Saturday, December 18, 2010

కాలమెల్ల

పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు 
           భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
           పరలోక మహిమను - దివిదూత గణమును
           విడనాడి నన్ను వేడుక వచ్చెను 
           ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
           పాపి కొరకు ప్రాణమిచ్చెను      " కా " 
1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
    కరుణ తోడను - నా కడకు చేరెను
    నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు 
    నాదు బ్రతుకు మార్చి వేసెను        " కా "
2. మంచి కాపరి - నా చెంత చేరెను 
    లేమిని లేకుండా చేసెను 
    దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను 
    పాతవి గతించెను - గీతమాలపింతును
    యేసు తోడ నుందు నిరతము       " కా "
3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను 
    కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
    నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
    కొదువలేదు - దిగులు లేదుగా   "కా"

No comments:

Post a Comment