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు
నాదు బ్రతుకు మార్చి వేసెను " కా "
2. మంచి కాపరి - నా చెంత చేరెను
లేమిని లేకుండా చేసెను
దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను
పాతవి గతించెను - గీతమాలపింతును
యేసు తోడ నుందు నిరతము " కా "
3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను
కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
కొదువలేదు - దిగులు లేదుగా "కా"

Thursday, August 26, 2010
కృపామయుడా
కృపామయుడా నీలోన నివసింపజేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున || కృపా ||
2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
రాజ వంశములో - యాజకత్వము చేసెదను || కృపా ||
3. నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు || కృపా ||
4. ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను. || కృప ||

Subscribe to:
Posts (Atom)