పల్లవి : కృప సత్య సంపూర్ణుడా !
సర్వ లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య
నా సన్మానానికే మహానీయుడవు నీవేనయ్యా
1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే !
"కృప"
2. నూతన క్రియ ను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
నా ఎడారి జీవితమే - సుఖ సౌక్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే
"కృప"
3. నైవేద్యములు దహన బాలులు నీవు కోరవుగా
నా ప్రానాత్మ శరీరము బలియర్పణ కాగా
నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే !
"కృప"
No comments:
Post a Comment