బైబిలు యొక్క అతి ప్రముకమైన అంశం ఏమనగా దేవుడు తన సంతోషం, ఆనందం మరియు మహిమ కొరకు సమస్తమును సృజించి తన రాజ్యమును కట్టుకోనుచున్నాడు.(యేష 43:7,ప్రక 4:11, ఎఫేసి 1:6,12-14, 3:22)
1. దేవుని గుణ గణాలు ( లక్షణాలు)
దేవుడు తనను తాను బయలు పరచుకుంటే తప్ప మనము ఆయనను తెలుసుకోలేము. (ఆది 1:1)
దేవుడు తన పరిశుద్ద మరియు నీతి గుణములను బయలుపరచుకున్నాడు (లేవి 11:44, 1 పేతురు 1:16)
దేవుడు తనను తాను వివిధ రకాలుగా బయలు పరచుకుంటాడు
సృష్టి (ఆది 1,2 అధ్యాయాలు )
మనుష్యులు (ఆది 1;26, ఈర్మియ 1:4,5 )
యేసు ప్రభువు (యోహాను 14:9,10)
దూతలు (అ.కా.8:26, 12:7-10)
అద్బుతాలు, ఆశ్చర్య కార్యాలు (హెబ్రీ 2:3,4, మార్క్ 2:1-13 )
దర్శనాలు (అ.కా. కోరి )
అపోస్తలులు, ప్రవక్తలు (II పేతురు 3:2, యూద 1:17 )
లేఖనాలు (II తిమో 3:16 )
2. పాపమునకు అవిదేయతకు తీర్పు :
లేఖనము పాపము గురించి మరియు పాపమునకు వచ్చే తీర్పు గురించి మాట్లాడుతుంది. (రోమ 6:23)
పాపానికి తాత్కాలిక శిక్ష మరియు నిత్యపు శిక్ష ఉంటుంది
బైబిలు అధ్యాయాలలో (1189) కేవలం నాలుగు అధ్యాయాలలో మాత్రమే పాపం లేదు. (ఆది 1,2, లూక 22,23)
3. విశ్వాసమునకు, విధేయతకు ఆశీర్వాదము :
మన పక్షముగా విశ్వాసమును మరియు విధేయతను కలిగి ఉన్నట్లయితే దేవుడు తన పక్షముగా మనలను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు.
(లూక 10:20, Iయోహాను 5:13, రోమ 4:3,ద్వి.కా. 28:1-14, యోహాను 3:16)
4. రాబోవు రాజ్యము మరియు మహిమ
పాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మొదటి, రెండవ రాకడ గురించి వ్రాయబడింది.
(యెషయ 9:6, అ.కా. 1:11, హెబ్రీ 9:28, ప్రక 20:6)
బైబిలు లో 66 పుస్తకాల కంటె ఎక్కువ పుస్తకాలు పెట్టక పోవడానికి గల కారణము :
1. ఆది కాండము నకు మరియు ప్రకటన గ్రంధమునకు ఉన్న పోలిక
ఆది కాండము సృష్టి ఆరంభము తో ప్రారంభ మయితే , ప్రకటన గ్రంధము సృష్టి అంతము తోను, నూతన సృష్టి ఆరంభము తోను ముగుస్తుంది. (ఆది 1:1, ప్రక 21:1-5)
2. బైబిలు విశ్వాసపు బోధ ఒక్కసారే సంఘమునకు అప్పగించబడి ఉన్నది. (యూద 3 వచనము)
3. బైబిలు హెచ్చరికలు :
బైబిలు లో 4 సార్లు దేవుని వాక్యమునకు ఏది కలుపరాదని మరియు ఏదియు తీసివేయ కూడదని హెచ్చరింప బడింది. (ద్వి.కా. 4:1,2, 12:32, సామే 30:5,6, ప్రక 22:18,19)
కేవలం ప్రకటన 22:18,19 లోనే భయంకరమైన తీర్పు ఉంటున్నదని చెప్పబడింది.
ప్రకటన గ్రంధం లో ఇచ్చిన హెచ్చరిక విశ్వవ్యాప్త మైనది, అది బైబిలు అంతటికి వర్తిస్తుంది.
4. ఆదిమ సంఘపు సాక్ష్యము : బైబిలు 66 పుస్తకాలు మాత్రమే ప్రేరేపించ బడ్డాయని ఆదిమ సంఘం బలంగా నమ్ముతుంది.
No comments:
Post a Comment