Showing posts with label న. Show all posts
Showing posts with label న. Show all posts

Thursday, March 22, 2012

నిన్ను తలచి

          నిన్ను తలచి నిన్నే కోరి - నీకై వేచి యున్న 
          క్షణమైన నీవు లేక - బ్రతుకు లేనయ్యా //2//

          ఏసయ్యా  నీ  ప్రేమే నన్ను ఆకర్షించెను 
          నా ఏసయ్యా నీ కృపే - నన్ను ఆదరించెను
          కలువరిలో సిలువపై యాగమైతివి
          నీ ప్రేమ నీ త్యాగం మరువలేనయ్యా 

1 .      పెండ్లి కుమారుని రాక కోసమై బుద్ది గల
          కన్యలు ఎదురు చూచినట్లు 
          జారవిడిచిన నాణెం కొరకై ఒక స్త్రీ 
          ఓపికతో వెదకినట్లుగా
          వెయ్యి కళ్ళతో నీదు రాకకై 
          వేచి వేచి చూస్తున్నానయ్యా 
          నే చూస్తున్నానయ్యా
                                              //నిన్ను//

2 .      ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 
          నా ప్రియ ఏసుడు నాకై వచ్చును 
          నాదు రూపము మారిపోవును 
          నేను ఆయనతో యుగ యుగములు
          జీవించెదను 
          ఆరాధింతును  నే ఆరాధింతును 
                                              //నిన్ను//

Tuesday, December 27, 2011

నీవు చేసిన ఉపకారములకు

      నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
      ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ల నా
1. వేలాది  నదులంతా విస్తార తైలము నీ కిచ్చినా చాలునా
    గర్బ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని  నీ కిచ్చిన  చాలునా //2//  //నీవు//
2. మరణ పాత్రుడ  నై యున్న  నాకై  మరనిన్చితివా  శిలువలో
    కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో  యేసయ్య  //2//  //నీవు//
3. విరిగి నలిగినా బలియాగాముగాను నా హృదయ మర్పింతును
    రక్షణ పాత్రను చేబూని నిత్యమూ నిను వెంబ డించేదను //2//  //నీవు//
4. ఈ గొప్ప  రక్షణ నా కిచ్చి నందున నేనేమి చెల్లిం తును
     కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//

నడిపించు

     నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ 
     నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప

1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
     నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
     నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప 
     నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము 
     రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
     రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో 
     రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని 
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని 
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా 
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి 
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //
6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ 
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో 
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //            

నజరేయుడా

నజరేయుడా - నా యేసయ్య  - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య  దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద

1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
    శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
    నీకే వందనం ----- నీకే వందనం  // నజేరేయుడ  //
2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
    జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //
3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
    సీయోనులో నిను  చూడాలని - ఆశతో ఉన్నాను  నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //

Saturday, December 18, 2010

నీ నామమే

పల్లవి : నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము
           నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము  " నీ "
1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
పలుకరించింది ఇల నన్ను వెదకి 
ధరణి తడిసింది - నీ రక్త బలికి 
పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ 
పరిపూరిత దుదిరంబు బహుమానమే  " నీ "
2. నెమ్మి  నా నెయ్యమును కోరి చేరి 
నోవ్వులను సిల్వలో పొందగోరి 
దేవ కొమరుండా దిగివచ్చి నావా 
పరిచారకుని రూపు ధరియిన్చినావా 
పరిశుద చరితుండ - పరిపోషకా  " నీ "
3. థారునిని నీకు సమరూపుడేవాడు?
నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
పాలనుడ నన్ను ప్రేమించినావా
పాలకుడ నాదు, నజరేతువాడా 
మాలిన్యా కూపాన నా మొర్రను 
ఆలించి లాలించి - నను చేరినావా   " నీ "
4. సిల్వలో నిన్ను మనసార చూచి 
నియుడు కృప నేను మననంబు చేసి 
పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి 
చేరితిని నిన్ను స్తుతియింప దలచి 
కారుణ్యమున నాదు కలుశాలను 
పరిమార్జనము చేయు - పరిపోషకా  " నీ "

Tuesday, November 30, 2010

నిన్ను బట్టి బ్రతుకుతున్న

నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా  
నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా 
ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా

1. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
ఎన్నటికి  మారని వాగ్దానముందని
కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని                   " నిన్ను బట్టి "


2. హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు 
అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం 
అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
అందుకున్న నాడు అంతులేని సంతోషం                  " నిన్ను బట్టి "


3. అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం 
సింహాల బోనులో చెలరేగిన సంచలనం
పరీక్షలో విజయం తమదేనని
విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని                            " నిన్ను బట్టి "