Wednesday, December 1, 2010

బైబిలు మన చేతుల్లోకి ఎలా వచ్చింది?

బైబిలు మన చేతుల్లోకి రావడానికి దేవుడు కొందరిని  పని ముట్లను  వాడుకున్నాడు.
ప్రత్యక్షత:
దేవుడు తన్ను తాను మానవునికి బయలుపరచుకోను టయే ప్రత్యక్షత.
బైబిలు లో దేవుడు అనేక విధానాల ద్వారా తన్ను తాను ప్రత్యక్ష పరచుకొన్నాడు. (హెబ్రీ 1:1)
దేవుడు  అనేక పద్దతుల ద్వారా మాట్లాడుతాడు.
1. దూతలు:
దూత  అబ్రహాము తో మాట్లాడుట (ఆది 18)
దూత లోతుతో మాట్లాడుట (ఆది 19)
దూత దానియేలు తో మాట్లాడుట (దాని 9:21-27)
దూత జేకర్య తో మాట్లాడుట (లూక 1:11-20)
దూత మరియ తో మాట్లాడుట (లూక 1:26-37)
దూత గొర్రెల కాపరుల తో మాట్లాడుట (లూక 2:8-14)
దూత స్రీ ల తో మాట్లాడుట (మత్తయి 28:5-7)
దూత ఫిలిప్పు తో మాట్లాడుట (అ.కా. 8:26)
దూత పేతురు  తో మాట్లాడుట (అ.కా. 12:7-10)
2. స్వరము :
ఆదాము తో..........ఆది 3:9-19  
నోవాహు తో .........ఆది 6:13-21
అబ్రహాము తో .......ఆది 12:1-3
మోషే తో ..............నిర్గ 20:1-17
యెహోషువా తో..యెహో 1:1-9
సమూయేలు తో....1సమూ 3:1-14
నాతాను తో ..........IIసమూ 7:4-6
ఇర్మియ తో  ..........ఈర్మియ 1:4,5
3.దర్శనం :
యాకోబు దర్శనం ................ ఆది 46:2
దావీదు దర్శనం  ...................1దిన 21:16 
యెషయ కు దర్శనం ..............యష 6:1-8
దానియేలు కు దర్శనం ...........దాని 7,8 
యేహెజ్కేలు కు దర్శనం ..........యెహే37
అననీయ కు దర్శనం ..............అ.కా. 9:10
కోర్నేలి కు దర్శనం  .................అ.కా. 10:3-6
పేతురు కు దర్శనం .................అ.కా. 10:10-16
పౌలు కు దర్శనం ....................అ.కా.  16:9


ప్రేరేపణ :
పొందుకున్న దేవుని ప్రత్యక్షత ను దేవుని ఆత్మ సహాయముతో దేవుడు కోరుకున్న విధముగా సొంత మాటలలో కాగితం మీద రాయడమే . (1తిమో 3:16)
ప్రేరేపణ ను గూర్చి వేరు వేరు అభిప్రాయాలున్నాయి.
సహజ సిద్ధాంతము :
షేక్ స్పియర్ వ్రాసినట్లు గానే బైబిలు కూడ సహజం గా దైవావేషం లేకుండా వ్రాయబడింది అని వారు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
డిక్టేషన్ పద్దతి :
దేవుడు డిక్టేషన్ ద్వారా వ్రాయించాడని వాళ్ళు చెబుతారు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
కాన్సెప్ట్ థియరీ :
దేవుడు కాన్సెప్ట్స్ మాత్రమే ప్రేరేపించాడు కాని పదం కాదు.
ఇది బైబిలుకు వ్యతిరేకమైనది.
పక్షపాత సిద్దాంతము :
దేవుడు బైబిలు లో కొన్ని బాగాలను మాత్రమే ప్రేరేపించాడు గాని మొత్తాని కాదు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
ఆత్మీయ నియమపు పద్దతి:
బైబిలు లో నైతిక విషయాలు మాత్రమే ప్రేరేపించ బడ్డాయి, కాని శాస్త సంబంధమైనవి కావు.
ఇది బైబిలు కు వ్యతిరేకమైనది.
మొత్తం పదములు సిద్ధాంతము:
దేవుడు కాన్సెప్ట్స్ ను మాత్రమే కాక ప్రతి పదమును ప్రేరేపించాడు
ఇది గ్రంధ కర్తల స్వేచాలోనే జరిగింది
ఇది వాక్యాను సారమైనది.   (IIతిమో 3:16)  

No comments:

Post a Comment