విపశ్యన అనేది ఒక ధ్యాన పద్దతి, దీనిని గౌతమి బుద్ధుడు వెలికి తీశాడు, ఇది అతి పురాతనమయిన విద్య. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది ఒక స్వయం పరిశీలన ప్రక్రియ, దీనిని ముందు ఆనా పాన ఉంటుంది. అంటే ఏకాగ్రతకు సంబందించింది.
2500 సం.లకు పూర్వము గౌతమ బుద్ధుడు లోకములో ప్రజలు పడుతున్న కష్టాలను శ్రమలను, జీవ మరణ సమస్యలను చూసి చలించి జీవితం మీద విరక్తి చెందాడు. ఈ ప్రజలను దుఖం నుండి విడిపించడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి అని అనుకుని, ఈ విపశ్యన అనే విద్యను వెలికి తీసినట్లుగా చెబుతుంటారు. దుఖాలకు కారణమయిన రాగ, ద్వేష,మొహాలను ప్రక్షాళన చేసే జీవకళ ఇది అని చెబుతుంటారు. నిత్య జీవితంలో అనుభవించే అశాంతిని దూరం చేస్తుంది. ఇష్టమయిన, అఇష్టమయిన పరిస్తితుల పట్ల సంయమనం లేకుండా ప్రతిస్పందించే మన పాత అలవాటు ఫలితంగా ఏర్పడే బంధనాలను తొలగిస్తుంది. వ్యక్తి, సమాజాల ప్రగతి కోసం, సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది. అని చెబుతుంటారు.
దీనిని ఇప్పుడు గోయంక గారు ఇండియా లో నేర్పిస్తున్నారు, దీని కొరకు పది రోజుల క్యాంపు ఒకటి ఏర్పాటు చేసి నేర్పిస్తున్నారు.
వీరు పాటించే నియమాలు :
1.జీవహింస చేయకూడదు
2.దొంగ తనము చేయదూడదు
3.బ్రహ్మచర్యాన్ని పాటించాలి
4.అబద్దం పలకకూడదు
5.ఏ విధమయిన మత్తు పదార్థాలు సేవించరాదు
పాత సాధకులు అదనంగా ఈ క్రింది వాటిని పాటించాలి
6.మధ్యాహ్నం తరువాత భోజనం చేయకూడదు
7.శరీర, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి
8.ఎత్తుగా, విలాసవంతంగా ఉన్న పడకలు వాడరాదు
ఇక్కడ ఎవరు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు, నేర్చుకున్న తరువాత ఇష్టమయిన వాళ్ళు ఎంత అయినా డొనేట్ చేయవచ్చు. ఇక్కడ గోయంక గారు చేసిన ప్రసంగాలను ప్రతి రోజు రాత్రి ఏడు గంటల కు వినిపిస్తుంటారు. అన్నీ దేవతలను గోయంకా గారు విమర్శిస్తారు, ఏడవ రోజున ప్రసంగంలో అంటారు. "యేసు క్రీస్తు నిజంగానే దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు కాబట్టే అంతటి ప్రేమ చూయించగలిగాడు. ". అని యేసు క్రీస్తు ప్రభువుని గురించి సాక్షం చెబుతాడు.
విపశ్యన చేయడం ద్వారా మోక్షానికి వెళ్ళవచ్చు అని అంటారు, దానిని నమ్మడం ఎలా?, విపశ్యన చేసిన వాళ్ళు మోక్షానికి వెళ్ళారు, అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? దుఖం నుండి విడుదల వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది అంటే నేను నమ్ముతాను, ఎందుకంటె ఆ అనుభవం నాకు ఉంది. కాబట్టి. మోక్షానికి వెళ్ళే తిరిగి వచ్చి మన ముందు సాక్షం గా నిల్చున్న వారు ఎవరయినా ఉన్నారా?, మోక్షం అంటే విశ్రాంతి పరిది, ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలము, దాని తరువాత చాల స్టొరీ జరుగుతుంది, పాపం చేసిన వాళ్ళు నిత్య నరకానికి, పాపం లేని వాళ్ళు పరలోకానికి వెళతారు.
మరి ఈ విపశ్యన పాపాన్ని తీసివేయగలుగుతున్నదా, గౌతమి బుద్ధుడు అలా చెప్పాడా, నాకు తెలిసినంత వరకు బుద్దుడు అలా చెప్పలేదు, .కాని నా తరువాత 500 సం.లకు బుద్దులలో కల్లా మహా బుద్దుడు పుట్టబోవుచున్నాడు, ఆయన ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది అని యేసు ప్రభువు గురించి ముందుగానే ప్రవచనం చెప్పాడు. గౌతమి బుద్దుడు మహా జ్ఞాని , మహా తపస్వి, కాబట్టే దేవుడు తన యొక్క మర్మాన్ని ఆయనకు బయలుపరచాడు. నేను విపశ్యన అక్కడ పద్దతులు, అక్కడి వాతావరణం నాకు చాల బాగ నచ్చాయి, ఆహారపు నియమాలు కూడా బాగున్నాయి, ఆనాపాన మరియు విపశ్యన ద్వారా మానసిక ఉల్లాసం లబిస్తాయి, అని నేను నమ్ముతాను, (అది కూడ తాత్కాలికమే, ఎదుకంటే అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత బయట జీవనం లో కలిసిపోయ్యే అవకాశం ఉంది.) యేసు ప్రభువు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడిపిస్తుంది, నన్ను పరిశుద్ద పరుస్తుంది, నన్ను మోక్షానికి తీసుకు వెళ్ళుతుంది అని ఘాడంగా నమ్ముతాను.
No comments:
Post a Comment