Wednesday, August 18, 2010

ఈ స్వాతంత్ర్యం క్రీస్తు వలన కలిగెను

 యేసు లో ఉన్న ఆనందం లోకంలో లేదు. లోకానికి యేసు లో ఎంత ఆనందం ఉన్నదో తెలియాల్సి ఉన్నది. యేసు లో ఉన్న ఆనందం ఏంటో లోకం గ్రహించడం లేదు. దానికి కారణం పాపం.  పాపం నుండి కలిగే విమోచన కంటే గొప్ప విమోచన లోకంలోనే లేదు.  ఈ పాపానికి విమోచన యేసు వద్దనే ఉన్నది.  పాప బంధకములో ఉన్నవారు పాప ఆశలతో నిండి అదే ఆనందమని అనుకోనుచున్నారు.  కాని పాపము వలన మనుష్యుడు దారుణమైన బానిసత్వం క్రిందకు చేరుతున్నాడు.  పరిశుద్ద లేఖనం చెప్పుచున్నట్లు పాపము వలన వచ్చు జీతము మరణము.  మనుష్యుడు చేసే పాపము చిన్నదైన, పెద్దదైన, తెలియకుండానే మనుష్యుడు పాపపు బానిసత్వానికి గురి అవుచున్నాడు.  అంటే పాపపు ప్రభుత్వము క్రింద బానిసత్వము గా బ్రతుకుతున్నాడు, విశ్వం లో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, అవి అన్ని మనుష్యునికి ఏదో మేలు చేయాలని తాపత్రయ పడతావి, కాని ఈ పాప ప్రభుత్వం మాత్రం మనుష్యుని మీద నేర స్తాపన చేసి నిత్య మరణానికి అప్పగించాలని చూస్తుంది. ఐతే మనుష్యుడు దీనిని ఏమి పట్టించుకోక మనుష్యుడు తనకు, తన శరీరానికి అనుకూలముగా ఉందిలే అని పాపంలో పడి పోతున్నాడు.  అదే ఆనందం నిత్యానందం అనుకుంటున్నాడు.  చివరకు దాని అంతము ఘోర మరణము అని తలంచడం లేదు. తాను నడుచుకుంటున్న విధానము తాను చేసుడున్తున్న భక్తీ అంతా బాగానే ఉన్నది అనుకున్తున్నాడే గాని, నిత్య సత్యం ఏంటి అని గ్రహించలేక పోతున్నాడు.  
     ఓ పర్యాయం యేసు క్రీస్తు ప్రభువు, తనను వేమ్బదిస్తున్నటువంటి యూదులతో మీరు నా వాక్యము నందు నిలచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండుడి.  సత్యమును గ్రహించెదరు.  అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.  (యోహాను 8:31,32) అనగానే వెంటనే యూదులు యేసుతో సత్యమేమిటి? మాకు స్వతంత్రమేమిటి? మేము ఎవరికైనా బానిసలమైతిమా ఏమిటి? మేము అబ్రహం సంతానము మేము ఎవరికిని, ఎన్నటికిని దాసులమైయుండలేదే! మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారనిరి.  యేసు ప్రభువు వారు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుదగునని నీతో చెప్పుచున్నాను.  యేసు ఇంకను మాటలాడుచు మీరు అబ్రహం సంతానమని పేరు పెట్టుకుని దురాశలను నేరవేర్చుచున్నారు.  అలాగున చేయువాడు ఆయన వాడు కాదు.  మీ పితరుడైన అబ్రహం నొద్దకు సత్యము వచ్చినప్పుడు త్రునీకరింపక దానిని అనుసరించి స్వతంత్రుడు కాబడ్డాడు.  మీరైతే దేవునిని, దేవుడు పంపిన నన్ను త్రునీకరించుచున్నారు.  అందుకే సత్యమును అనుసరించుట స్వాతంత్ర్యమును పొందుట అనే విషయాన్ని గురించి తనను నమ్మి అనుసరిస్తున్న చెప్పుచున్నాను.
     ఇక్కడ గమనించి నట్లయితే నిజ స్వాతంత్ర్యము పొందాలంటే ముందుగా మనకు తప్పకుండ ఏది సత్యం అనేది తెలియబడాలి.  అది తెలియబడక పోబట్టే అనేకులు ఇంకను పాపంలోనే ఉంటున్నారు,  లోకానికి సత్యం చాల దూరముననే ఉన్నది.  సత్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని మున్దేసుకున్తున్నారు.  లోకమున ఉన్నదంతయు శరీరాష, నేత్రాష, జీవపు డంబము.  ఇవి అన్నియు గతించి పోయేవే. కాని దేవుని చిత్తమును నెరవేర్చు వారు మాత్రము నిరంతరము నిలుస్తారు.  అయితే పాపము మనలను అంత త్వరగా వదలదు అనే విషయాన్ని గమనించాలి.  ఆ ప్రభుత్వము క్రింద నుండి బయట పడడము అంత తేలికయినది కాదు.  కాని అప్పటి క్షణ మాత్రపు ఆనందాన్ని దృష్టి లో పెట్టుకుని దానికి బానిసలము అగుట సరి కాదు.  కనుక సత్యమయి ఉన్న యేసుని ఎరిగి ఆయన ద్వారా కలుగుతున్న స్వాతంత్ర్యమును పొండుకోనవలసిన వారమాయి యున్నాము, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్యము ఉంటుందన్నట్లు, దేవుని వద్ద మనకు, మన పాపములకు నిజమైన స్వాతంత్ర్యము కలదు.  మనము పాపమునకు బానిసలమగుట, త ద్వారా కలుగు నష్టమును ఎరిగి ప్రభుని వైపునకు పరుగెత్తాలి.  పాపమునకు విమోచన, పాప క్షమాపణ క్రీస్తునందున్నవి.  పాపమునుండి కలుగు విమోచన కంటే గొప్ప అయినా విమోచన మరియొకటి లేదు.  ప్రవక్త యిర్మియా ప్రవచనాన్ని బట్టి చిరుత పులి తన మచ్చలను మార్చుకోన గలదా? కూషు దేశస్తుడు తన రంగును మార్చుకోనగాలాడ? అంటే ఇవన్ని అసాద్యమయినప్పటికి, వీటి కన్నా కష్టమయినది పాపి పరిశుద్దుడుగా మారుటయే.  ఇది జరిగే పనేనా అని ఆలోచిస్తున్న సమయాన పాప విమోచకుడుగా యేసు ప్రత్యక్ష మగుట  గొప్ప  ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఆయన బందిన్ప బడిన వారికి విడుదలను ఇవ్వడానికి, దేవునితో ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని మన పాపముల కొరకు తన దేహమును అడ్డుపెట్టాడు.  ఇప్పటి వరకు మనుష్య్డుడు అనుభవిస్తున్న పాప బందకాలన్నిటిని, తెంచి వేశాడు. ఇక మనుష్యుడు పాపమునకు కట్టబడిన వాడు కాదు.  ఇప్పుడు క్రీస్తు చేత విమోచింపబడినవాడు.  మనందరి కొరకు ఒక్కసారే బలిగా అర్పణ పొంది మనకు ఈ గొప్ప విమోచనను అనుగ్రహించాడు.  ఇక మనము ఎవనికిని బానిసలము కాము.  మరి విశేషముగా అపవాదికి అసలు కాదు.  వాని నుండే మనకున్న పాపపు ముల్లును విరచి, పాప బంధకాలను తెంచి, మనలను ప్రేమించి స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు.  దేవునికి స్తోత్రము. 
---- బ్రదర్ ఎస్.ఆర్. అబ్రహం(బెతెస్త క్రీస్తు ద్వారా స్వస్తత)      

No comments:

Post a Comment