Saturday, December 4, 2010

బైబిలు నిర్మాణము

--> బైబిలు 66 పుస్తకాల సముదాయము 
--> ఈ పుస్తకాలన్నీ దేవుని చేత ప్రేరేపించ బడినవి
--> ఈ 66 పుస్తకాలు రెండు భాగాలుగా విభజింపబడినవి 
--> పాత నిబంధన గ్రంధము, క్రొత్త నిబంధన గ్రంధము 
 --> పాత నిబంధన గ్రంధములో 39 పుస్తకాలు ఉన్నాయి
--> పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది 
--> పాత నిబంధన ను 4 ముఖ్య భాగాలు గా పేర్కొనవచ్చును.
--> 1. ధర్మ శాస్త్రము : మొదటి 5 పుస్తకాలు ధర్మ శాస్త్రం గా పేర్కొనవచ్చు.
--> ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితియోపదేశ కాండము.
--> 2. చరిత్ర : 6 నుండి 17 వరకు గల పుస్తకాలు చరిత్రను తెలియజేస్తున్నవి.
--> యెహోషువా, న్యాయాది పతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంధము, సమూయేలు రెండవ గ్రంధము, రాజులు మొదటి గ్రంధము, రాజులు రెండవ గ్రంధము, దిన వృత్తాంతాలు మొదటి గ్రంధము, దిన వృత్తాంతాలు రెండవ గ్రంధము, ఎజ్రా, నేహేమ్య, ఎస్తేరు.
--> 3. కావ్య గ్రంధము: 18 నుండి 22 వరకు గల పుస్తకాలను కలిపి కావ్య గ్రంధము గా చెప్పవచ్చును.
--> యోబు గ్రంధము, కీర్తనల గ్రంధము, సామెతలు, ప్రసంగి, పరమ గీతము 
--> 4. ప్రవక్తల గ్రంధము : దీనిలో 2 భాగాలుగా పేర్కొన వచ్చును.
--> పెద్ద ప్రవక్తలు : 23 నుండి 27 వరకు గల పుస్తకాలు పెద్ద ప్రవక్తలకు సంబందించినవి.
--> యెషయ గ్రంధము, ఈర్మియ, విలాప వాక్యములు, యేహెజ్కేలు, దానియేలు 
--> చిన్న ప్రవక్తలు : 28 నుండి 39 వరకు ఉన్న పుస్తకాలు చిన్న ప్రవక్తలకు చెందినవి.
--> హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్య, హగ్గయి, జెకర్య, మలాకి.
--> ప్రవక్తలు, యాజకులు, రాజులు, మరియు నాయకులు పాత నిబంధనను వ్రాశారు.
--> పాత నిబంధన సృష్టి ఆరంభముతో ప్రారంభమై క్రీ.పూ. 400 సం.ల వరకు చరిత్ర కలిగి ఉంటున్నది.
--> పాత నిబంధన తరువాత 400 సం.లు దేవుని మౌనము ఉన్నది.
--> పాత నిబధన లో ప్రముఖముగా ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు మెస్సియా ను గురించిన వాగ్దానములు మరియు ప్రవచనాలు ఉంటాయి.
--> క్రొత్త నిబంధన లో 27 పుస్తకాలు ఉన్నాయి, దీనిని 4 భాగాలుగా చెప్పవచ్చును.
--> అవి సువార్తలు, చరిత్ర, పత్రికలు, ప్రవచన గ్రంధము 
--> సువార్తలు : మొదటి 4 అధ్యాయాలను సువార్తలు గా చెప్పవచ్చును
--> అవి మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 
--> చరిత్ర : అపోస్తలుల గ్రంధమును(5) చరిత్ర గ్రంధముగా చెప్పవచ్చును.
--> పత్రికలు : 6 నుండి 26 వరకు గల పుస్తకాలలో పత్రికలు ఉన్నాయి.
--> అవి రోమీయులకు పత్రిక, కోరింతీయులకు మొదటి పత్రిక మరియు  రెండవ పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫేసియులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కోలోస్సయులకు పత్రిక, తేస్సలోనికయులకు మొదటి పత్రిక, మరియు రెండవ పత్రిక, తిమోతి కి మొదటి మరియు రెండవ పత్రిక, తీతుకు పత్రిక, ఫిలేమోనుకు పత్రిక, హేబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక రెండవ పత్రిక, యోహాను మొదటి, రెండవ, మూడవ పత్రికలు, చివరిగా యూదా పత్రిక.
--> వీటిలో 14 పత్రికలను పౌలు గారు వ్రాశారు, 2 పత్రికలను పేతురు గారు వ్రాశారు, 3 పత్రికలను యోహాను గారు వ్రాశారు, 1 పత్రికను యూదా గారు వ్రాశారు, 1 పత్రిక ను యాకోబు గారు వ్రాశారు.
--> ప్రవచన గ్రంధము : చివరి పుస్తము అయినటువంటి ప్రకటన గ్రంధము ను ప్రవచన గ్రంధముగా పెర్కొనవచును.
--> క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయ బడింది 
--> క్రొత్త నిబంధన యేసు ప్రభువు పుట్టుకతో ఆరంభమవుతుంది.
--> క్రొత్త నిబంధన యుగాంతమందు జరుగు సంగతులను తెలియజేస్తుంది.
                                 

No comments:

Post a Comment