Tuesday, December 27, 2011

నీవు చేసిన ఉపకారములకు

      నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
      ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ల నా
1. వేలాది  నదులంతా విస్తార తైలము నీ కిచ్చినా చాలునా
    గర్బ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని  నీ కిచ్చిన  చాలునా //2//  //నీవు//
2. మరణ పాత్రుడ  నై యున్న  నాకై  మరనిన్చితివా  శిలువలో
    కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో  యేసయ్య  //2//  //నీవు//
3. విరిగి నలిగినా బలియాగాముగాను నా హృదయ మర్పింతును
    రక్షణ పాత్రను చేబూని నిత్యమూ నిను వెంబ డించేదను //2//  //నీవు//
4. ఈ గొప్ప  రక్షణ నా కిచ్చి నందున నేనేమి చెల్లిం తును
     కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//

నడిపించు

     నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ 
     నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప

1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
     నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
     నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప 
     నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము 
     రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
     రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో 
     రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని 
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని 
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా 
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి 
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //
6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ 
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో 
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //            

నజరేయుడా

నజరేయుడా - నా యేసయ్య  - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య  దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద

1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
    శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
    నీకే వందనం ----- నీకే వందనం  // నజేరేయుడ  //
2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
    జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //
3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
    సీయోనులో నిను  చూడాలని - ఆశతో ఉన్నాను  నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //

Monday, December 26, 2011

శుభ వేళ - స్తోత్రబలి

శుభ వేళ - స్తోత్రబలి
తండ్రి దేవ - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్ర బలి
తండ్రి దేవ - నీకేనయ్యా
1. ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ //2//
2. ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
నన్నిలా చూచువాడా  - ఎల్ రోయి ఎల్ రోయి //2//
3. యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం //2//