Showing posts with label అ. Show all posts
Showing posts with label అ. Show all posts

Thursday, April 7, 2011

అనంత జ్ఞాని

అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప          " అనంత "
1. కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు 
క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు           " కృప "
2. అప్పగించుకున్నాను నీ కృప కే  నేను 
గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను          " 2 "
పిలిచినవాడా నన్ను గెలిచినవాడా              " 2 "
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ           "కృప " "అనంత "

Thursday, August 26, 2010

అత్యున్నత సింహాసనము పై

అత్యున్నత సింహాసనము పై - ఆసినుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే 
ఆహాహా ... హేల్లెలుయా ||4||
ఆహాహా ... హేల్లెలుయా ||౩|| ఆమెన్ 
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం 
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించితివే - నా రక్షణ కర్తా స్తోత్రం
ఆమెన్ అనువాడ స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ - అత్యున్నతుడా స్తోత్రం
యుగయుగములు సజీవుడా స్తోత్రం - తరతరముల దేవుడవు స్తోత్రం
ఏడు దీప స్తంబముల మధ్య సంచరించే - జ్యోతిర్మయుడ స్తోత్రం
అతి కాంక్షనీయుడా స్తోత్రం - అతి సుందరుడా స్తోత్రం
అతి మనోహరుడా మహిమాన్వితుడా - ఆరాధ్యుడా నీకు స్తోత్రం
స్తుతులపై ఆసీనుడ స్తోత్రం - సంపూర్నుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం
మ్రుత్యున్జయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం 
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం