Saturday, December 18, 2010

ఆరని

పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది 
            అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది 
            అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది 
            కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది      " ఆరని "
        1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది 
            బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది 
            ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది 
            ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
            కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది     " ఆరని "
        2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి 
            క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది 
            నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది 
            ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది 
            ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది        " ఆరని "
        3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు 
           చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా 
           ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది 
           ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు 
           ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది       " ఆరని "

No comments:

Post a Comment