Wednesday, December 8, 2010

ఆనంద యాత్ర

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర 
యేసుతో నూతన యెరుశాలేము యాత్ర 
1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
ఎయి నోళ్ళతో స్తుతియించినను
తీర్చలేము ఆ ఋణమును  " ఆనంద "
2. రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై 
దేవ దూతలు మనకుండగా " ఆనంద "
3. కృతజ్ఞతా లేనివారు వేల కొలదిగా కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై 
కృప వెంబడి కృపను పొందెదము  " ఆనంద "
4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం 
ఆత్మానంద భారితులమై - ఆగమన కాంక్షతో సాగేదం  " ఆనంద "

No comments:

Post a Comment