Monday, April 16, 2012

శాశ్వతమైనది నీవు

పల్లవి :  శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప 
            అనుక్షణం నను కనుపాప వలె కాచిన కృప 
1.         నీకు బహు దూరమైనా నన్ను - చేరదీసిన నా తండ్రివి 
            నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో 
2.         తల్లి తన బిడ్డలను మరచినా - నిను మరువలేనంటివే
            నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే
3.         పర్వతములు తొలగినాను మెట్టలు తత్తరిల్లినను
            నీ కృప నిను వీడదని అభయమిచ్చితివి  

Saturday, April 14, 2012

స్తుతియించెద నీ..

పల్లవి: స్తుతియించెద నీ నామము దేవ అను దినము //2//
1.        దయతో కాపాడినావు - క్రుపనే చూపించినావు //2//  
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు  
2.        పాపిని యుండగా నేను - రక్షించి దరిచేర్చినావు //2//
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు 
3.        సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం     //2//
           నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు

Thursday, March 22, 2012

నిన్ను తలచి

          నిన్ను తలచి నిన్నే కోరి - నీకై వేచి యున్న 
          క్షణమైన నీవు లేక - బ్రతుకు లేనయ్యా //2//

          ఏసయ్యా  నీ  ప్రేమే నన్ను ఆకర్షించెను 
          నా ఏసయ్యా నీ కృపే - నన్ను ఆదరించెను
          కలువరిలో సిలువపై యాగమైతివి
          నీ ప్రేమ నీ త్యాగం మరువలేనయ్యా 

1 .      పెండ్లి కుమారుని రాక కోసమై బుద్ది గల
          కన్యలు ఎదురు చూచినట్లు 
          జారవిడిచిన నాణెం కొరకై ఒక స్త్రీ 
          ఓపికతో వెదకినట్లుగా
          వెయ్యి కళ్ళతో నీదు రాకకై 
          వేచి వేచి చూస్తున్నానయ్యా 
          నే చూస్తున్నానయ్యా
                                              //నిన్ను//

2 .      ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 
          నా ప్రియ ఏసుడు నాకై వచ్చును 
          నాదు రూపము మారిపోవును 
          నేను ఆయనతో యుగ యుగములు
          జీవించెదను 
          ఆరాధింతును  నే ఆరాధింతును 
                                              //నిన్ను//

ఆరని

                     ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది 
                     అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది 
                      అవదులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది.
                                                                     //ఆరని//

               1 .  సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది 
                     బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది 
                     ఇది సజీవ మైనది - ఇదే సత్యమైనది 
                     ఇది నిత్య మైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది 
                     కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది  
                                                                         //ఆరని//

                 2. నా స్తానమందు నిలిచి - నా శిక్షనే భరియించి 
                    క్రయ ధనమును చెల్లించి- గొప్ప రక్షణ నిచ్చినది 
                     నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది 
                     ఆ ఉన్నత రాజ్యమందు - నాకు స్టాన మిచ్చినది 
                     ఉన్నత ప్రేమే ఇది - అత్యున్నత ప్రేమ ఇది 
                                                                     //ఆరని//

                  3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు 
                       చెరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా 
                       ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది 
                       ప్రవహించు చున్నది - ప్రతి పాపి చెంతకు 
                        ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది.
                                                                          //ఆరని//  

Wednesday, March 21, 2012

ఎంత రమ్యములు

ఎంత రమ్యములు యెహోవ నీ నివాసములు 
ఎంత సుందరములు యెహోవ నీ గుడారములు 

నీ మందిరావరణం నే కోరుకున్న వరం 
నీ దివ్య బలిపీటం పిచ్చుకలకు ఆవాసం 
కోయిలకు గూటి స్తలం నీ దాసుల ఆశ్రయం 
                                                      //ఎంత //

నీ పాద సేవకులు ఇలలో నిరాశ్రయులు 
నీ పద పిచ్చుకులు నీ ఆలయ నివాసులు 
నీ ప్రజలకు కనిపించే కోవెలలో కాపరులు 
                                                         //ఎంత//

మరణానికి సంకేతం బలి పీటమే గదా
ఆ స్థలమే పక్షులను కాపాడే గూడు కదా 
శరనార్దులకది నిరతం స్థావరమై వెలెసే గదా 
                                                        //ఎంత//

నీ మందిర నివాసులు - నీ బలమొందే
ప్రజలు  నిను నమ్ముకొనే జనులు 
నిజముగా  బహు ధన్యులు నీ గుదారమే
శ్రేష్టం - నీ ప్రసంనతే క్షేమం 
                                                        //ఎంత//

నీ దర్శన సౌభాగ్యం - నీ సన్నిధి సంతోషం 
నీ ప్రాణం అస్శించు -  నా హృదయం కాంక్షించు 
నీ భక్తుని ద్రుస్టించు మా - అభిషిక్తుని 
లక్షించుమా 
                                                     //ఎంత//

నీ మందిర ద్వారమున - ఒక్క రోజు గడిపిన చాలు 
అవినీతి గుదారమున - వేయు దినాల కన్నా మేలు 
నీ దాసుని ద్రుస్టించుమా 
                                                    //ఎంత//      
ఆకాశామందున్న ఆసీనుడా నీ తట్టు 
కనులెత్తు చున్నాను నేను నీ తట్టు 
కనులెత్తు చున్నాను        
                                     //ఆకాశ// 
దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక 
తిరుగుచున్నాను 
కరుణించు మా యేసు, కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                     //ఆకాశ//
గాయపడిన గొర్రె ను నేను - బాగు చేయుమా 
పరమ వైద్యుడా
కరుణించు మా యేసు కాపాడును 
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                      //ఆకాశ//  
పాప ఊబిలో పడివున్నాను - లేవ నెత్తుమా
బాగు చేయుమా 
కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను 
నీ తట్టు కను లెత్తు చున్నాను 
                                   //ఆకాశ//     

గొప్ప దేవుడు మంచి దేవుడు

గొప్ప దేవుడు మంచి దేవుడు
మహోన్నతుడు నా దేవుడు
హల్లెలూయా హల్లెలూయా - 2

పాపాంద కారములో నేనుండగా
నా హీన స్తితిని నీవు మార్చినావు - 2
దీనులను పైకి లేవనెత్తు వాడవనీ  - 2
నీ వాగ్దానం నా యెడ నెరవేర్చితివి //హల్లే//

నా తల్లి నన్ను మరచినను
నా అన్నవారే వెలిసిన - 2
విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చావు  అ ..అ ..2
నీ వాగ్దానం నా యెడ నెరవేర్చితివి
ఎలెలో హైలెస్సా ఎలెలో హైలెస్సా - 2
హల్లెలూయా - హల్లెలూయా - 2
                                      //గొప్ప //  

Monday, March 19, 2012

స్తుతి స్తోత్రమో ప్రభువా

స్తుతి  స్తోత్రమో ప్రభువా  స్తుతి  స్తోత్రమో ప్రభువా 
కరుణాల హృదయ మరియా సుతా 

అమలోద్బవి దయ సుతుడా - సదా నిన్నే స్తుతిన్తుమయా 
ప్రపూజనీయు కీర్తనలు - మదిలో ప్రభూ పాడెదము  
                                                                          // స్తుతి// 

జగమంతయు ఒకే హృదిగా - సదా నిన్నే స్తుతిన్తుమయా 
సుధామృతాలు గ్రోలుమనీ - మదిలో ప్రభూ వేడెదము 
                                                                          //స్తుతి//

మృదు భాషిత దయాసుతుడా - సదా మిమ్మే స్తుతిన్తుమయా 
కరుణా ప్రదాత నీచరితం - హృదిలో ప్రభూ పాడెదము 
                                                                             //స్తుతి//

Sunday, March 18, 2012

యేసు పుట్టె నంట ఈ వార్తా నాకు తెలిసే

యేసు పుట్టె నంట ఈ వార్తా నాకు తెలిసే
ఆనందమాయే నాకు ఆనందమాయే - 2

ఈ పాపం నుండి ఎవరు విడిపింతురని
ఈ శాపం నుండి ఎవరు విమోచింతురని
ఎదురు చూచు వేళ ..........- 2
యేసు మాట వింటే
 ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "

ఈ చీకటిలోన దారెవరు చూపునని
ఈ దీన దరిద్రుని దరికేవరు చూపునని
ఎదురు చూసు వేళ .......2
యేసు గూర్చి వింటే
 ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "

రాజులకే రాజట ప్రభువులకే ప్రభువట
ఆల్ఫా ఓ మేగట ....ఆ ...ఆ...
అందరికి ప్రభువట
  ఆనందమాయే నాకు ఆనందమాయే - 2
                                            "యేసు "
 

యేసయ్య జన్మించావా

యేసయ్య జన్మించావా
నా యేసయ్యా జన్మించావా - 2  ఓ ..ఓ..

మేడల యందు కాదు
టంగు టుయ్యాల యందు కాదు
పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "
ఆదాము చేసిన పాపము
అవ్వమ్మ తెచ్చెను శాపము - 2 ఓ.. ఓ..

పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "
లోకాల నేలె రాజా పరలోకాన్ని విడిచి వచ్చావా

పాపులయిన ఈ నరుల కొరకు పశు పాకలో - 2
                                                   "యేసయ్య "