Saturday, October 30, 2010

అగస్టీన్

పూర్తి పేరు :     అగస్టీన్ 
జన్మ స్థలం :    ఉత్తర అమెరికా లోని తగస్టీ
తల్లిదండ్రులు:   ఫ్యాట్రిక్, మోనికా 
జననం:           క్రీ.శ.354 
మరణం:          క్రీ.శ.431
రక్షనానుభవం: 34
సేవ ఫలితం:     'ఒప్పుకోలు', 'దేవుని పట్టణం' అనే పుస్తకాల ను రచించెను.


          అగస్టీన్ 354 వ సం.లో ఉత్తర ఆప్రికా లోని తగస్టీ అనే స్థలములో  ఫ్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించెను.  ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికి అన్యుడు, కోపిస్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు.  అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనా పరురాలు.  తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ప్రార్థించె డిది. 
         అగస్టీన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరం లో విద్య నభ్యసించెను.  మంచి విద్యావంతుడు, పుస్తకములు చదువుట ఇతనికి బహు ప్రీతి.  లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకోనేను.  గాని ఆ భాషలలో ఉన్న కట్టు కథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడుచేసు కొనెను.  అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి యుండి నందున  చాల అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను.  కనుక బైబిలు ను త్రునీకరించెను.  క్రీస్తును నెట్టి వేసెను.
         ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుని జీవితం మారవలేనని కన్నీటితో ప్రార్తించేడిది.  అగస్టీన్ తన తల్లి ప్రార్థన ను అపహసించి, ఒక పని పిల్లతో అక్రమ సంబంధము పెట్టుకొని అనేక సం.లు రోత జీవితము జీవించెను.  అయితే, ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలి పోతూ రక్షణ మార్గము వెదకుచుండెను.  తన స్వ శక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి విఫలుడాయేను.  
        ఒక రోజున ఒక బిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడం చూచి ' నా కంటె అతడే మెరుగుగా ఉన్నాడే'  అని ఆశ్చర్యపడెను.  ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు 'ఆండ్రూస్' అనే ఒక బిషప్పు గారి యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళగా; ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి , దాని అంతమును గురించి, సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి; ఏసుక్రీస్తు సిలువను గూర్చి బోధించగా అగస్టీన్ దేవుని ఆత్మచే ముట్ట బడి ఎంతో పశ్చాత్తాప పడి కన్నీటి తో ప్రార్థించుట మొదలు పెట్టెను.
        ఆలాగున ఒక రోజు ప్రార్థించు కొనుచుండగా " పరిశుద్ద గ్రంధము తీసుకొని చదువు"  అన్నా ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను.  అతడు బైబిలు తీసికొని చదువగా " మోసకరమైన దురాశాల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము విడిచి పెట్టి క్రీస్తు యేసును ధరించుడి".  అన్న వాక్యము పై అతని దృష్టి పడెను.  ఎపెసి 4:22-24 చదివి లోతైన పశ్చాత్తాపముతో ప్రార్థించిన అగస్టీన్ మారు మనస్సు పొందెను.  388  వ సం.లో ఈస్టర్ రోజున బాప్తిస్మం పొందెను.  13 సం.లుగా అగస్టీన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను.  అగస్టీన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్తిల్లుచు, తన ఉద్యోగం విడిచి పెట్టి క్రైస్తవ సాధువుల మతం లో చేరి దేవుని వాక్య పటనములోను, ప్రార్తనలోను ఎదుగుచుండెను.
     395 వ సం.లో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్ గా అభిషేకించ బడెను .  మంచి ప్రార్థన పరుడుగా కార్య నిర్వాహకుడుగా, ప్రసంగీకుడుగా పేరు పొందెను.  " ఒప్పుకోలులు", 'దేవుని పట్టణము' అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను వ్రాసెను.  సంఘ సంస్కరనకును, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను.
     ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77  వ ఏట గొప్ప పేరు పొంది " పరిశుద్దుడైన అగస్టీన్ అని పిలువబడెను.   రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితములో అనుభవించి ఇతరులకు బోధించెను.
   395 వ సం.లో తన 77 వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకోనేను పరిశుద్దు డైన ఈ అగస్టీన్.

WE THANK YOU LORD SONG WITH MESSAGE

Anointing - English/Telugu Christian Message

యేసు రక్తము ప్రభు యేసు రక్తము