Tuesday, November 30, 2010

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం 
ప్రభు మంచి వాడు మంచి చేయువాడు
సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే

1. సర్వ  జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి
స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి
ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము 

2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును
ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు

3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే 
తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్ 
మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా 

No comments:

Post a Comment