Wednesday, December 1, 2010

పాపం చేసిన దావీదుకు పడిన శిక్షలు

యుద్ధం, మరణం:
అతడొక నిరపరాధిని (ఊరియ) చంపినందుకు ఎన్నడూ ఖడ్గం అతని ఇంటిని విడిచి వెళ్ళలేదు.  అతను చనిపోయేంత వరకు యుద్ధం, మరణం అతన్ని బంధించాయి.
శిశువు మరణం:
బత్సేబాతో అతను చేసిన వ్యభిచారం ఫలితంగా జన్మించిన శిశువు మరణించింది. 
అతని కుటుంబ సభ్యులకు విపత్తు:
ఊరియ వైవాహిక జీవితపు పవిత్రతను అతడు పాడు చేసినందు వలన అతడి కుటుంబ సభ్యులకు, కుటుంభ సభ్యుల ద్వారానే విపత్తు ఏర్పడింది.  దావీదు భార్యలు, పిల్లలు, మానభంగాలు, వావి వరసలు పాటించని లైంగిక సంబంధాలు, వ్యభిచారాలతో సహా ఎన్నో నీచాతి నీచమైన అవినీతి కార్యాల్లో పాల్గొన్నారు.
కుమారునికి వ్యతిరేకం గా కుమారుడు :
దావీదు  కుమారుడు అబ్షాలోము, తన చెల్లి తామారును మానభంఘం చేసిన తన మారు తల్లి కొడుకు అమ్నోనును చంపాడు.
తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు :
అబ్షాలోము దావీదు ను జయించి, కూలదోసి, సింహాసనం మీద నుండి అతన్ని వెళ్ళగొట్టాడు.  దావీదు ఘోరమైన అవమానం పాలయ్యేలా అబ్షాలోము తన తండ్రి యొక్క ఉంపుడు గట్టేలను చేర్చుకొని వారితో లైంగిక సంబంధాలను కొనసాగించాడు.
తన ప్రజలచే శపించ బడ్డాడు :
దావీదు అబ్షాలోము వద్ద నుండి పారిపోయే సమయం లో తన ప్రజలచే శపించబడ్డాడు. 
ఎక్కువగా ప్రేమించిన కుమారుని మరణం :
దావీదు కుమారుడైన అబ్షాలోము, చివరకు దావీదు సేనాదిపతి యోవాభు ద్వారా చంపబడ్డాడు. 
పగిలిన హృదయం :
దవీదుకు అతని కుటుంబానికి ఈ విపత్తులు సంభావిన్చినప్ప్డు, దావీదు హృదయం నలిగి, పగిలి పోయింది. 

No comments:

Post a Comment