Thursday, March 22, 2012

నిన్ను తలచి

          నిన్ను తలచి నిన్నే కోరి - నీకై వేచి యున్న 
          క్షణమైన నీవు లేక - బ్రతుకు లేనయ్యా //2//

          ఏసయ్యా  నీ  ప్రేమే నన్ను ఆకర్షించెను 
          నా ఏసయ్యా నీ కృపే - నన్ను ఆదరించెను
          కలువరిలో సిలువపై యాగమైతివి
          నీ ప్రేమ నీ త్యాగం మరువలేనయ్యా 

1 .      పెండ్లి కుమారుని రాక కోసమై బుద్ది గల
          కన్యలు ఎదురు చూచినట్లు 
          జారవిడిచిన నాణెం కొరకై ఒక స్త్రీ 
          ఓపికతో వెదకినట్లుగా
          వెయ్యి కళ్ళతో నీదు రాకకై 
          వేచి వేచి చూస్తున్నానయ్యా 
          నే చూస్తున్నానయ్యా
                                              //నిన్ను//

2 .      ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 
          నా ప్రియ ఏసుడు నాకై వచ్చును 
          నాదు రూపము మారిపోవును 
          నేను ఆయనతో యుగ యుగములు
          జీవించెదను 
          ఆరాధింతును  నే ఆరాధింతును 
                                              //నిన్ను//

No comments:

Post a Comment