సృష్టిలో తీయనైనది కన్నతల్లి ప్రేమ...
కన్నతల్లిని మించిన తీయనైన ప్రేమ నా యేసుని ప్రేమ!
కష్ట సమయంలో కన్నతండ్రి లాలన కన్న మిన్నయైనది ....
కన్నతండ్రి లాలన కంటె మితియైనది నా యేసుని ప్రేమ !
అన్నదమ్ముల బంధం కన్నా విలువైనది ...
ఆలు మగల ప్రేమ కన్నా అమరమైనది....
అపారమైన ఆస్తిపాస్తులకంటే ....
రమణీయమైన రత్నరాసులకంటే శ్రేష్టమైనది
సమీపిమ్పరాని తేజస్సులో తాను మాత్రమే వసించే శ్రీ యేసుని ప్రేమ !
కన్నబిడ్డల పేగుబంధం కంటె ....
ప్రాణ స్నేహితుల స్నేహబంధం కంటె....
యేసు క్రీస్తు తో రక్త సంబంధం.... ఎంత బలమైనది...ఎంత మధురమైనది!!
ఈ సృష్టిలో ఎవరూ చూపించలేనిది...
ఎవరి వలన పొందలేనిది... అపురూపమైన ...అమూల్యమైన యేసుని ప్రేమ !
ఇదే కల్వరి ప్రేమ...
నిజమైన ప్రేమకు నిదర్శనం !!
- సహొ. తోట. సునీల్ కుమార్,
No comments:
Post a Comment