ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటే - బలమైన ప్రేమది - నన్ను జయించే నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్య జీవమిచ్చే " 2 "" ఆశ్చర్య "
2. పావన యేసుని ప్రేమ సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చే " 2 "" ఆశ్చర్య "
3. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు " 2 " " ఆశ్చర్య "
4. నా స్థితి జూచిన ప్రేమ నాపై - జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే " 2 " " ఆశ్చర్య "
No comments:
Post a Comment