యేసు క్రీస్తు అందరికి ప్రభువు. కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కావలసినవాడు. ఆయన చూపిన మార్గం, త్యాగము, క్షమాగుణము, పునరుద్ధానము ప్రతి పాపికి అవసరమై ఉన్నవి. పాపము చేసిన వారంతా పాపానికి దాసులు , పాపం వీరిని నరకంలో పడవేస్తుంది, అక్కడ అగ్ని ఆరడు, ఆత్మ చావదు. పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ద రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. ఆయన మరణించి తిరిగి లేచిన మాదిరిగానే మరణించిన వారంతా ఒక రోజున తిరిగి లేస్తారు. వీరందరు దేవుని న్యాయపీటం ముందు కుడి వైపున కొంతమంది , ఎడమ వైపున కొంతమంది రెండు గుంపులుగా నిల్చుంటారు. అప్పుడు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. పాపము లేనివారు పరలోకానికి, పాపంతో ఉన్నవారు నిత్య నరకానికి వెళతారు.
యేసుక్రీస్తు ఎ ఒక్క మతానికి, కులానికి సొంతమైనవాడు కాదు, ఆయన అందరి కొరకు రక్తం చిందించాడు, అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన అందరివాడు. దేవుడు యేసుక్రీస్తు నందు అన్ని కులాలవారినీ, మతాలవారిని దీవింది రక్షించును గాక ... ఆమెన్....
---రాము
No comments:
Post a Comment