Wednesday, December 8, 2010

ఎందుకో

ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు 
ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు 
ఆ ప్రేమకు ఫలితము సిలువ త్యాగమా
ఆ ప్రేమకు అర్థం బలి దానమా 
1. నిన్నేరుగక ఆనాడు దూషించి తిరిగితిని 
నీ మహిమను నే కానక అవమాన పరచితిని 
నా కరములు నీవు వీడక కాపాడినది 
ఈ దీనుని ధన్యునిగా చేయాలనా  " ఎ " 
2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళ్ళలో 
దరిరాలేదేవ్వారు నన్నాదరింప గను
ఇలలో దొరకని ప్రేమను చూపించినది 
నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా " ఎ  " 
3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని
కలువరిలో నా కొరకు కరిగిపోతిని 
ఈ పాపిని పరిశుద్దులలో చేర్చాలనా
పరమపురికి నా నావ సాగాలనా "ఎ"

No comments:

Post a Comment