Tuesday, November 30, 2010

నిన్ను బట్టి బ్రతుకుతున్న

నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా  
నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా 
ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా

1. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
ఎన్నటికి  మారని వాగ్దానముందని
కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని                   " నిన్ను బట్టి "


2. హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు 
అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం 
అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
అందుకున్న నాడు అంతులేని సంతోషం                  " నిన్ను బట్టి "


3. అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం 
సింహాల బోనులో చెలరేగిన సంచలనం
పరీక్షలో విజయం తమదేనని
విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని                            " నిన్ను బట్టి "


పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం 
ప్రభు మంచి వాడు మంచి చేయువాడు
సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే

1. సర్వ  జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి
స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి
ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము 

2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును
ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు

3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే 
తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్ 
మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా 

Saturday, November 20, 2010

దేవుని వాక్యానికి ఉన్న గుర్తులు:.

1. అద్దము: 
(యాకోబు 1:23-25)
* దేవుని వాక్యము పాపమును చూపును.
* దేవుని వాక్యమును పాటించక పొతే ఆత్మ క్షీణిస్తుంది.
2. ఒక విత్తనము: 
(1 పేతురు1:23, యాకోబు 1:18, మత్తయి 13:18-22)
* వాక్యము నాశనము కానిది.
* సదా కాలము నిలిచి ఉంటున్నది.
* వాక్యము ద్వారానే మనము తిరిగి జన్మించ బడ్డాము.
3. నీళ్ళు :
(ఎఫేసి5:25-27, కీర్తన 42:1, 119:9, సామే 25:25, యెషయ 55:10, హెబ్రీ 10:22,  ప్రకటన 22:17)
4. దీపము:
(కీర్తన 119:105, సామెత 6:23, 2 పేతురు 1:19)  
* మార్గాన్ని చూపిస్తున్నది.
5. ఖడ్గము :
(హెబ్రీ 4:12, ఎఫేసి 6:17)
* దేవుని వాక్యము రక్షణను దయచేస్తుంది.
* దేవుని వాక్యము దుష్టుని బాణములను తరిమి కొడుతుంది.
6. ప్రసస్తమైన లోహాలు:
* బంగారం
(కీర్తన 19:10, 119:10, 127, 12:6
6. పోషించే ఆహారం :
* పాలు (1పేతురు 2:2)
* మాంసం (హెబ్రీ 5:12-14)
* రొట్టె (యోహాను 6:51)
* తేనే (కీర్తన 19:10)
* దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది.
* దేవుని వాక్యము మనకు ఆత్మీయతను దయచేస్తుంది.
7. సుత్తి:
(ఈర్మి23:49, అ.కా.9:4, యూద 1:20)
8 . అగ్ని :
(ఈర్మియ20:9,  లూక 24:32, ఈర్మియ 23:29)
  

సంఘ చరిత్ర లో బైబిలు ఎదుర్కొన్న సవాళ్లు:

బైబిలు 3 విధములైన సవాళ్ళ ను ఎదుర్కొంటున్నది.
ఏ బోధ విషయములో సవాళ్లు వచ్చిన చివరకు సవాలు బైబిలు మీదనే పడుతుంది.
1. రాజకీయ హింస:
* క్రీ.శ.303  లో డై క్లిషణ్ అనే రోమ చక్రవర్తి బైబిలు ను నాశనం చేశాననుకుని కాల్చిన బూడిద పై ఒక కాలని ని కట్టాడు.
*కాన్ స్తాన్టిన్ అనే రాజు (రోమ) క్రైస్తవ మతం పుచ్చుకున్న తరువాత 24 గా.ల లోనే దాచి పెట్ట బడిన 50 బైబిలు కాపీలు తీసుకు రాబడ్డాయి.
2. మత సంబంధ హింస:
* రోమన్ కాథలిక్ పోపులలో చాల మంది బైబిలు ను నాశనం చేయుటకు ఎంతో ప్రయత్నం చేశారు.
* విలియం తిన్దేల్ మొట్ట మొదటి సారిగా క్రొత్త నిబంధనను ఇంగ్లీష్ లోనికి అనువాదం చేశారు.
3. తత్వ పరమైన హింస:
* అనేక మంది జ్ఞానులు బైబిలు ని నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
* వోల్టేర్ ఒక శతాబ్దం తరువాత భూమి మీద బైబిలు సంపూర్ణం గా అంతరిస్తుంది అని చెప్పాడు.
* శతాబ్దం తరువాత బైబిలు గ్రంధం బాగా వ్యాపించింది. అతని పాట ప్రింటింగ్ మిషన్ ని కొని, అతని ఇంటిలోనే జెనీవ బైబిలు సొసైటీ స్థాపించబడింది.
* థామస్ పైనే అనే అతను ఒకడు అడవిలో ప్రయాణం చేసి గొడ్డలితో చెట్లను నరికినట్లు నేను బైబిలు అంత చదివేశాను, బైబిలు చెప్పే దంతా అబద్దం. అని చెపాడు.
* అతను 1809 లో మరణించాడు కాని బైబిలు వ్యాపించింది.

దేవుని వాక్యపు శక్తి ఏమిటి?

* వాక్యము శక్తి వంతమైనది.
* దేవుని వాక్యమునకు ఒక పాపిని తిరిగి జన్మింప  చేయుటకు శక్తి ఉంది.
* ఒక పాపిని పరిశుద్దునిగా చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి గలదు.
* దేవుని వాక్య మూలముగా తిరిగి జన్మించినవారై యదార్థముగా ఒకరినొకరు ప్రేమించుకోనగలరు.
* దేవుని వాక్యము సదాకాలము నిలిచి ఉండును.
* దేవుని వాక్యము విత్తనము వలె మండుచున్న హృదయములలో పడి ఫలించును.
(యాకోబు1:18, 1 పేతురు 1:23, 1 తెస్సా 2:13)
* పరిశుద్ద పరచుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉంది.
(యోహాను 15:3,  ఎఫేసి 5:26)
* సంతోషమును ఇచ్చుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉంది.
(కీర్తనలు 119:111, 19:8)
* మనము రక్షణలో ఎదుగునట్లు చేయుటకు దేవేని వాక్యమునకు శక్తి కలదు.
(1పేతురు 2:2)
* తెలివి లేని వారిని జ్ఞానవంతులుగా చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి కలదు.(కీర్తన 19:7)
* విధేయత, నిరీక్షణ, మరియు విశ్వాసము కలిగిమ్పచేయుతకు దేవుని వాక్యమునకు శక్తి ఉండెను.
(యోహాను 20:31, కీర్తన 119:49, రోమ 10:17, 15:4,  ద్వి.కా. 17:19,20)
* దేవుని వాక్యము వలననే యేసు ప్రభువు నందు విశ్వాసము వస్తుంది.
* విశ్వాసము నిత్య జీవమునకు నడిపిస్తుంది.
* సువార్త లో యేసు ప్రభువును గురించిన సమాచారమును మరియు ఆహ్వానమును కలిగి యుండవలెను.  
* అపవాది పైన విజయమును కలిగింప చేయుటకు దేవుని వాక్యమునకు శక్తి ఉన్నది.
(1 యోహాను  2:14)
* రహస్య పాపమును బయలుపరచుటకు దేవుని వాక్యమునకు శక్తి కలదు.
(హెబ్రీ 4:12, ఇర్మియ 23:29)

Thursday, November 18, 2010

బైబిలు గొప్పతనము

బైబిలు గొప్పతనము 

బైబిలు లో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,173 వచనాలు, 7,74,746 పదాలు ఉన్నాయి.
1. లోకం పై బైబిలు ప్రభావం: 
* బైబిలు అనేక రాజ్యాలను, అనేక రాజులను ప్రభావితం చేస్తుంది.
* అమెరిక రాజ్యాంగం బైబిలు సూత్రాలపై కట్టబడినది.
* మన భారత దేశానికి స్వాతంత్ర్యమును తీసుకుని వచ్చుటలో మహాత్మా      గాంధి కొండ మీద యేసు చేసిన ప్రసంగం నుంచి కొన్ని సూత్రాలు తీసుకుని వాడుకున్నాడు.
 2. బైబిలు విశిష్టత:
* ప్రింటింగ్ మెషిన్ కనుగొన్న తరువాత ప్రచురణ చేయబడిన మొత్త మొదటి పుస్తకం బైబిలు.
* బైబిలు 40 కంటె ఎక్కువ మంది రచయితలతో (వేరు వేరు ప్రాంతాల నుండి వేరు వేరు సమయాల లో ఉన్న వారు)  వ్రాయ బడింది.
బైబిలు వలె మరి ఏ పుస్తకము కూడా అనేక భాషలలో తర్జుమా చేయ బడలేదు.
* బైబిలు అందుబాటలో ఉనంతగా మరి ఏ పుస్తకము అందుబాటులో లేదు.
* బైబిలు (కవర్) సేకరించిన  చేసిన (కొన్ని వందల సం.ల) చరిత్ర ను ఏ పుస్తకము కలిగి యుండలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము అంతగా అమ్ముడు పోలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము లోను అంత అధికమైన ఐక్యత భావం లేదు.

3. బైబిలు నిజాయితీ:
     బైబిలు భక్తులు చేసిన భక్తి జీవితమే కాదు వారు చేసిన తప్పులను కూడ ఎత్తి చూపిస్తున్నది.
* నోవః            గొప్పతనం        విశ్వాసం             (హెబ్రీ 11:7)
                      పొరపాటు         అధిక మద్యపాని  (ఆది 9:21 )
* మోషే           గొప్పతనం        సాత్వికుడు          (సంఖ్యా 12:3)
                      పొరపాటు         బండను కొట్టుట    (    "      20:11)
* దావీదు        గొప్పతనం        ధైర్యశాలి, హృదయానుసారుడు,దేవుని పట్ల ప్రేమ               
                      పొరపాటు          వ్యభిచారం 
                    (1 సముయేలు 13:14, 16:7, 17:34-36, 49, కీర్తనలు 18,103                   
                     అధ్యాయాలు )
* ఏలియ       గొప్పతనం         విశ్వాసం        (1 రాజులు 18 అద్య.)
                     పొరపాటు          పిరికితనం      (     "       19 అద్య.)
*పేతురు       గొప్పతనం          దేవునికోరకు నిలబడాలనే ఆశ (మత్త 26:33) 
                    పొరపాటు           ఉపేక్షించుట    (మత్తయి 26:74)

Wednesday, November 17, 2010

బైబిలు

బైబిల్ మూల విషయాలను తెలుసుకోవాలంటే మనల్ని మనం నాలుగు ప్రశ్నలు అడుక్కోవాలి.
1. బైబిలు అనే పదం ఎలా వచ్చింది?


బైబిలు అనే పదం బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది 


2. బైబిలు గురించి ఎవరు ఏమి చెప్పారు?


మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్నవారు ఈ విధం గా చెప్పారు.


జార్జ్ వాషింగ్టన్ :  బైబిలు లేకుండా లోకాన్ని సరిగా పరిపాలించడం అసాధ్యం.


అబ్రహం లింకన్:  బైబిలు లేకుండా మనము తప్పుకు మరియు ఒప్పుకు ఉన్న వ్యత్యాసమును మనము గ్రహించలేము.  ఇది దేవుడు మనిషికి ఇచ్చిన అతి శ్రేష్ట మయిన బహుమానము.


మార్టిన్ లూథర్ :  లేఖనములు దైవానుసారముగా వచ్చినవి, వాటిలో దేవుడు మాట్లాడుతాడు, అవి దేవుని వాక్యములు, దేవుని వాక్యములు వినుటయు మరియు చదువు టయు అనేవి దేవుని స్వరమును వినుట తో  సమానము.


3. బైబిలు చరిత్ర :


ఆది 1:1 ....అబ్రహాము....యోసేపు...మోషే...సముయేలు.....దావీదు....సోలోమోను....ఎజ్రా.....మలాకి.....నిశబ్ద కాలం 450 సం.లు ....బాప్తిస్మమిచ్చుయోహాను....యేసు.....అపోస్తలులు........శ్రమ కాలం....రెండవ రాకడ....


4. బైబిలు యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి?


1. లేఖనాలు రక్షణను కలిగిస్తాయి.(2 తిమోతి 3:15)
2. నిత్య జీవము అవగాహనను కలిగిస్తాయి.(1 యోహాను 5:13)
3. నిరీక్షణ కలుగజేస్తాయి. (రోమ 15:4)
4. హెచ్చరిక చేస్తాయి. (1 కొరింతి 10:11)
5. సేవకుని సిద్దపరుస్తాయి . (2 తిమోతి 3:16)