Showing posts with label ఆ. Show all posts
Showing posts with label ఆ. Show all posts

Thursday, March 22, 2012

ఆరని

                     ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది 
                     అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది 
                      అవదులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది.
                                                                     //ఆరని//

               1 .  సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది 
                     బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది 
                     ఇది సజీవ మైనది - ఇదే సత్యమైనది 
                     ఇది నిత్య మైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది 
                     కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది  
                                                                         //ఆరని//

                 2. నా స్తానమందు నిలిచి - నా శిక్షనే భరియించి 
                    క్రయ ధనమును చెల్లించి- గొప్ప రక్షణ నిచ్చినది 
                     నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది 
                     ఆ ఉన్నత రాజ్యమందు - నాకు స్టాన మిచ్చినది 
                     ఉన్నత ప్రేమే ఇది - అత్యున్నత ప్రేమ ఇది 
                                                                     //ఆరని//

                  3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు 
                       చెరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా 
                       ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది 
                       ప్రవహించు చున్నది - ప్రతి పాపి చెంతకు 
                        ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది.
                                                                          //ఆరని//  

Wednesday, March 21, 2012

ఆకాశామందున్న ఆసీనుడా నీ తట్టు 
కనులెత్తు చున్నాను నేను నీ తట్టు 
కనులెత్తు చున్నాను        
                                     //ఆకాశ// 
దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక 
తిరుగుచున్నాను 
కరుణించు మా యేసు, కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                     //ఆకాశ//
గాయపడిన గొర్రె ను నేను - బాగు చేయుమా 
పరమ వైద్యుడా
కరుణించు మా యేసు కాపాడును 
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                      //ఆకాశ//  
పాప ఊబిలో పడివున్నాను - లేవ నెత్తుమా
బాగు చేయుమా 
కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                   //ఆకాశ//     

Saturday, December 18, 2010

ఆనందింతు

ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు 
మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా 
1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా 
అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ 
2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ
నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన
3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న
ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు
4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ
అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి

ఆరని

పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది 
            అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది 
            అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది 
            కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది      " ఆరని "
        1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది 
            బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది 
            ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది 
            ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
            కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది     " ఆరని "
        2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి 
            క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది 
            నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది 
            ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది 
            ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది        " ఆరని "
        3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు 
           చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా 
           ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది 
           ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు 
           ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది       " ఆరని "

Wednesday, December 8, 2010

ఆనంద యాత్ర

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర 
యేసుతో నూతన యెరుశాలేము యాత్ర 
1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
ఎయి నోళ్ళతో స్తుతియించినను
తీర్చలేము ఆ ఋణమును  " ఆనంద "
2. రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై 
దేవ దూతలు మనకుండగా " ఆనంద "
3. కృతజ్ఞతా లేనివారు వేల కొలదిగా కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై 
కృప వెంబడి కృపను పొందెదము  " ఆనంద "
4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం 
ఆత్మానంద భారితులమై - ఆగమన కాంక్షతో సాగేదం  " ఆనంద "

Sunday, December 5, 2010

ఆశ్చర్యమైన ప్రేమ

ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ 
మరణము కంటే - బలమైన ప్రేమది - నన్ను జయించే నీ ప్రేమ 
1. పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ 
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్య జీవమిచ్చే " 2 "" ఆశ్చర్య "
2. పావన యేసుని ప్రేమ సిలువలో - పాపిని మోసిన ప్రేమ 
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చే " 2 "" ఆశ్చర్య " 
3. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ 
విడనాడని  ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు  " 2 " " ఆశ్చర్య "
4. నా స్థితి జూచిన ప్రేమ నాపై - జాలిని చూపిన ప్రేమ 
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే " 2 " " ఆశ్చర్య "

ఆయనే నా సంగీతము

ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాది పతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతిన్చేదను 
1. స్తుతుల మధ్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల మొరలు వినే 
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే  " ఆయనే " 
2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యాలోన 
ఉండేధననిన మన దేవుని 
కరములు తట్టి నిత్యం స్తుతించేదము  " ఆయనే "
3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును 
జీవితకాలమేల్ల కీర్తించేదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రోక్కేదము స్తుతిన్తుము - పొగడెదము   " ఆయనే "

Saturday, December 4, 2010

అనంత జ్ఞాని నీకు

అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా !
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా !
కృపా ఇది నీ కృపా కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప 
కృప కృప కృప కృప కృప  " అనంత "
1. కోట్లాది జనులలో గుర్తించావు - కూరుకుని నీ ప్రజాగా లేక్కిన్చావు " 2 "
క్షమించే మనసు కలిగి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు " కృప "
2. అప్పగించుకున్నాను నీ కృప కే నేను 
గొప్ప దేవుడా నీ సన్నిది లో ఉన్నాను " 2 "
పిలిచిన వాడా నన్ను గెలిచినా వాడా " 2 "
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా  " కృప " అనంత "