Tuesday, December 27, 2011

నీవు చేసిన ఉపకారములకు

      నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
      ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ల నా
1. వేలాది  నదులంతా విస్తార తైలము నీ కిచ్చినా చాలునా
    గర్బ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని  నీ కిచ్చిన  చాలునా //2//  //నీవు//
2. మరణ పాత్రుడ  నై యున్న  నాకై  మరనిన్చితివా  శిలువలో
    కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో  యేసయ్య  //2//  //నీవు//
3. విరిగి నలిగినా బలియాగాముగాను నా హృదయ మర్పింతును
    రక్షణ పాత్రను చేబూని నిత్యమూ నిను వెంబ డించేదను //2//  //నీవు//
4. ఈ గొప్ప  రక్షణ నా కిచ్చి నందున నేనేమి చెల్లిం తును
     కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//

నడిపించు

     నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ 
     నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప

1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
     నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
     నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప 
     నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము 
     రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
     రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో 
     రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని 
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని 
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా 
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి 
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //
6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ 
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో 
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //            

నజరేయుడా

నజరేయుడా - నా యేసయ్య  - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య  దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద

1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
    శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
    నీకే వందనం ----- నీకే వందనం  // నజేరేయుడ  //
2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
    జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //
3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
    సీయోనులో నిను  చూడాలని - ఆశతో ఉన్నాను  నా యేసయ్య
    నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //

Monday, December 26, 2011

శుభ వేళ - స్తోత్రబలి

శుభ వేళ - స్తోత్రబలి
తండ్రి దేవ - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్ర బలి
తండ్రి దేవ - నీకేనయ్యా
1. ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ //2//
2. ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
నన్నిలా చూచువాడా  - ఎల్ రోయి ఎల్ రోయి //2//
3. యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం //2//

Thursday, April 7, 2011

అనంత జ్ఞాని

అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప          " అనంత "
1. కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు 
క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు           " కృప "
2. అప్పగించుకున్నాను నీ కృప కే  నేను 
గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను          " 2 "
పిలిచినవాడా నన్ను గెలిచినవాడా              " 2 "
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ           "కృప " "అనంత "

Tuesday, December 28, 2010

కొంత సేపు

పల్లవి : కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
           ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం "2"
           ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు 
           మరణమైన జీవమైన నిన్ను విడువదు "2"
       1. ఎదురౌ తారెందరో నీ పయనం లో 
           నిలిచేది ఎందరూ నీ అక్కరలో 
           వచ్చేదేవరూ నీతో మరణం వరకు "2"
           ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు " ఏసే "
       2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
           ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
           ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే "2"
           సంపాదన ఎవరిదగును యోచించితివా " ఏసే "

      3. నీ శాపం తాను మోసి పాపం తీసి 
           రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి 
           విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా  "2"
           నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా "ఏసే"

Sunday, December 26, 2010

కృప చేత

కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా (2)
నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే 
నన్నెరిగి యున్నావయ్యా (2) "నేను "
2.తల్లి గర్బమున రూపింపక మునుపే -
 పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) "నేను"
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు - 
నీ రక్త దారాలతో నను కొన్నావు (2) "నేను" 

ఓ తల్లి కన్నను

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను  - ప్రేమించు 
దేవుడు క్షమించు దేవుడు "2" 
ఆప్తులకన్నా ప్రేమించు  దేవుడు 
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు  " ఓ తల్లి "
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ 
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ "2"
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే  ప్రేమ "2"
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది  యేసు ప్రేమ " ఓ తల్లి "
2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను 
త్రోయక దరిచేర్చు ప్రేమ "2"
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ "2"
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా..." ఓ తల్లి "

Tuesday, December 21, 2010

దేవుని వాక్యానికి ..

దేవుని వాక్యానికి ఉన్న వేరు వేరు రూపాలు :
దేవుని వాక్యం ఒక వ్యక్తి గా ఉన్నది - యోహా 1:1,14,  Iయోహా 1:1,  ప్రక 19:13
దేవుని వాక్యం దేవుని చేత పలుక బడింది - ఆది 1:3, కీర్త 33:6
       - దేవుని ఆజ్ఞ -  ( ఆది 1:3, కీర్త 33:6 , హెబ్రీ 1:3 )
       - దేవుని వాక్యము వ్యక్తి గతము గా మాట్లాడుతుంది ( ఆది 2:16,17, 
        3:16-19, మత్తయి  3:17 )
      - దేవుని వాక్యము మనుష్యుల పెదవుల ద్వారా పలుకబడుతుంది 
         ( నిర్గ 4:12, సంఖ్యా 22:38, Iసమూ 15:3,18,23, 
          Iరాజులు 20:36, )

కృప సత్య

పల్లవి : కృప సత్య సంపూర్ణుడా !
            సర్వ లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య 
            నా సన్మానానికే మహానీయుడవు నీవేనయ్యా 


       1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా 
           దాటిరే నీ జనులు బహు క్షేమముగా 
           ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే !  
                                                                          "కృప"
       2. నూతన క్రియ ను చేయుచున్నానని నీవు సెలవియ్యగా 
           నా ఎడారి జీవితమే - సుఖ సౌక్యము కాగా 
           నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే      
                                                                           "కృప"
       3. నైవేద్యములు దహన బాలులు నీవు కోరవుగా 
           నా ప్రానాత్మ శరీరము బలియర్పణ కాగా 
           నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే ! 
                                                                             "కృప"