ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
దేవుడు క్షమించు దేవుడు "2"
ఆప్తులకన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు " ఓ తల్లి "
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ "2"
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ "2"
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ " ఓ తల్లి "
2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను
త్రోయక దరిచేర్చు ప్రేమ "2"
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ "2"
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా..." ఓ తల్లి "
Showing posts with label ఓ. Show all posts
Showing posts with label ఓ. Show all posts
Sunday, December 26, 2010
Sunday, December 19, 2010
ఓ క్రైస్తవుడా
పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము "క్రై"
2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము "క్రై"
3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము "క్రై"
4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో "క్రై"
5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని "క్రై"
6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా "క్రై"
7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు "క్రై"
8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు "క్రై"
ఓ ప్రభువా
పల్లవి : ఓ ప్రభువా - ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి
1. దారి తప్పిన నన్ను ను నీవు వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి " ఓ "
2. నీవు ప్రేమించిన గోర్రేలన్నిటిని ఎల్లప్పుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి " ఓ "
3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలో
నన్ను నీవు మరువని దేవా నీవే మా మంచి కాపరివి " ఓ "
Subscribe to:
Posts (Atom)