ప్రియులారా, నేను ఆంధ్ర ప్రదేశ్ ఉత్పాదక మండలి లో జాబు చేసే సమయంలో నేను మా సీనియర్ శ్రీను తో కలసి శ్రీకాకుళం జిల్లా సోంపేట కు క్యాంపు కు వెళ్ళాము, మా సీనియర్ బ్రహ్మ కుమారి, అతను రమ్మంటే రోజు సాయంత్రం అక్కడికి అతనితో వెళ్ళేవాడిని. నేను యేసు గురించి చెబుతుంటే, వారు శివ బాబా గురించి చెబుతుండేవారు, నేను చెప్పేది వారు ఓపికతో వినేవారు, వారు చెప్పేది నేను వినేవాడిని. యేసు ని మేము నమ్ముతాము, ఆయన ఒక మార్గము అని చెప్పేవారు. నేను ఏసే మార్ఘం అని చెప్పేవాడిని.
అక్కడ క్యాంపు అయిపోయిన తరువాత కాశిబుగ్గ లో క్యాంపు పడింది.
అక్కడ 10 రోజులు వారు మాకు షెల్టర్ ఇచ్చారు. నేను మా సీనియర్ ఇద్దరమూ బ్రహ్మ కుమారీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాము. మాకు ప్రత్యేకమయిన రూం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ మమ్మల్ని చాల ప్రేమగా చూసుకున్నారు, అంతటి ప్రేమ నాకు క్రిస్టియన్స్ లో కనిపించలేదు, వాళ్ళు చేసే భక్తి కూడ చాల సిన్సియర్ గా చేసేవాళ్ళు. తెల్లవారుజామున 3 గం.లకు లేచి వారి పూజలు చేసుకునేవారు. నేను కావాలనే 8 గం.లకు వాళ్ళ పూజలు అయిపోయిన తరువాత లేచేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు అనుకునే వాడిని క్రిస్టియన్స్ కూడ ఈ విధంగా ప్రేమతో, భక్తి చేస్తె, అద్బుతాలు జరిగి ఉండేవి కదా అని. మీరు ఇంతగా భక్తి చేస్తున్నారు, మీరు చేస్తున్న భక్తి మిమ్మల్ని పరలోకానికి (స్వర్గానికి) తీసుకువెలుతుందా? ఎందుకంటే పరలోకపు సంఘతులు పరలోకానికి వెళ్లి వచ్చిన వారికే తెలుస్తాయి, యేసు పరలోకం నుండి వచ్చాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, కాబట్టి పరలోకపు సంఘతులు, మరియు మరణం తరువాత జరిగే సంగతులు ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు వింటేనే శ్రేష్టం కదా అని అడిగాను, దానికి వారు యేసు మరనిచి తిరిగి లేచాడు అనే విషయాని మేమూ నమ్ముతాము, మేము వెళ్ళే మార్గము కూడ పరలోకానికి తీసుకువేల్లుతుంది అని మేము నమ్ముతాము అని సమాధానం చెప్పారు. అక్కడ క్యాంపు అయిపోయిన తరువాత వారికి థాంక్స్ చెప్పి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాము. మీరు ఈ విధము గా పరిచయం అవ్వడం మాకు సంతోషకరంగా ఉంది అని చెప్పారు, మేము అక్కడ నుండి శ్రీకాకుళం వచ్చేశాము.
No comments:
Post a Comment