ఉధయమాయే హృదయమా - ప్రభు యేసుని ప్రార్తించవే
పదిలముగా నిను వదలకుండా పడకనుండి లేపెనే||౨||
రాత్రి గడచి పోయెనే - రవి తూర్పున ఉదయించేనే
రాజ రక్షకుడేసు దేవుని - మహిమతో వివరింపవే ||ఉదయమా||
తొలుత పక్షులు లేచేనే - తమ గూటి నుండి స్తుతించేనే
తండ్రి నీవే దిక్కు మాకని - ఆకశమునకు ఎగిరినే ||ఉదయమా|
పావనుడా పరిశుద్దుడా - పరంధాముడ చిరంజీవుడా
పగటి అంతయు గాచి మమ్ము - పాలించుము దైవమా ||ఉదయమా ||
తండ్రి తాతయు నీవని - ధరయందు దిక్కు కలదనీ
రాక వరకు కాచి మమ్ము - కనికరించి బ్రోవవే ||ఉదయమా||