ఆకాశామందున్న ఆసీనుడా నీ తట్టు
కనులెత్తు చున్నాను నేను నీ తట్టు
కనులెత్తు చున్నాను
//ఆకాశ//
దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక
తిరుగుచున్నాను
కరుణించు మా యేసు, కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను
నీ తట్టు కను లెత్తు చున్నాను
//ఆకాశ//
గాయపడిన గొర్రె ను నేను - బాగు చేయుమా
పరమ వైద్యుడా
కరుణించు మా యేసు కాపాడును
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను
నీ తట్టు కను లెత్తు చున్నాను
//ఆకాశ//
పాప ఊబిలో పడివున్నాను - లేవ నెత్తుమా
బాగు చేయుమా
కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కను లెత్తు చున్నాను - నేను
నీ తట్టు కను లెత్తు చున్నాను
//ఆకాశ//
No comments:
Post a Comment