ఎంత రమ్యములు యెహోవ నీ నివాసములు
ఎంత సుందరములు యెహోవ నీ గుడారములు
నీ మందిరావరణం నే కోరుకున్న వరం
నీ దివ్య బలిపీటం పిచ్చుకలకు ఆవాసం
కోయిలకు గూటి స్తలం నీ దాసుల ఆశ్రయం
//ఎంత //
నీ పాద సేవకులు ఇలలో నిరాశ్రయులు
నీ పద పిచ్చుకులు నీ ఆలయ నివాసులు
నీ ప్రజలకు కనిపించే కోవెలలో కాపరులు
//ఎంత//
మరణానికి సంకేతం బలి పీటమే గదా
ఆ స్థలమే పక్షులను కాపాడే గూడు కదా
శరనార్దులకది నిరతం స్థావరమై వెలెసే గదా
//ఎంత//
నీ మందిర నివాసులు - నీ బలమొందే
ప్రజలు నిను నమ్ముకొనే జనులు
నిజముగా బహు ధన్యులు నీ గుదారమే
శ్రేష్టం - నీ ప్రసంనతే క్షేమం
//ఎంత//
నీ దర్శన సౌభాగ్యం - నీ సన్నిధి సంతోషం
నీ ప్రాణం అస్శించు - నా హృదయం కాంక్షించు
నీ భక్తుని ద్రుస్టించు మా - అభిషిక్తుని
లక్షించుమా
//ఎంత//
నీ మందిర ద్వారమున - ఒక్క రోజు గడిపిన చాలు
అవినీతి గుదారమున - వేయు దినాల కన్నా మేలు
నీ దాసుని ద్రుస్టించుమా
//ఎంత//