పల్లవి : ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా "2"
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనా
ఆలకించుమా ప్రభువా "2"
2. నా ఇంటి దీపం నీవే యని తెలిసి నా హృదయము
నీ కొరకు పదిలపరచితి
ఆరి పోయిన నా ఆత్మ దీపము వెలిగించుము
నీ ప్రేమతో ప్రభువా "2"
3. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై
నన్నాడుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి
వేరు చేయవు ప్రభువా "2"
No comments:
Post a Comment